చిలమత్తూరు ఎంపీపీ పదవి కోసం అధికార బలం ప్రయోగం
ఒక్క ఎంపీటీసీ లేకపోయినా పదవి కోసం దుష్ట రాజకీయం
సర్వసభ్య సమావేశానికి వెళ్లకుండా ఎంపీపీకి బెదిరింపులు
రాష్ట్రం విడిచి వెళ్లిన ఎంపీపీ.. సమావేశం వాయిదా
9 మంది ఎంపీటీసీలను పార్టీలోకి చేర్చుకున్న టీడీపీ
వారితో పదవిని చేజిక్కించుకొనే కుట్ర
బాలకృష్ణ నియోజకవర్గంలో బరితెగింపు
చిలమత్తూరు: ఒక్క ఎంపీటీసీ కూడా లేకపోయినా, అధికారం బలంతో ఎంపీపీ పదవి చేజిక్కించుకొనేందుకు టీడీపీ నీచ రాజకీయానికి దిగింది. నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు ఎంపీపీని బెదిరించి, అధికార బలాన్ని ఉపయోగించి, ఆయన మండల సమావేశంలో పాల్గొనకుండా అడ్డుకొంది. రాష్ట్రం విడిచి వెళ్లిపోయేలా చేసింది. శనివారం జరగాల్సిన మండల సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేయించింది. అక్కడ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి, 144 సెక్షన్ విధించి, భారీ సంఖ్యలో కార్యకర్తలతో హంగామా సృష్టించింది. 9 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను బలవంతంగా టీడీపీలో చేర్చుకొంది.
ఈ ఎంపీటీసీల బలంతో ఎంపీపీ పదవిని చేజిక్కించుకొనేందుకు ఎత్తులు వేస్తోంది. ఒక్క ఎంపీటీసీ కూడా గెలవని టీడీపీ.. చిలమత్తూరు ఎంపీపీ పదవి కోసం పోలీసులను ఉపయోగించింది. ఇందుకోసం ఎంపీపీ పురుషోత్తంరెడ్డిని లక్ష్యంగా చేసుకొంది. ఆయన్ని పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురి చేసింది. సమావేశానికి హాజరైతే రౌడీïÙట్ తెరిపించి జిల్లా బహిష్కరణ చేస్తామని పోలీసులు, టీడీపీ నేతలు బెదిరించినట్టు సమాచారం. దీంతో శనివారం మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొనాల్సిన పురుషోత్తమరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయినట్లు సమాచారం.
ఎంపీపీ లేకపోవడంతో మండల సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేసినట్టు ఎంపీడీవో ప్రకటించారు. సర్వసభ్య సమావేశం సందర్భంగా గొడవలు జరుగుతాయంటూ పోలీసులు 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. అయితే దాని ప్రభావం ఎక్కడా కనిపించలేదు. వందలాది టీడీపీ కార్యకర్తలు, నాయకులు మండల కేంద్రంలో హల్‌చల్ చేశారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి బలప్రదర్శన చేశారు. అయినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు.
టీడీపీలో లుకలుకలు
వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను చేర్చుకోవడంతో టీడీపీలో విభేదాలు నెలకొన్నాయి. తమ అనుమతి లేకుండా ఎలా పార్టీల్లో చేర్చుకుంటారంటూ ఆ పంచాయతీల్లోని టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీపీ పదవి పైనా టీడీపీలో నాగరాజు యాదవ్, రంగారెడ్డి రెండు వర్గాలుగా విడిపోయారు. ఎవరికి వారు ఎంపీపీ పదవిని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తమ పారీ్టలోకి వచి్చన ఎంపీటీసీలను వారి శిబిరాల్లో చేర్చుకొనే ప్రయత్నాల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment