ఎర్రచందనం దుంగలు స్వాధీనం
Published Sun, Nov 13 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 8:01 PM
రుద్రవరం: అహోబిలం నార్త్ బీట్‌లో రూ. 10 లక్షలు విలువైన ఎర్రచందనం దుంగలతోపాటు నిందితుడు, మోటర్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు రేంజర్ రామ్ సింగ్ తెలిపారు. శనివారం రాత్రి ఆలమూరు గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం అందించారన్నారు. సిబ్బందిని అప్రమత్తం చేసి దాడులు నిర్వహించామన్నారు. దాడుల్లో ఆలమూరు గ్రామానికి చెందిన డీలర్ కుమారుడు రామమోహన్.. 15 ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేసేందుకు సిద్ధం అవుతుండగా అరెస్ట్ చేశామన్నారు. నిందితుడు వినియోగించిన మోటార్ సైకిల్‌తోపాటు ఎర్రచందనం దుంగలను అహోబిలం గ్రామానికి తరలించి విచారణ చేపట్టామన్నారు. ఆలమూరు గ్రామానికి చెందిన ప్రసాదుతోపాటు మరో ముగ్గురు వ్యక్తులు అడవుల్లో ఎర్రచందనం వృక్షాలను నరికి దుంగలుగా మలిచి విక్రయిస్తున్నారని విచారణలో తేలిందన్నారు. దాడుల్లో డీఆర్‌ఓ శ్రీనివాసులు, సెక‌్షన్ అధికారులు మక్తర్ బాషా, విజయలక్ష్మి పాల్గొన్నారు.
Advertisement
Advertisement