redsandal
-
250 కిలోల ఎర్రచందనం సీజ్,15 మంది అరెస్ట్
సాక్షి, కడప : వైఎస్సార్ జిల్లా సుండుపల్లి శేషాచల అడవుల్లో తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 250 కిలోల ఎర్రచందనం దుంగలను పోలీసులు బుధవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 15 మంది స్మగ్లర్లను అరెస్టుచేశారు. పట్టుకున్న ఎర్రచందనం విలువ 15 లక్షల రూపాయలు ఉంటుందని వారు చెప్పారు. స్మగ్లర్ల నుంచి 8 మొబైల్ ఫోన్లు, రూ.30 వేల నగదు, ఒక టెంపో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కడప డీఎస్పీ మాసూమ్‌బాషా తెలిపారు. -
టాస్క్‌ఫోర్స్ పోలీసులపై స్మగ్లర్ల రాళ్లదాడి
సాక్షి, కాశీనాయన/ చంద్రగిరి : వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ళ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని నల్లమల అడవుల్లోను, చిత్తూరు జిల్లా నాగపట్ల ఈస్టు బీట్ పరిధిలోని శేషాచల అటవీ ప్రాంతం శ్రీవారిమెట్టు వద్ద పోలీసులు పెద్దఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. బుధవారం అర్థరాత్రి కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు రాళ్లతో దాడి చేసి పారిపోయారు. ఈ సంఘఠనలో ఒక కానీస్టేబుల్ గాయపడ్డాడు. దాడిచేసినవారిపై పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఈ సందర్భంగా 47 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలువురు ఎర్రచందనం కూలీలు పోలీసుల అదుపులో ఉన్నట్లు చెబుతున్నారు. ఆర్ఎస్సై వాసు, డీఆర్వో పీవీఎన్.రావు బృందం బుధవారం అర్ర్థరాత్రి నాగపట్ల ఈస్టు బీట్ పరిధిలోని శేషాచల అటవీ ప్రాంతం శ్రీవారిమెట్టు వద్ద కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో తమిళనాడు జావాదిమలైకు చెందిన మురుగన్ అనుమానాస్పదంగా తచ్చాడుతుండటంతో అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. తాను ఎర్రచందనం కూలీలకు పైలట్‌గా వచ్చానని అతను చెప్పడంతో, అతన్ని తీసుకుని శ్రీవారిమెట్టు మార్గంలోని పంప్‌హౌస్ సమీప అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. కూలీలు దుంగలు మోసుకొస్తూ కనిపించడంతో అధికారులు వారిపై దాడులు చేశారు. కూలీలు వారి వద్దనున్న కర్రలు, రాళ్లతో ఎదురుదాడికి దిగారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ చేతికి గాయమైంది. దాంతో అధికారులు గాల్లో కాల్పులు జరపగా, ఎర్రకూలీలు అటవీ ప్రాంతంలోకి పరుగులు పెట్టారు. చివరకు తమిళనాడు తిరువణ్ణామలైకు చెందిన చిన్నప్పయ్య, స్వామినాథన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు జిల్లాల పరిధిలో ఎర్ర కూలీల నుంచి సుమారు 47 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దాడిలో గాయపడ్డ పీసీ లక్ష్మీనారాయణకు మెరుగైన వైద్యంకోసం తిరుపతి రుయాకు తరలించారు. -
పోలీసులపై రాళ్లు రువ్వారు
లంకమల ఫారెస్టులో కూంబింగ్ కడప: జిల్లాలోని లంకమల అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం స్పెషల్ టాస్కుఫోర్సు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళకూలీలు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. పారిపోతున్న తమిళ కూలీలలో ఇద్దరు పోలీసులకు చిక్కారు. వారి వద్ద నుంచి 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పోలీసులకు తీవ్ర గాయలయ్యాయి. -
భారీగా ఎర్రచందనం స్వాధీనం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కర్నూలు శివారులోని రాగమయూరి రిసార్ట్స్ సమీపంలో భారీ స్థాయిలో ఎర్రచందనం దుంగలను తాలూకా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.33 లక్షల విలువ చేసే 60 దుంగలను లారీలో తరలించే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు దాడి చేశారు. వెంటనే లారీలోకి ఎత్తున కూలీలతో సహా యజమానులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ దుంగలను ఎక్కడి నుంచి తెచ్చి నిలువ చేశారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిసింది. అంతేకాక ఎవరికైనా రాజకీయ నాయకులకు సంబంధం ఉందా అన్నకోణంలో దర్యాప్తు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఎంతమంది నిందితులు, ఎన్ని దుంగలను స్వాధీనం చేసుకున్నారన్న దానిపై పోలీసులు స్పష్టతను ఇవ్వడంలేదు. మరోవైపు నిందితుల పూర్తి వివరాలను సోమవారం వెల్లడించే అవకాశం ఉందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. -
చాగలమర్రి ఎంపీపీకి నోటీసులు
చాగలమర్రి: చాగలమర్రి మండల పరిషత్ అధ్యక్షుడు మస్తాన్‌వలికి జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి నోటిసులు అందాయి. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మూడు సాధారణ సమావేశాలకు వరుసగా గైర్హాజరయ్యారు. ఇందుకు సంబంధించి ఎంపీడీఓ శ్రీలత గత సమావేశం తర్వాత జిల్లా ఉన్నతాధికారులకు నివేదించారు. మస్తాన్‌వలి ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఏడాది కాలంగా కడప కేంద్ర కరాగారంలో ఉన్నారు. అప్పటి నుంచి మండల ఉపాధ్యక్షురాలు భాగ్యలక్ష్మి ఎంపీపీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నోటీసులకు సంబంధించి ఎంపీపీ 30 రోజుల్లో సంజాయిషీ(వివరణ) ఇవ్వాల్సి ఉందని ఎంపీడీఓ తెలిపారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రుద్రవరం: రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలోని ఊట్ల ప్రాంతం గరుడాద్రి రస్తాలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకునా్నరు. వీటిని తరలిస్తున్న ఐదుగురిలో నలుగురు పరారుకాగా ఒకరు పట్టుబడ్డారు. ఈ వివరాలను రేంజర్ రామ్‌సింగ్ సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. గరుడాద్రి కొండల్లోని ఎర్రచందనం వృక్షాలను నరికి దుంగలుగా మలిచి భుజం మోతగా తరలిస్తుండగా దాడులు చేశామనా్నరు. బాచిపల్లె తండాకు చెందిన బుక్కె సేవా నాయక్, తిరుపాల్ నాయక్, ఆహోబిలానికి చెందిన మేకల సంజీవ, దుబ్బన్న, కొండంపల్లెకు చెందిన చింతల చిన్న సుబ్బరాయుడు(బుజ్జి) అనే కూలీలు అటవీ సిబ్బందిని గమనించి దుంగలను పారవేసి పరారు అయ్యారు. వెంబండించగా బుక్కె సేవా నాయక్ పట్టుబడగా మిగిలిన నలుగురు చిక్కలేదని రేంజర్ తెలిపారు. దాడుల్లో సెక్షన్ అధికారి మక్తర్ బాషా, బీటు అధికారులు రమణ, ఉస్సేన్ బాష, బేష్ క్యాంప్ ప్రొటెక్షన్ వాచర్లు పాల్గొన్నారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రుద్రవరం: అహోబిలం నార్త్ బీట్‌లో రూ. 10 లక్షలు విలువైన ఎర్రచందనం దుంగలతోపాటు నిందితుడు, మోటర్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు రేంజర్ రామ్ సింగ్ తెలిపారు. శనివారం రాత్రి ఆలమూరు గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం అందించారన్నారు. సిబ్బందిని అప్రమత్తం చేసి దాడులు నిర్వహించామన్నారు. దాడుల్లో ఆలమూరు గ్రామానికి చెందిన డీలర్ కుమారుడు రామమోహన్.. 15 ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేసేందుకు సిద్ధం అవుతుండగా అరెస్ట్ చేశామన్నారు. నిందితుడు వినియోగించిన మోటార్ సైకిల్‌తోపాటు ఎర్రచందనం దుంగలను అహోబిలం గ్రామానికి తరలించి విచారణ చేపట్టామన్నారు. ఆలమూరు గ్రామానికి చెందిన ప్రసాదుతోపాటు మరో ముగ్గురు వ్యక్తులు అడవుల్లో ఎర్రచందనం వృక్షాలను నరికి దుంగలుగా మలిచి విక్రయిస్తున్నారని విచారణలో తేలిందన్నారు. దాడుల్లో డీఆర్ఓ శ్రీనివాసులు, సెక్షన్ అధికారులు మక్తర్ బాషా, విజయలక్ష్మి పాల్గొన్నారు. -
ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
