ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న జగిత్యాల పోలీసులు
జగిత్యాల క్రైం: ఓ వ్యక్తి దారుణ హత్యకు గురవగా మూడు రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల పట్టణ శివారులోని టీఆర్‌నగర్‌కు చెందిన జగన్నాథం సమ్మయ్య గత నెల 28వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా మంగళవారం తాటిపల్లి పెద్ద చెరువులో సమ్మయ్య మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్, రూరల్ సీఐ కృష్ణకుమార్, ఎస్సై చిరంజీవి సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని బయటకు తీయించారు. (చదవండి: ట్రాఫిక్ చలాన్ ఎలా వేస్తారని సర్పంచ్ హల్‌చల్)
స్థానికుడితోపాటు కోరుట్లకు చెందిన మరో వ్యక్తితో కలిసి సమ్మయ్య పెద్దచెరువు సమీపంలో పేకాడి, మద్యం తాగినట్లు అనుమానిస్తున్నారు. పేకాట విషయంలో తలెత్తిన వివాదంతో మిగతా ఇద్దరు బండరాయితో అతని తలపై మోది హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, బాధిత కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని, విచారణ చేపడుతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. మృతుడి సోదరుడు నాగేశ్వర్‌రావు ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. (చదవండి: ‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు)
Comments
Please login to add a commentAdd a comment