Published
Mon, Oct 10 2016 1:08 AM
| Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
29 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు
సూళ్లూరుపేట : రాపూరు అటవీ ప్రాంతం నుంచి చెన్నైకు బొలేరో క్యాంపర్ వాహనంలో ఆదివారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం వాహనాన్ని ఎస్‌ఐ జీ గంగాధర్‌రావు సినీపక్కీలో ఛేజ్ చేసి తడ మండలం అక్కంపేట వద్ద వాహనాన్ని పట్టుకున్నారు. పోలీసులకు ముందుగా సమాచారం అందడంతో స్వర్ణాటోల్ ప్లాజా వద్ద కాపు కాచారు. వాహనం రావడంతో అపేందుకు ప్రయత్నించగా డ్రైవర్ అతి వేగంగా దబాయించి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు కూడా మరో వాహనంలో సినీపక్కీలో ఛేజ్ చేయడంతో వాహనం డ్రైవర్ అక్కంపేట వద్ద ఆపి తాళం వేసి చీకట్లో పరారయ్యాడు. వాహనాన్ని పరిశీలించగా పైన మొక్కజొన్న కంకుల బస్తాలు వేసుకుని కింద 29 ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వాహనాన్ని తీసుకు రావడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. స్వర్ణాటోల్ ప్లాజాకు చెందిన వాహనానికి తగిలించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకు వచ్చారు. ఽవీటిì విలువ సుమారుగా రూ.5 లక్షలు వరకు ఉంటుందని ఎస్‌ఐ జీ గంగాధర్‌రావు తెలిపారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగలను వెంకటగిరి అటవీశాఖ అధికారులకు అప్పగిస్తామని ఆయన తెలిపారు. ముందుగా సమాచారం అందించడంతోనే ఈ వాహనాన్ని పట్టుకోగలిగామని తెలిపారు.