కర్నూలు (టౌన్): రుద్రవరం మండలం శ్రీరంగాపురం గ్రామ సమీపంలోని అయ్యకుంట చెరువు వద్ద ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తున్న 13 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 45 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆవరణలో జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. అరెస్టు అయిన వారిలో భీరం నరసింహారెడ్డి, తలారీ నరసింహులు, తలారీ హరి, షేక్ చిన్న హుస్సేన్, దేవిశెట్టి సుబ్బారావు, సంపంగి వడ్డె శ్రీను, షేక్ రఫీ, బోయ ప్రసాద్, చాకలి హరిలింగం, ఆవుల ఓబులేసు, కొత్తమాసి వెంకటయ్య, గుర్రందాసు, కొత్త మాసి ధనపాల్ ఉన్నారు. వీరిపై రుద్రవరం పోలీసుస్టేషన్లో 158/2016 కింద ఎర్రచందనం, పర్యావరణ ఆటవీ చట్టాల కేసు నమోదు చేశారు. వీరంతా రుద్రవరం మండలంలోని శ్రీరంగా పురం, పెద్దకడబూరు, నరసాపురం, బండిఆత్మకూరు మండలం లింగాపురం గ్రామాలకు చెందిన వారు. స్మగ్లర్ల అరెస్ట్‌లో ప్రతిభ చూపిన సీఐ ప్రభాకర్ రెడ్డి, రుద్రవరం ఎస్ఐ హనుమంతయ్య, ఎఎస్ఐ రామయ్య, హెడ్ కానిస్టేబుల్ భూపాల్ రెడ్డి, కానిస్టేబుల్ కుమార్, రమేష్, శాంతి రెడ్డి, హోంగార్డు బాలసామి, హరిని ఎస్పీ అభినందించి రివార్డు ప్రకటించారు. -
29 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు సూళ్లూరుపేట : రాపూరు అటవీ ప్రాంతం నుంచి చెన్నైకు బొలేరో క్యాంపర్ వాహనంలో ఆదివారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం వాహనాన్ని ఎస్ఐ జీ గంగాధర్‌రావు సినీపక్కీలో ఛేజ్ చేసి తడ మండలం అక్కంపేట వద్ద వాహనాన్ని పట్టుకున్నారు. పోలీసులకు ముందుగా సమాచారం అందడంతో స్వర్ణాటోల్ ప్లాజా వద్ద కాపు కాచారు. వాహనం రావడంతో అపేందుకు ప్రయత్నించగా డ్రైవర్ అతి వేగంగా దబాయించి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు కూడా మరో వాహనంలో సినీపక్కీలో ఛేజ్ చేయడంతో వాహనం డ్రైవర్ అక్కంపేట వద్ద ఆపి తాళం వేసి చీకట్లో పరారయ్యాడు. వాహనాన్ని పరిశీలించగా పైన మొక్కజొన్న కంకుల బస్తాలు వేసుకుని కింద 29 ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వాహనాన్ని తీసుకు రావడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. స్వర్ణాటోల్ ప్లాజాకు చెందిన వాహనానికి తగిలించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకు వచ్చారు. ఽవీటిì విలువ సుమారుగా రూ.5 లక్షలు వరకు ఉంటుందని ఎస్ఐ జీ గంగాధర్‌రావు తెలిపారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగలను వెంకటగిరి అటవీశాఖ అధికారులకు అప్పగిస్తామని ఆయన తెలిపారు. ముందుగా సమాచారం అందించడంతోనే ఈ వాహనాన్ని పట్టుకోగలిగామని తెలిపారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రుద్రవరం: రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలోని డి. వనిపెంట బీటు ప్రాంతంలో రూ. 50 లక్షలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను ఫారెస్ట్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలను రేంజర్ రామ్‌సింగ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 20 మంది కూలీలు ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారని సమాచారం అందడంతో సిబ్బందితో దాడులు నిర్వహించామన్నారు. డి. వనిపెంట ప్రాంతంలోని ముచ్చుగుంత వద్ద వెళ్తుంగా గమనించిన ఎర్రచందనం కూలీలు దుంగలను పడేసి పరారు అయ్యారన్నారు. ఈ దుంగలను స్వాధీనం చేసుకుని తూకం నిర్వహించగా 551 కిలోల బరువు ఉన్నాయన్నారు. దాడుల్లో సెక్షన్ అధికారులు మక్తర్ బాషా, తేజ, బీటు అధికారులు ప్రతాప్, నాగప్ప, పెద్దన్న పోటెక్షన్ వాచర్లు పాల్గొన్నట్లు వెల్లడించారు. -
చెన్నై టు చైనా
