సాక్షి, ఎల్కతుర్తి(వరంగల్ అర్బన్) : ఆ తల్లి పేగు తెంచుకుని జన్మించిన కుమారుడే ఆమె అంత్యక్రియలను అడ్డుకున్నాడు. తల్లి పేరిట ఉన్న భూమిని రాసిచ్చే వరకు తలకొరివి పెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు. వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధి జీల్గుల గ్రామంలో బుధవారం ఈ దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తంగెళ్లపల్లి సారయ్య–రాజమ్మ(70) దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే సారయ్యతో పాటు పెద్ద కుమారుడు సమ్మయ్య అనారోగ్యంతో మృతిచెందారు. ప్రస్తుతం రెండో కుమారుడు జంపయ్య, చిన్న కుమారుడు రవీందర్ ఉన్నారు.
వీరికి గతంలోనే ఆస్తుల పంపకాలు పూర్తి కాగా, తల్లి రాజమ్మ పేరిట ఎకరన్నర భూమి ఉంది. వృద్ధా ప్యంతో రాజమ్మ బుధవారం రాజమ్మ మృతి చెందింది. తల్లికి సంప్రదాయం ప్రకారం చిన్నకుమారుడు రవీందర్ కర్మకాండలు నిర్వహించాల్సి ఉండగా.. అతడు అంగీకరించలేదు. తల్లి పేరిట ఉన్న భూమిని తనకు రాసిస్తేనే తలకొరివి పెడతానని స్పష్టం చేశాడు. దీంతో తల్లి మృతదేహం పక్కనే కొడుకులిద్దరూ గొడవకు దిగారు. గ్రామస్తులు, పోలీసులు చెప్పినా కూడా రవీందర్ వినలేదు. దీంతో రెండో కుమారుడు జంపయ్య తన తల్లికి అంత్యక్రియలు పూర్తిచేశాడు.
Comments
Please login to add a commentAdd a comment