సాక్షి, ఏలూరు : తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాల నేపథ్యంలో నిలిచిపోయిన దేవరపల్లి ఎం పీపీ ఎన్నిక ఆదివారం జరగనుంది. ఆ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను బెదిరించడంతోపాటు ప్రలోభాలకు గురి చేస్తోంది. ఇద్దరు ఎంపీటీసీలను తన వైపు తిప్పుకోవాలని చూస్తోంది. ఇంకోవైపు సొంతపార్టీ వాళ్లు చేయి దాటిపోకుండా ద్విచక్ర వాహనాలు, భారీగా నగదును బహుమతులుగా ఇస్తోంది.
భారీ బందోబస్తు
దేవరపల్లి ఎంపీపీ ఎన్నికను ప్రశాంతంగా నిర్వహిం చాల్సిందిగా రాష్ట్ర హైకోర్టు ఆదేశించడంతో అధికార యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ నెల 4న ఎంపీపీ ఎన్నికలు జరగాల్సిండగా టీడీపీ దౌర్జన్యానికి దిగి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడంతో ఎన్నిక వాయిదా పడిన విషయం విదితమే. ఈ ఘట నపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. ఎన్నికల అధికారిపై దాడికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిం దిగా ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో పోలీసులు టీడీపీ ఎంపీటీసీలు బి.ఇందిర, సీహెచ్.నాగమణిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం జరిగే ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఎన్నికను సజావుగా పూర్తి చేసేందుకు దాదాపు 1,300 మంది సిబ్బందిని నియమించారు.
పెద్దఎత్తున రాయ‘బేరాలు’
ఎంపీపీ పదవి కోసం వైఎస్సార్ సీపీ నుంచి పల్లంట్ల ఎంపీటీసీ గన్నమని జనార్దనరావు, టీడీపీ నుంచి దేవరపల్లి ఎంపీటీసీ శ్రీకాకోళపు నరసింహమూర్తి పోటీపడుతున్నారు. మొత్తం 22 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 12 స్థానాలను వైఎస్సార్ సీపీ, 9 స్థానాలను టీడీపీ దక్కించుకున్నారుు. స్వతంత్ర అభ్యర్థి కూడా వైఎస్సార్ సీపీ వైపే ఉన్నారు. ఇంత స్పష్టమైన ఆధిక్యం ఉన్నచోట కూడా టీడీపీ దుర్మార్గంగా వ్యవహరించి ఎంపీపీ పదవి తన్నుకుపోవాలని చూస్తోంది. టీడీపీ రాష్ట్రస్థాయి నాయకులు స్వయంగా రంగంలోకి దిగి వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలను భయపెడుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి అనుకూలంగా ఓటేస్తే రూ.50 లక్షలు ఇస్తామంటూ కొందరు ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు సమాచారం. ఓ నేతను తమవైపు తిప్పుకుని అతని ద్వారా లక్ష్మీపురం, గౌరీపట్నం ఎంపీటీసీలు పోలుమాటి విజయకుమారి, చెరుకూరి కృష్ణకుమారిలను శిబిరానికి తీసుకువెళ్లడానికి టీడీపీ నాయకులు ప్రయత్నించారు.
వీరిలో కృష్ణకుమారి వైఎస్సార్ సీపీలోనే ఉంటానని, ప్రలోభాలకు లొంగేది లేదని తెగేసి చెప్పినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు బెదిరింపుల మేరకు జిల్లా క్వారీ క్రషర్స్ ఓనర్సు అషోసియేషన్ మాజీ అధ్యక్షుడొకరు టీడీపీకి తొత్తుగా మారి మధ్యవర్తిత్వం నడుపుతున్నట్లు వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ శిబిరంలో 11 మంది ఎంపీటీసీలు, టీడీపీ శిబిరంలో 9మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఇప్పుడున్న బలానికి తోడు కనీసం మరొకరినైనా తమవైపు తిప్పుకుంటే వైఎస్సార్ సీపీని ఇరకాటంలో పెట్టొచ్చని టీడీపీ భావిస్తోంది. తమ ఎంపీటీసీలను ప్రలోభపెట్టేందుకు అవసరమైతే ఐదెకరాల పొలం లేదా రూ.50 లక్షల నగదు ఇస్తామని టీడీపీ బేరాలు సాగిస్తున్నట్టు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
దేవరపల్లిలో అదే తీరు
Published Sun, Jul 13 2014 1:33 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement