మార్టూరు: అదృష్టం ఎవరిని ఎప్పుడు వెతుక్కుంటూ వస్తుందో ఎవరూ చెప్పలేరు. అందుకు ఉదాహరణ గ్రామ వలంటీర్‌గా ప్రస్థానం ప్రారంభించి మార్టూరు మండల అధ్యక్షురాలిగా అధికార పీఠం ఎక్కనున్న భూక్యా శాంతాబాయి. ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని నాగరాజుపల్లి తండాకు చెందిన శాంతాబాయి బీకాం, బీఈడీ పూర్తి చేసింది. మార్టూరు తండాకు చెందిన ఇంజనీరింగ్ పట్టభద్రుడు బాణావత్ బాబు నాయక్‌తో వివాహమైంది. మార్టూరులో గ్రామ వలంటీర్‌గా పనిచేస్తున్నది.
అయితే మార్టూరు ఎంపీపీ పదవి ఎస్టీ మహిళకు రిజర్వు కావడంతో స్థానిక జనార్ధన కాలనీ ప్రాదేశికం నుంచి ఎంపీటీసీగా బరిలోకి దిగింది. టీడీపీకి చెందిన తన ప్రత్యర్థిపై 1,184 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచింది. మండలంలోని 21 మంది ఎంపీటీసీలలో ఎస్టీ కేటగిరీ కింద మరెవ్వరూ అభ్యర్థులు లేకపోవడంతో ఎంపీపీగా శాంతాబాయి ఎన్నిక లాంఛనమే. మండలంలోని ఎంపీటీసీలందరిలోకి ఆమె పిన్న వయసు్కరాలు కావడం విశేషం.
నిస్వార్థంగా ప్రజా సేవ చేస్తా..
గత ఆగస్టులో ఆడబిడ్డకు జన్మనిచచ్చిన నేను నెల తిరక్కుండానే ఎంపీపీ కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సీఎం జగన్ పురుషులతో సమానంగా మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించడం నచ్చి రాజకీయాల్లో వచ్చా. మండల ప్రజలందరి అభివృద్ధి కోసం పాటు పడతా. – శాంతాబాయి
Comments
Please login to add a commentAdd a comment