సాక్షి, తిరుపతి: వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సోమవారం కుప్పం ఎంపీపీ అశ్విని, ఎంపీటీసీలు కలిశారు. తన తండ్రి కుప్పం వైఎస్ఆర్ కాంగ్రెస్ మండలం కన్వీనర్ మురుగేశ్, సోదరుడు శ్రీను రాజేంద్ర ప్రసాద్ అక్రమంగా అరెస్టు చేశారంటూ ఎంపీపీ ఆవేదన వ్యక్తం చేశారు. మిథున్‌రెడ్డిని కలిసిన అనంతరం ఎంపీపీ అశ్విని మీడియాతో మాట్లాడారు.
‘‘ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా నిలుస్తుందని ఎంపీ మిథున్‌రెడ్డి చెప్పారు. తప్పుడు కేసులతో ఇబ్బంది పెడుతున్నారు. జనవరి నెలలో మల్లనూరు పంచాయితీ ట్రాక్టర్ పోయిందని మేము పిర్యాదు చేశాం, ఇప్పుడు మాపైనే కేసు పెట్టారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరమని ఒత్తిడి చేస్తున్నారు, లేదంటే కుప్పం ఎంపీపీ పదవికి రాజీనామా చేయమంటున్నారు. కుప్పంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలుపై తప్పుడు కేసులు బనాయించి సీఐ ఇబ్బందులు పెడుతున్నారు. అన్ని రోజులు ఒకేలా ఉండవు.. ఐదేళ్ల తర్వాత పరిస్థితి మారుతుంది.. అప్పుడు మీ పరిస్థితి ఆలోచన చేసుకోండి’’ అని ఆమె అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment