
పింగాణీ కాదు.. పేక ముక్కలు
మేస్త్రీ అయిన వాంగ్‌కు కొన్నేళ్ల క్రితం ఒక పాప వీధిలో ప్లేయింగ్ కార్డులను చిన్నచిన్న త్రిభుజాకారంగా చుడుతోంది. అది చూసిన వాంగ్... ఆ టెక్నిక్‌ను ఉపయోగించుకుని వివిధ ఆకారాల్లో వస్తువులను ఎందుకు తయారుచేయకూడదు అని అనుకున్నాడు. దీంతో తొలిసారిగా అతనికి కలిగిన ఆ ఆలోచనతో పింగాణీ పాత్రల ఆకారాలను తయారు చేయడం మొదలు పెట్టాడు. ఇతను చేసిన ఒక పాత్ర 106 సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది. అందుకు 5 వేల కార్డులు ఉపయోగించి ఒక వారం రోజుల్లో పూర్తి చేశాడు.