– ఎల్ఈడీ బల్బుల వ్యాపార ముసుగులో ఎర్రచందనం స్మగ్లింగ్ – దుబాయ్‌కి చెందిన సాహుల్ హమీద్, కొల్లం గంగిరెడ్డికి ప్రధాన అనుచరుడు దావూద్ జాగీర్ అరెస్ట్ – చైనా, దుబాయ్, సింగపూర్, హాంగ్‌కాంగ్, మలేషియా దేశాల స్మగ్లర్లతో సంబంధాలు – ఆయా దేశాల్లో అతని ఆస్తుల లావాదేవీలపై విచారణ జరుపుతున్న ప్రత్యేక బందాలు ఎల్ఈడీ వ్యాపార ముసుగులో ఎర్ర చందనం అక్రమ రవాణాదారులకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న చైనాకు చెందిన అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ కె.ఎ.దావూద్ జాగీర్ అలియాస్ జాకీర్(52) కటకటాలపాలయ్యాడు. దావూద్ జాగీర్తో పాటు అతని అన్న కుమారుడు ఫిరోజ్ దస్తగిరిని కడప జిల్లా పోలీసులు రాజంపేట–రాయచోటి రహదారిలోని ఆకేపాడు క్రాస్ వద్ద శనివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి భారీగా ఎర్రచందనం దుంగలు, నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు స్మగ్లర్ల వివరాలను వెల్లడించారు. – కర్నూలు తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని మన్నాడి పట్టణం సలై వినాయగర్ కోయిల్ స్ట్రీట్‌కు చెందిన దావూద్ జాగీర్ వ్యాపారాల నిమిత్తం చైనా దేశం గ్వాన్డాంగ్ రాష్ట్రంలోని పెంగ్జియాంగ్ జిల్లా యాంగువాన్లోని వుయికంట్రీ గార్డెన్, శ్రీలంక రాజధాని కొలొంబోలోని డెమటగోడలో కూడా నివాసాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఏడో తరగతి వరకు విద్యనభ్యసించిన ఇతను 1997లో స్వస్థలం చెన్నై నగరం నుంచి చైనాకు వెళ్లి అక్కడ లైటింగ్ వ్యాపారాన్ని (ఎల్ఈడీ బల్బులు) ప్రారంభించాడు. చెన్నై నుంచి తరచూ చైనాకి వెళ్లి వస్తుండటంతో ఆ దేశానికి చెందిన లీయాన్ అనే యువతితో సాన్నిహిత్యం ఏర్పడి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇతని అన్న జాఫర్ దస్తగిర్ చైనాలో స్థిరపడ్డాడు. ఎల్ఈడీ బల్బుల వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో జాగీర్ చైనా దేశంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ కంపెనీలు, షోరూమ్‌లు, వ్యాపారవేత్తలను కలిసేవాడు. ఈ క్రమంలో చెన్నై రెడ్‌హిల్స్‌కు చెందిన పలువురు ఎర్ర చందనం స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పడ్డాయి. చైనీస్ భాషపై పట్టు ఉండటంతో అక్కడి వ్యాపారులు దావూద్ జాగీర్ను మధ్యవర్తిగా(బ్రోకర్) ఏర్పాటు చేసుకున్నారు. తమిళం, ఇంగ్లీష్, చైనీస్, జర్మనీ, ఉర్దూ, హిందీ, బర్మిస్, జపనీస్ భాషలు మాట్లాడటంలో ఇతను దిట్ట. దీంతో ఆయా దేశాల్లో ఉన్న స్మగ్లర్లు చైనాలో ఎర్ర చందనం అక్రమ రవాణా కార్యకలాపాలు నిర్వహించుటకు జాగీర్ సహకారం పొందేవారు. చెన్నై స్మగ్లర్లతో నేరుగా సంబంధాలు: చైనాలో ఎర్ర చందనం అక్రమ రవాణాపై పూర్తిస్థాయి పరిజ్ఞానం సాధించడంతో చెన్నైకి చెందిన ఎర్ర చందనం స్మగ్లర్లతో నేరుగా సంబంధాలు పెంచుకున్నాడు. వారు చూపే పెద్ద మొత్తాలకు ఆకర్షితుడై చెన్నైకి చెందిన ప్రధాన అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్లు సంతాన్మీరన్ అలియాస్ చందన్ మీరన్, సాహుల్ హమీద్, సాహుల్ భాయ్, కందస్వామి, పార్థీబన్ అలియాస్ పార్తిపన్లతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. చైనా దేశానికి చెందిన అంతర్జాతీయ స్మగ్లర్లతో పాటు ఆసియా దేశాలకు చెందిన ఎర్ర చందనం స్మగ్లర్లకు మధ్య ఎర్ర చందనం అక్రమ రవాణా వ్యాపార కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగడానికి దోహదపడ్డాడు. హాంగ్‌కాంగ్, మలేషియా, సింగపూర్‌లకు రవాణా: చెన్నైకి చెందిన సాహు హమీద్‌తో సంబంధాలు ఏర్పరచుకుని 2000 సంవత్సరం నుంచి ఎర్ర చందనాన్ని కంటైనర్ల ద్వారా హాంగ్‌కాంగ్, మలేషియా, సింగపూర్‌లకు తరలించి అక్కడి కొనుగోలుదారులకు జాగీర్ విక్రయించేవాడు. ఆ సొమ్మును ‘హవాలా’ ద్వారా సాహుల్ హమీద్‌కు చేరవేసేవాడు. అందుకు గాను కొనుగోలుదారులు, విక్రయదారుల నుంచి భారీగా కమీషన్ పొందేవారు. కొంతకాలం తర్వాత తమిళనాడు, ఆంధ్రా, ఢిల్లీ రాష్ట్రాల్లోనే స్మగ్లర్ల నుంచి నేరుగా ఎర్ర చందనం దుంగలను కొనుగోలు చేసి చైనాకు అక్రమంగా తరలించి నిరాటంకంగా