చాగలమర్రి మండల పరిషత్ అధ్యక్షుడు మస్తాన్‌వలికి జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి నోటిసులు అందాయి.
చాగలమర్రి ఎంపీపీకి నోటీసులు
Feb 14 2017 11:57 PM | Updated on Sep 5 2017 3:43 AM
చాగలమర్రి: చాగలమర్రి మండల పరిషత్ అధ్యక్షుడు మస్తాన్‌వలికి జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి నోటిసులు అందాయి. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మూడు సాధారణ సమావేశాలకు వరుసగా గైర్హాజరయ్యారు. ఇందుకు సంబంధించి ఎంపీడీఓ శ్రీలత గత సమావేశం తర్వాత జిల్లా ఉన్నతాధికారులకు నివేదించారు. మస్తాన్‌వలి ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఏడాది కాలంగా కడప కేంద్ర కరాగారంలో ఉన్నారు. అప్పటి నుంచి మండల ఉపాధ్యక్షురాలు భాగ్యలక్ష్మి ఎంపీపీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నోటీసులకు సంబంధించి ఎంపీపీ 30 రోజుల్లో సంజాయిషీ(వివరణ) ఇవ్వాల్సి ఉందని ఎంపీడీఓ తెలిపారు.
Advertisement
Advertisement