ఎంపీటీసీల కొనుగోలు వ్యవహారం పై వైఎస్ఆర్సీపీ నేతలు సాక్ష్యాధారాలతో కాసేపట్లో(మంగళవారం) రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయనున్నారు.
ప్రకాశం: ఎంపీటీసీల కొనుగోలు వ్యవహారం పై వైఎస్ఆర్సీపీ నేతలు సాక్ష్యాధారాలతో కాసేపట్లో(మంగళవారం) రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయనున్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన సభ్యులను టీడీపీ ప్రలోభ పెట్టి అపహరించిందని ఫిర్యాదు చేయనున్నారు. ఎంపీటీసీ సభ్యులను వెతికి తీసుకురావాలని రిటర్నింగ్ అధికారిని కోరనున్నారు. కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేయనున్నారు.