ఆదిభట్ల (రంగారెడ్డి): పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను మంగళవారం సాయంత్రం ఆదిభట్ల పోలీసులు ఆరెస్టు చెశారు. సీఐ అశోక్‌కుమార్ కథనం ప్రకారం.. రాజేంద్రనగర్ మండలం పుప్పాలగూడ గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఇబ్రహీంపట్నం మండలం బోంగ్లూర్ అవుటర్‌రింగ్ రోడ్డు పక్కనే పేకాట ఆడుతున్నారు.
ప్రేటోలింగ్ చేస్తున్న పోలీసుల కంట పడడంతో ఆరుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3,400 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.