mother funerals
-
భూమి ఇస్తేనే.. తలకొరివి పెడతా..!
సాక్షి, ఎల్కతుర్తి(వరంగల్ అర్బన్) : ఆ తల్లి పేగు తెంచుకుని జన్మించిన కుమారుడే ఆమె అంత్యక్రియలను అడ్డుకున్నాడు. తల్లి పేరిట ఉన్న భూమిని రాసిచ్చే వరకు తలకొరివి పెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు. వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధి జీల్గుల గ్రామంలో బుధవారం ఈ దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తంగెళ్లపల్లి సారయ్య–రాజమ్మ(70) దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే సారయ్యతో పాటు పెద్ద కుమారుడు సమ్మయ్య అనారోగ్యంతో మృతిచెందారు. ప్రస్తుతం రెండో కుమారుడు జంపయ్య, చిన్న కుమారుడు రవీందర్ ఉన్నారు. వీరికి గతంలోనే ఆస్తుల పంపకాలు పూర్తి కాగా, తల్లి రాజమ్మ పేరిట ఎకరన్నర భూమి ఉంది. వృద్ధా ప్యంతో రాజమ్మ బుధవారం రాజమ్మ మృతి చెందింది. తల్లికి సంప్రదాయం ప్రకారం చిన్నకుమారుడు రవీందర్ కర్మకాండలు నిర్వహించాల్సి ఉండగా.. అతడు అంగీకరించలేదు. తల్లి పేరిట ఉన్న భూమిని తనకు రాసిస్తేనే తలకొరివి పెడతానని స్పష్టం చేశాడు. దీంతో తల్లి మృతదేహం పక్కనే కొడుకులిద్దరూ గొడవకు దిగారు. గ్రామస్తులు, పోలీసులు చెప్పినా కూడా రవీందర్ వినలేదు. దీంతో రెండో కుమారుడు జంపయ్య తన తల్లికి అంత్యక్రియలు పూర్తిచేశాడు. -
తల్లి అంత్యక్రియల కోసం భిక్షాటన
సాక్షి, చెన్నై: అనారోగ్యంతో మరణించిన తల్లి అంత్యక్రియలకు చిల్లిగవ్వకూడా లేకపోవడంతో ఏం చేయాలో తోచని ఇద్దరు పిల్లలు భిక్షాటన చేసిన దారుణఘటన తమిళనాడులో జరిగింది. దిండుగల్ జిల్లాలోని మేటుపట్టికి చెందిన కాళియప్పన్, విజయ దంపతులకు మోహన్(14), వేల్ మురుగన్(13) కుమారులు, కుమార్తె కాళీశ్వరి ఉన్నారు. గతంలోనే కాళియప్పన్ చనిపోయాడు. దీంతో విజయ ఒక్కతే రెక్కల కష్టంతో పిల్లల్ని చూసుకుంటోంది. ఇటీవల ఆమెకు రొమ్ము కేన్సర్ సోకింది. దీంతో కుమారులు బడి మానేసి కూలిపనికి వెళ్తున్నారు. విజయ పరిస్థితిని చూసిన ఓ ఆశ్రమం కుమార్తె కాళీశ్వరి బాధ్యతలు స్వీకరించింది. ఆరోగ్యం క్షీణించిన విజయను దిండుగల్ ఆస్పత్రిలో చేర్పించగా గురువారం కన్నుమూసింది. తల్లి మృతిపై బంధువులకు సమాచారం అందించినా ఎవ్వరూ స్పందించకపోవడం, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో అంత్యక్రియల కోసం ఇద్దరు పిల్లలు ఆస్పత్రిలో భిక్షాటనకు దిగారు. విషయం తెల్సుకున్న ఆస్పత్రి సంక్షేమాధికారి మాలతి అంత్యక్రియల ఏర్పాట్లు చూశారు. చివరికి ప్రభుత్వ దహన వాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తిచేశారు. -
ఆస్పత్రిలో ఉన్నా.. సాయం మానలేదు
తమిళనాడుకు చెందిన 48 ఏళ్ల వ్యక్తి తాను తిరిగి స్వదేశానికి వెళ్లడానికి అవసరమైన పత్రాల కోసం యూఏఈలో చాలా కాలంగా కోర్టు చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నాడు. రెండేళ్ల పాటు అతడు 20 సార్లు అలా తిరిగాడు. అతడి కష్టం విషయం ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు తెలిసింది. మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో సుష్మా ఆస్పత్రిలో ఉన్న విషయం తెలిసిందే. అయినా.. తిరుచిరాపల్లికి చెందిన జగన్నాథన్ సెల్వరాజ్ అనే వ్యక్తి గురించి తెలియడంతో.. ఆమె వెంటనే అతడికి సాయం చేసి, తిరిగి సొంత గ్రామానికి రప్పించారు. ఈ విషయాన్ని సుష్మా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. సెల్వరాజ్ తల్లి తమిళనాడులో మరణించినా.. ఆమె అంత్యక్రియలకు వెళ్లడానికి అతడికి అనుమతి లభించలేదు. అతడి కష్టాన్ని దుబాయ్‌కి చెందిన ఖలీజ్ టైమ్స్ పత్రిక ప్రచురించడంతో సుష్మా దృష్టికి విషయం వెళ్లింది. వెంటనే ఆమె కలగజేసుకున్నారు. భారత కాన్సులేట్‌ను సంప్రదించి అతడికి కావల్సిన పత్రాలు ఇప్పించారు. ట్రాఫిక్, ఎండ, ఇసుక తుపాన్లు.. ఇలాంటి వాతావరణంలో తాను ట్రెక్కింగ్ చేసుకుంటూ దుబాయ్ రోడ్ల మీద వెళ్లినట్లు సెల్వరాజ్ చెప్పాడు. దుబాయ్ శివార్లలోని సోనాపూర్‌లో గల తన నివాసం నుంచి ప్రతిరోజూ 22 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కోర్టుకు వెళ్లేవాడినన్నాడు. దాదాపు రెండేళ్ల నుంచి అలా కోర్టుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం కనిపించలేదు. చివరకు సుష్మా స్వరాజ్ చొరవతో ఇంటికి చేరుకున్నాడు. We have brought him back to India and sent him to his village. He went up and down to the court 20 times over a year. That made it 1000 Kms. https://t.co/UGxjGE1Uhf — Sushma Swaraj (@SushmaSwaraj) 6 December 2016 -
తల్లి మరణం తట్టుకోలేక కూతురు మృతి
చింతపల్లి: నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లి మరణాన్ని ఆ కూతురు తట్టుకోలేక‘పోయింది’. కళ్లెదుటే విగతజీవిగా పడి ఉన్న మాతృమూర్తి మృతదేహంపై పడి తనూ కూడా ప్రాణాలొదిలింది.. ఈ ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లిలో గురువారం చోటు చేసుకుంది. చక్కని బక్కమ్మ(80)కు ఇద్దరు కుమారులు, కూతురు అంజమ్మ (60) ఉన్నారు. బక్కమ్మ తన పెద్ద కుమారుడు అంజయ్య వద్ద ఉంటోంది. కాగా, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బక్కమ్మ గురువారం మృతిచెందింది. విషయం తెలుసుకున్న అంజమ్మ.. తల్లి అంత్యక్రియలలో పాల్గొనేందుకు అత్తింటి నుంచి స్వగ్రామానికి వచ్చింది. తల్లి మృతదేహంపై పడి బోరున విలపిస్తూ ప్రాణాలు విడిచింది.