Published
Sun, Feb 26 2017 10:33 PM
| Last Updated on Tue, Sep 5 2017 4:41 AM
భారీగా ఎర్రచందనం స్వాధీనం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కర్నూలు శివారులోని రాగమయూరి రిసార్ట్స్ సమీపంలో భారీ స్థాయిలో ఎర్రచందనం దుంగలను తాలూకా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.33 లక్షల విలువ చేసే 60 దుంగలను లారీలో తరలించే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు దాడి చేశారు. వెంటనే లారీలోకి ఎత్తున కూలీలతో సహా యజమానులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ దుంగలను ఎక్కడి నుంచి తెచ్చి నిలువ చేశారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిసింది. అంతేకాక ఎవరికైనా రాజకీయ నాయకులకు సంబంధం ఉందా అన్నకోణంలో దర్యాప్తు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఎంతమంది నిందితులు, ఎన్ని దుంగలను స్వాధీనం చేసుకున్నారన్న దానిపై పోలీసులు స్పష్టతను ఇవ్వడంలేదు. మరోవైపు నిందితుల పూర్తి వివరాలను సోమవారం వెల్లడించే అవకాశం ఉందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.