ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీల కిడ్నాప్ | two ysrcp mptc members kidnaped in kurnool | Sakshi
Sakshi News home page

ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీల కిడ్నాప్

Published Mon, Jun 30 2014 2:10 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీల కిడ్నాప్ - Sakshi

ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీల కిడ్నాప్

ప్యాపిలి: మెజారిటీ లేకపోయినా ఎంపీపీ పీఠం కైవసం చేసుకునేందుకు టీడీపీ కుట్రలకు తెరతీస్తోంది. కర్నూలు జిల్లా ప్యాపిలిలో ఇరువురు ఎంపీటీసీలను కిడ్నాప్ చేసింది. మండలంలోని 21 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ 12, టీడీపీ 9 స్థానాల్లో  గెలుపొందాయి. వీరిలో ఒక వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ వుృతి చెందినా ఆ పార్టీకి 11 వుంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి  ప్యాపిలి-3వ ఎంపీటీసీ పెద్దరాజును కారు బాడుగకు మాట్లాడాలి రమ్మంటూ ఫోన్ చేసి గుత్తి వద్ద కొందరు కిడ్నాప్ చేశారు.

జక్కసానికుంట్ల ఎంపీటీసీ రమాదేవి, ఈమె భర్త శ్రీనివాసులు సైతం మూడు రోజుల క్రితం అదృశ్యమయ్యారు. పెద్దరాజును టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారని  పెద్దరాజు భార్య వెంకటేశ్వరమ్మ ప్యాపిలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.    రమాదేవి దంపతుల అదృశ్యంపై కూడా వారి కుమారుడు హరికృష్ణ ఆదివారం జలదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement