అబిడ్స్(హైదరాబాద్): ఓ జూదగృహంపై నగర వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి, 11 మందిని అరెస్టుచేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... పంజాగుట్ట అమృత విల్లే అపార్ట్‌మెంట్స్‌లోని ప్లాట్ నంబర్ 62లో కొన్ని రోజులుగా జూదం(త్రీ కార్డ్స్ గ్యాబ్లింగ్) ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం సాయంత్రం దాడి చేశారు. ఈ సందర్భంగా 11 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద 65 వేల నగదు, 13 సెల్‌ఫోన్‌లను స్వాధీన పర్చుకున్నారు.
జూదగృహం నిర్వహిస్తున్న బిట్ట మురళీకృష్ణ (43)తో పాటు మరో పదిమందిని అరెస్టు చేశారు. అరెస్ట్‌చేసిన 11 మందితో పాటు నగదును, సెల్‌ఫోన్‌లను కేసు దర్యాప్తు చేసేందుకు పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈ దాడుల్లో వెస్ట్‌జోన్ ఇన్‌స్పెక్టర్ ఎల్. రాజవెంకట్‌రెడ్డి, ఎసై ్సలు జలంధర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌గౌడ్‌లతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
జూదగృహంపై టాస్క్‌ఫోర్స్ దాడి: 10 మంది అరెస్ట్
Published Thu, Jul 2 2015 10:55 PM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM
Advertisement
Advertisement