వ్యాపారం సాగించేవాడు. జాగీర్ ఎర్ర చందనం అక్రమ రవాణాలో చైనాకు చెందిన చెన్చెంగై, చెన్ చెంగ్వు, సంతన్మీరన్, జాంగ్యాంగ్, వాంగ్ లీ ఫా, హాంకాంగ్‌కు చెందిన జిమ్మి, సింగపూర్‌కు చెందిన హనీఫ్, డేవిడ్, మయన్మార్‌కు చెందిన షణ్ముగమ్లతో సంబంధాలు ఏర్పరచుకుని వారికి ఎర్ర చందనం దుంగలను విక్రయించేవాడు. సీమలో 57 కేసులు ఇతనిపై కడప జిల్లాలో 34, చిత్తూరు జిల్లాలో 22, కర్నూలు జిల్లాలో ఒకటి, మొత్తం 57 ఎర్ర చందనం అక్రమ రవాణా కేసులు ఉన్నాయి. చైనా, దుబాయ్, సింగపూర్, హాంగ్‌కాంగ్, మలేషియాతో పాటు మరికొన్ని దేశాల్లో ఇతనికి ఆస్తులు ఉన్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఆయా దేశాల స్మగ్లర్లతో జాగీర్‌కు ఉన్న లావాదేవీలను గుర్తించేందుకు ప్రత్యేక బందాలను నియమించినట్లు ఐజీ తెలిపారు. కొత్తగా సవరించిన ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్, 1967 నిబంధనల మేరకు జాగీర్ ఆస్తుల వివరాలను సేకరించి ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 2 వేల టన్నుల ఎర్ర చందనం దుంగలను ఎగుమతి చేసి విదేశాల్లో విక్రయించినట్లు జాగీర్ పోలీసు విచారణలో అంగీకరించాడు. చీకటి వ్యాపారానికి అన్న కుమారుడు సహకారం: చెన్నైలో నివాసముంటూ కారు డ్రై వర్గా జీవనం సాగిస్తున్న ఫిరోజ్ దస్తగిరి.. దావూద్ జాగీర్ అన్న కుమారుడు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకతో పాటు, ఇతర రాష్ట్రాల్లోని ఎర్ర చందనం స్మగ్లర్ల నుంచి కొనుగోలు చేసిన ఎర్ర చందనం దుంగలను వాహనాలలో జాగీర్ చెప్పిన ప్రదేశాలకు చేరుస్తూ అక్రమ రవాణాకు సహకరించాడు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎర్ర చందనం స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకుని చిన్నాన్న జాగీర్ అక్రమ రవాణా వ్యాపారాలలో సహాయ సహకారాలు అందిస్తున్నాడు. -
ఎర్ర దందాలో మహిళలు
సాక్షి ప్రతినిధి తిరుపతి: ప్రధాన ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసులు, అటవీ సిబ్బంది దృష్టి సారించడంతో ఇంతకుముందు కిందిస్థాయిలో దళారులుగా పనిచేసిన వారు, డ్రైవర్లు, ఇన్ఫార్మర్లు పూర్తిస్థాయిలో స్మగ్లర్లుగా మారిపోయారు. వీరు పెద్ద దుంగలను చిన్నచిన్న ముక్కులుగా కట్‌చేసి లగేజీ బ్యాగులో కుక్కి తరలిస్తున్నారు. ఇందుకు సెప్టిక్ ట్యాంకర్లు, కోల్డ్ స్టోరేజీ కంటైనర్లు, అయిల్ ట్యాంకర్లు, బోర్వెల్ వాహనాలను వాడుకుంటుండడంతో పోలీసులు గుర్తించలేకపోతున్నారు. ప్రలోభాల పర్వంఇటీవల పట్టుబడిన తమిళనాడుకు చెందిన కూలీని విచారిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూసినట్లు సమాచారం. తమిళనాడులో పనిదొరకడం గగనమని, అక్కడి వారిని రోజుకు రూ.500 కూలి ఇప్పిస్తామని కొందరు మేస్త్రీలు నమ్మబలికి ఇక్కడికి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. కేరళ అడవుల్లో కట్టెలు కొట్టే పని అని మభ్యపెడుతున్నట్టు సమాచారం. అడ్వాన్స్‌గా రూ.20 వేలు కూలీలకు ముందుగా రూ.20,000 అడ్వాన్స్ ఇచ్చి, మూడు రోజుల తరువాత పనులకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ఆ డబ్బు ఖర్చుపెట్టేయడంతో అది తీర్చలేక విధిలేని పరిస్థితుల్లో ఎర్ర ఉచ్చులోకి దిగాల్సి వస్తున్నట్టు సమాచారం. ఇక్కడ పనికి వచ్చాక పోలీసులకు పట్టుబడకపోతే నెలకు రూ.50వేల వరకు గిట్టుబాటవుతుండడంతో కూలీలు అన్నిం టికీ తెగిచ్చి వస్తున్నట్టు తెలుస్తోంది. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు టాస్క్‌ఫోర్స్ కొత్త ప్రయోగం చేస్తోంది. ఈ నెల 19వ తేదీ నుంచి షార్ట్‌ఫిలిం రూపొందించనున్నట్లు సమాచారం. టాస్క్ ఫోర్స్ డీఐజీ కాంతారావు, ప్రముఖ రంగస్థల నటుడు శ్రీనివాసులు దీక్షితులతో కలిసి ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. మొదటి విడతలో రెండు షార్ట్ ఫిలింలు తీయనున్నారు. ఎర్రచందనం ప్రాముఖ్యత, దీన్ని ఎందుకు తరలిస్తున్నారు.. విదేశాల్లో దీనికి ఎందుకంత డిమాండ్ .. దీని వల్ల లాభపడేవారు ఎంతమంది అనే అంశాల ప్రాధాన్యతగా షార్ట్ ఫిలింలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఎర్రదందాలో కూలీలు ఎలా బలవుతున్నారు.. పట్టుబడిన పెద్ద స్మగ్లర్లు జైలు పాలై.. సంఘంలో ఎలా అగౌరవ పడుతున్నారో తెలియజేసే విధంగా షార్ట్ ఫిలింలు రూపొందిస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. -
