98 డీఎస్సీలో మంగపతికి పోస్టింగ్
అనకాపల్లి: అనుకోకుండా రాజకీయాల్లో వచ్చిన ఆయన వైస్ ఎంపీపీ అయ్యారు. అప్పటి నుంచి రాజకీయాల్లో బిజీగా మారిన తనిప్పుడు ఉపాధ్యాయుడిగా పాఠాలు బోధించేందుకు సిద్ధమయ్యారు. కె.కోటపాడు మండలం గొండుపాలెం గ్రామానికి చెందిన బండారు మంగపతి 2014–19 వరకు వైస్ ఎంపీపీగా పనిచేశారు. 1998–డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల పోస్టింగ్‌లపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న చరిత్రాత్మకమైన నిర్ణయంతో అతడికి ఉపాధ్యాయ కొలువు సాకారమైంది.
పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేసి ఉమ్మడి విశాఖ జిల్లాలో 352 మంది కుటుంబాల్లో వెలుగులు నింపారని మంగపతి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2014 ఎంపీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఈయన్ను 1,786 ఓట్ల మెజార్టీతో గ్రామస్తులు గెలిపించారు. తదనంతరం వైస్ ఎంపీపీగా సభ్యులంతా ఎన్నుకున్నారు.
సీఎం జగన్ పాలనపైనా, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు నాయకత్వంలో పని చేసేందుకు ఆసక్తితో 2019లో వైఎస్సార్‌సీపీలో చేరారు. నాటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల 98–డీఎస్సీ కౌన్సెలింగ్‌లో అనంతగిరి మండలం చింతలపాక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా నియమితులయ్యారు. రాబోయే రోజుల్లో విద్యార్థులకు మంచి చదువులతోపాటు నైతిక విలువలు మరింత పెంపొందించేలా విద్యా బోధనను అందించనున్నట్లు మంగపతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment