ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
Published Sat, Oct 8 2016 11:24 PM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM
రుద్రవరం: రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలోని డి. వనిపెంట బీటు ప్రాంతంలో రూ. 50 లక్షలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను ఫారెస్ట్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలను రేంజర్ రామ్‌సింగ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 20 మంది కూలీలు ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారని సమాచారం అందడంతో సిబ్బందితో దాడులు నిర్వహించామన్నారు. డి. వనిపెంట ప్రాంతంలోని ముచ్చుగుంత వద్ద వెళ్తుంగా గమనించిన ఎర్రచందనం కూలీలు దుంగలను పడేసి పరారు అయ్యారన్నారు. ఈ దుంగలను స్వాధీనం చేసుకుని తూకం నిర్వహించగా 551 కిలోల బరువు ఉన్నాయన్నారు. దాడుల్లో సెక‌్షన్ అధికారులు మక్తర్ బాషా, తేజ, బీటు అధికారులు ప్రతాప్, నాగప్ప, పెద్దన్న పోటెక‌్షన్ వాచర్లు పాల్గొన్నట్లు వెల్లడించారు.
Advertisement
Advertisement