12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
పలమనేరు(చిత్తూరు జిల్లా): అక్రమంగా తరలిస్తున్న 12 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకొని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కేంద్రంలో జరిగింది. వివరాలు.. మండల కేంద్రం నుంచి తమిళనాడు రాష్ట్రానికి ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా అక్రమంగా ట్రాక్టర్ ట్యాంకరులో ఉంచి 12 దుంగలను తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. దీంతో పాటు ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మరో ఇద్దరు నిందితులు పరారైనట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు, ట్రాక్టర్ విలువ సుమారు రూ. 10లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దేవతా వనాలకు పట్టిన దెయ్యాల పీడ
సందర్భం అరణ్యకాండ -2 ‘శేషాచలం’ కథ ఎన్నో ఎన్కౌంటర్ కథల్లా ముగిసిపోలేదు. ప్రభుత్వానికి, పోలీసులకు సంకటమై సశేషంగా మిగిలింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో, పలు అంచెలుగా విస్తరించిన భూతగణాల నెట్వర్క్ నుంచి మన ఎర్రచందనం వనాలను తమిళ కూలీల పీనుగులు, మునియమ్మాళ్ వంటి పేదరాళ్ల కన్నీళ్లు కాపాడగలవా? ఉన్నపళంగా చంటిబిడ్డను చంకనేసుకొని పొద్దుటే మొదటి బస్సుకు చంద్రగిరి కొచ్చే సింది మునియమ్మాళ్. పాత చీర కొంగుతో అదేపనిగా కన్నీ రు తుడుచుకునే ఆ ఆడకూతు రికి ఎందుకీ దుఃఖమని అడిగి నవారూ లేరు, ఆమె చెప్పిందీ లేదు. తమిళం తప్ప మరే భాషా రాని ఆమె చంద్రగిరి ఠాణాకు చేరడానికే నానా తంటాలూ పడింది. పోలీసుల ప్రశ్నలకూ కన్నీళ్లే సమా ధానాలు. శేషాచలం ఎన్కౌంటర్లో మరణించిన 20 మంది తమిళ కూలీల్లో ఆమె భర్త శశికుమార్ ఒకడు. తిరువణ్ణామలై, ధర్మపురి జిల్లాల్లోని మృతుల గ్రామా లన్నీ శోకసముద్రాలయ్యాయి. ‘శేషాచలం’ నిజం తేల్చా ల్సిందేనని ప్రజా, హక్కుల సంఘాలు పట్టుబట్టాయి. శవాలను చూసి ముంబై హైకోర్టు మాజీ న్యాయమూర్తి సురేష్ కూలీలు చిత్రహింసలకు గురైనట్టున్నారన్నారు. మునియమ్మాళ్ గోడును రాష్ట్ర హైకోర్టు సుమోటో గా స్వీకరించి, ప్రజాహిత వ్యాజ్యంలో పిటిషనర్‌గా చేర్చింది. మద్రాసు హైకోర్టు శశికుమార్ మృతదేహం రీపోస్ట్ మార్టంకు ఆదేశించింది. మరో ఐదు మృతదేహా లకూ మళ్లీ శవపరీక్షలు తప్పలేదు. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న బాలచందర్, ఇళంగో, శేఖర్లు సాక్షులు గా ముందుకొచ్చారు. ‘‘గుడిపాల గ్రామం వద్ద పోలీసు లు మమ్మల్ని పట్టుకున్నారు. తప్పించుకున్నవాళ్లం బతికి పోయా’’మంటూ మహేంద్రన్, మురళీ భారతీ దాసన్ వంటివాళ్లు మీడియాకు చెప్పారు. కీలక సాక్షులైన శేఖర్, బాలచంద్రన్లు తమకు ప్రాణ హాని ఉన్నదనడంతో జాతీయ మానవ హక్కుల సంఘం వారికి, వారి కుటుం బాలకు రక్షణ కల్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిషేధిత ప్రాంతమంటూ ఏపీ పోలీసులు హక్కుల సంఘాలను ఎన్కౌంటర్ ప్రాంతాలకు వెళ్లనివ్వ లేదు. సచ్చినోడిబండ, చీగటిగలకోన ప్రాంతాల్లో పర్య టించిన జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎన్కౌంటర్ కథ నంపై ఎన్నో సందేహాలను, మరెంతో అసంతృప్తిని వ్య క్తం చేశారు. హక్కుల సంస్థలన్నీ ఎక్కడో పట్టుకుని తెచ్చి కూలీలను కాల్చేశారంటున్నాయి. పూర్తి వివరాలతో నివే దికనివ్వాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ‘శేషాచ లం’ కథ ఎన్నో ఎన్కౌంటర్లలా ముగిసిపోలేదు. ప్రభు త్వానికి, పోలీసులకు సంకట సశేషమైంది. కొందరు ‘శేషాచలం’తో ఎర్రచందనం దొంగల ఆట ఇక కట్టేనన్నారు. రెండు వారాలైనా గడవకముందే కడప సబ్ డివిజన్లో నలభై గొడ్డళ్లు, ఎనిమిది ఎర్రచం దనం దుంగలతో కొందరు పట్టుబడ్డారు. అదేరోజు ప్రొద్దుటూరులో ఒక ముఠా 50 గొడ్డళ్లతో, రైల్వే కోడూ రులో పది దుంగలతో మరో ముఠా కూలీలు పట్టుబడ్డా రు. అంత పెద్ద ఎన్కౌంటర్ స్మగ్లర్లను, కూలీలను భయ పెట్టలేకపోయింది! ఏజెంట్లు తమిళనాడులోని వేలూరు, తిరువణ్ణామలై, చెంగల్పట్టు జిల్లాల్లోని వివిధ గ్రామాల నుంచే ఎక్కువగా కూలీలను కుదుర్చుకుని, ఐదు, పది మంది బృందాలను చేసి వివిధ ప్రాంతాల్లో చెట్లు కొట్టే పని అప్పగిస్తారు. నెల నుంచి రెండు నెలలు వారికి వనవాసమే. పది రోజుల పనికి ఒక్కొక్కరికి రూ. 30 వేలు. ఏజెంట్లే తప్ప స్మగ్లర్లు కనబడరు. పోలీసు కళ్లకు కూలీలే స్మగ్లర్లు! కొట్టిన చెట్లను డ్రెస్సింగ్ చేసిన దుంగ లుగా ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై నగరాలకు తర లిస్తారు. వాటిని చిన్న చిన్న ముక్కలు చేసి 30 కిలోల చొప్పున విద్యార్థుల బ్యాగుల్లో పెట్టి విమానాలెక్కించి సరిహద్దులు దాటించడం, పొడి చేసి దుబాయ్ మీదుగా చైనాకు చేర్చడం రచ్చకెక్కిన పద్ధతులు. ఈ అక్రమ రవా ణాలో తమిళనాడే కీలకం. దుంగలు రోడ్డు మార్గాన చెన్నై పోర్టు చేరి విదేశాలకు ‘ఎగుమతి’ అవుతాయి. అధి కారులు స్వాధీనం చేసుకున్న సింగపూర్‌కు చేరాల్సిన ‘‘వేరుశనగపప్పు, ఉప్పు వగైరా వంట సామాగ్రి’’ కంటై నర్ అడుగున ఎర్రచందనం దుంగలున్నాయి. మరో కంటైనర్‌లో 18 టన్నుల దుంగలు దొరికాయి. అయితే స్మగ్లర్లిచ్చే ఖరీదైన బహుమతుల ప్రలోభానికి చూసీ చూడనట్టు వదిలేసే కస్టమ్స్ అధికారులకు కొదవ లే దు. ఇక రోడ్డు మార్గాన బెంగాల్, బిహార్, యూపీ, ఉత్తరాఖండ్, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింలకు ఎర్రచందనం చేరుతూనే ఉంది. ప్రధానంగా ఈశాన్య రాష్ట్ర్రాల నుంచి బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, భూటా న్, చైనాలకు వ్యూహాత్మకంగా తరలిస్తున్నారు. మయన్మా ర్కు చేరిస్తే చాలు, ప్రపంచంలో ఎక్కడికైనా సరఫరా చేసే సత్తా అక్కడి నెట్వర్క్కుంది. గుజరాత్ కాండ్లా రేవు నుంచి దుబాయ్‌కి చేర్చేది మరో దారి కాగా, అగర్తలా నుంచి చైనా, జపాన్‌లకు ఇంకో దారి. దిగువ ఏజెంట్ల నుంచి జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో, పలు అంచె లుగా విస్తరించిన ఈ భూత గణాల నెట్వర్క్ నుంచి మన ఎర్రచందనం వనాలకు రక్ష తమిళ కూలీల పీను గులు, మునియమ్మాళ్ వంటి పేదరాళ్ల కన్నీళ్లేనా? (వ్యాసకర్త రచయిత, ఫ్రీలాన్స్ జర్నలిస్టు) మొబైల్ నం : 9440074893 -
‘ఎర్ర’ బంగారం ఇలా... ‘హద్దు’ దాటుతోంది!
శేషాచలం కొండల నుంచి ఎర్రచందనం ఎలా సరిహద్దులు దాటుతుందో విచారణలో పోలీసులకు స్మగ్లరు వివరించినట్లు సమాచారం. చెన్నై కేంద్రంగా ఎర్రచందనం దుంగలను ముంబయి, కోల్కత్తా, కేరళ ప్రాంతాలకు సముద్రమార్గంలో త రలిస్తున్నారు. అక్కడి నుంచి సరిహద్దులోని భూటాన్, చైనా, నేపాల్ లాంటి దేశాలకు ట్రాన్స్‌పోర్టు ద్వారా అక్రమంగా చేరవేస్తున్నారు. అక్కడి నుంచి వివిధ దేశాలకు అక్రమ రవాణా చేస్తున్నట్లు స్మగ్లర్లు నోరువిప్పినట్లు తెలిసింది. - జిల్లా నుంచి ట్రాన్స్పోర్టర్ల ద్వారా ఎగుమతి - పోలీసుల ఎదుట నోరు విప్పిన స్మగ్లర్లు - షణ్ముగం ముఠాదే అతిపెద్ద స్మగ్లింగ్ - నాలుగేళ్లలో రూ.1400 కోట్ల సంపద అక్రమ రవాణా - మిగిలిన స్మగ్లర్లు తరిలించింది ఎంతో? చిత్తూరు (అర్బన్): ఎర్రచందనం అక్రమ రవాణాలో చెన్నై-బెంగళూరు ఆపరేషన్లలో కింగ్‌పిన్ షణ్ముగం, అతని అనుచరులు సౌందర్‌రాజన్, శరవణన్ బ్యాచ్‌లు నాలుగేళ్ల కాలంలో దాదాపు 700 మెట్రిక్ టన్నుల (7 లక్షల కిలోలు) ఎర్రచందనం దుంగలను దేశ సరిహద్దులు దాటించి విదేశాలకు తరలించినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఇప్పటికే స్మగ్లర్లను న్యాయస్థానం అనుమతితో విచారిస్తున్న చిత్తూరు పోలీసులకు నిందితులు స్మగ్లింగ్‌కు ఎలా చేస్తారనేదానిపై పలు విషయాలు వెల్లడించారు. ఈ ముఠా ఇప్పటి వరకు తరలించిన 700 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం విలువ దాదాపు రూ.1400 కోట్లు ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ లెక్కన మిగిలిన వేలాది మంది స్మగ్లర్లు ఎంత ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు..? వీటి విలువ ఎంత అనేది ఆలోచిస్తేనే జిల్లా నుంచి ఏ స్థాయిలో ఈ వ్యవహారం నడిచిందో అర్థమవుతోంది. ఇలా సరిహద్దులు దాటిస్తారు... చెన్నై-పశ్చిమ బెంగాల్ ఆపరేషన్‌లో రిమాండుకు తరలించిన నిందితులను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో స్మగ్లర్లు ఎలా ఎర్ర సంపదను సరిహద్దులు దాటవేస్తారనే విషయాలను పోలీసులకు పూసగుచ్చినట్లు వివరించారు. విశ్వసనీయ సమాచారం మేరకు .. తొలిగా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరకడానికి తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కూలీలను ఎంపిక చేసుకుంటారు. ఈ కూలీలను ఒక గ్రూపునకు 50 నుంచి 100 మంది వరకు సరఫరా చేసే మేస్త్రీల ద్వారా కాంట్రాక్టు కుదుర్చుకుంటారు. కూలీలు అడవుల్లోకి వచ్చి ఎర్రచందనం చెట్లను నరికి దానిని లోడింగ్ చేసి వెళ్లిపోతారు. దుంగలతో ఉన్న లోడింగ్ వాహనానికి ఇద్దరు పెలైట్లు దారి చూపిస్తూ ముందుకు వెళుతారు. సమస్య అంతా జిల్లా సరిహద్దుల నుంచి సరుకు చెన్నైకి చేరుకునే వరకే. అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్మగ్లర్లు ఇక్కడున్న కొందరు పోలీసు అధికారులకు నెలకు రూ.లక్షల్లో మామూళ్లు ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. చెన్నైకి చేరుకున్న సరుకును ఇక్కడ సొంతంగా ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ కలిగిన స్మగ్లర్లు వారి గోడౌన్లలో భద్రపరుస్తారు. ఒక్కో గోడౌన్‌కు సాధారణంగా నెలకు రూ.20 వేలు అద్దె ఉంటుంది. స్మగ్లర్లు నెలకు రూ.60 వేలు అద్దె ఇస్తుండడంతో గోడౌన్లు ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతోంది. ఇలా వచ్చిన సరుకును బయ్యర్లకు చూపించి పోర్టు ద్వారా కంటైనర్లలో బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువుల నడుమ ఉంచి సముద్రమార్గంలో ముంబయి, కోల్కత్తా, కేరళ ప్రాంతాలకు తరలించి నిల్వ చేస్తారు. ఇక్కడి నుంచి సరిహద్దు దేశాలకు సరుకును లారీల ద్వారా చేరవేస్తారు. భూటాన్, చైనా, నేపాల్ లాంటి దేశాల్లో 500 కిలోలకన్నా తక్కువ ఎర్రచందనంను ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎవరైనా తీసుకెళ్లొచ్చు. ఇక్కడ అది నేరం కాదు. దీనికన్నా ఎక్కువ తీసుకెళితే జరిమానాలు వేసి వదిలేస్తారు. దీంతో స్వదేశంలో టన్ను ఎర్రచందనం ‘ఏ’ గ్రేడు దుంగలు రూ.30 లక్షలు పలికితే, అదే సరుకును విదేశాలకు స్మగ్లర్లు రూ.2 కోట్లకు అమ్ముతున్నారు. సరుకు చేరిన తరువాత విదేశాల్లోని స్మగ్లర్లు వారి ఏజెంట్ల ద్వారా మన దేశ స్మగ్లర్లకు నగదును ముట్టజెబుతారు. ఎర్రచందనంతో ఏం చేస్తారు? జిల్లాలో ఆపరేషన్ రెడ్ను ప్రారంభించి దాదాపు మూడేళ్లు కావస్తోంది. ఈ మూడేళ్లల్లో వేల మంది కూలీలను, స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. అయితే అందరి సందేహం ఒక్కటే. కేవలం ఎర్రచందనాన్ని విదేశాల్లో బొమ్మలు, గృహోపకరణ వస్తువుల తయారీకి మాత్రమే ఉపయోగిస్తారా..? దీనికి మించి మరేదైనా ఉందా..? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి జిల్లా పోలీసు యంత్రాంగం చేరువలో ఉంది. -
భారీ భద్రత నడుమ ఓపెన్ కోర్టుకు...