
పాలకొండ రూరల్: రాష్ట్రంలోనే తొలిసారి రెల్లి సామాజికవర్గానికి చెందిన మహిళ ఎంపీపీగా ఎన్నికయ్యారు. సీఎం జగన్ సంకల్పం వల్లే ఇది సాధ్యమైందని ఆ సామాజికవర్గానికి చెందినవారు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలానికి చెందిన బొమ్మాళి భాను భాసూరు సెగ్మెంట్ నుంచి ఎంపీటీసీ సభ్యురాలిగా గెలుపొందారు. మండలంలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలుండగా.. 10 స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. శుక్రవారం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో బొమ్మాళి భానును మండల పీఠం వరించింది.