ఎమ్మెల్యే దృష్టికి రెల్లి కులస్తుల సమస్యలు
రాజాం: రాష్ట్రంలోని రెల్లి కుల స్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలాపు వెంకటేశ్వరరావు రాజాం ఎమ్మెల్యే కం బాల జోగులను కోరారు. వెంకటేశ్వరరావు మంగళవారం ఎమ్మెల్యేను ఆయన స్వగృహం లో కలిసి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రెల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, రెల్లి ఉపకులాలకు ప్రత్యేకించి 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని, లిపి లేని రెల్లి భాష ఉన్న వారికి ఎస్సీ నుంచి ఎస్టీకు మార్చాలని, రెల్లి ఐక్య కులాల సమస్యలను, విజ్ఞాపనలను విన్నవించుకోవడానికి రాజకీయ నామినేటెడ్ పదవుల్లో నియమించాలని తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ప్రభుత్వం ముందు ఉంచామని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ స్థానిక సమస్యలపై నాయకులు, అధికారులు దృష్టి సారించడం లేదని, ఇక రాష్ట్రస్థాయి సమస్యలను పట్టించుకోవడం కలేనని అన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రస్తావన తీసుకువస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సింహాచలం, శ్రీను పాల్గొన్నారు