Tripuraram
-
దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం
త్రిపురారం (నాగార్జునసాగర్) : తెలంగాణ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ బుధవారం త్రిపురారం మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్‌షో కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన రోజున పార్లమెంట్లో టీఆర్ఎస్ బలం రెండు సీట్లేనని, ఆ రెండు సీట్లతో ఒకేఒక్కడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగా లేనిది తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రంలో కేసీఆర్ నాయకత్వం ఎందుకు చేపట్టలేరని అన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ నేతల మాయమాటలు వినే స్థితిలో ప్రజలు లేరని.. అలాంటి పార్టీని మట్టి కరిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దేశంలో రైతులకు 24గంటలపాటు ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. రాష్ట్రంలో రైతులు ఆర్థికంగా ఎదగడం కోసం రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు ప్రవేశపెట్టింది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనేన న్నారు. సీఎం కేసీఆర్ నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజల అభివృద్ధి కోసం ప్రతి కుటుంబానికి ఏదో ఒకరకంగా సంక్షేమ ఫలాలను అందించాలనే తపనతో కల్యాణలక్ష్మి, షాద్ ముబారక్, ఆసరా పెన్షన్లు, ప్రతి కుటుం బానికి తాగునీరు, ఉచిత కరెంట్ ఇలా అనేక రకాల పథకాలను అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. నాగార్జున సాగర్‌లో డెడ్ స్టోరేజీ ఉన్నా ఆ నీటిని తోడి పంపులు పెట్టి రైతుల చివరి భూములకు సాగునీరు అందించి ఆదుకుంటామన్నారు. సాగర్ నియోజకవర్గంలో లిఫ్ట్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ఆయకట్టు చివరి భూములకు నీరందించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పని అయిపోయిందని నేతలంతా టీఆర్ఎస్లోకి వచ్చి చేరుతున్నారని అన్నారు. నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేసేందుకు నాయకులే లేరని, అభ్యర్థి మాత్రమే మిగిలారని ఎద్దేవా చేశారు. నేను రాజకీయాలకు కొత్తేమీ కాదు : నర్సింహారెడ్డి నల్లగొండ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి మాట్లాడుతూ తాను రాజకీయాలకు కొత్తేమీ కాదని నల్లగొండ జిల్లా ప్రజలకు తెలుసన్నారు. 20 సంవత్సరాల క్రితమే మునుగోడులో ప్రాదేశిక పోరులో నిలిచానన్నారు. ప్రజలకు సేవా చేయడానికి ముందుకు వచ్చానన్నారు. ప్రజలు ఆశీర్వదించి సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. అధిక మెజారిటీతో గెలిపించాలి - ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అనంతరం నల్లగొండ ఎంపీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహాంరెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించి రికార్డు సృష్టించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్ నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నరేందర్, నాయకులు ఎంసీ కోటిరెడ్డి, ధన్‌సింగ్‌నాయక్, మర్ల చంద్రారెడ్డి, దూళిపాల రామచంద్రయ్య, మార్తీ భరత్‌రెడ్డి, అనంతరెడ్డి, అనుముల శ్రీనివాస్‌రెడ్డి, అనుముల నర్సిరెడ్డి, అనుముల రఘుపతిరెడ్డి, పడిశల బుచ్చయ్య, బిట్టు రవికుమార్, పెద్దబోయిన శ్రీనివాస్‌యాదవ్, కామర్ల జానయ్య, కొనకంచి సత్యం, పామోజు వెంకటాచారి, జంగిలి శ్రీనివాస్, అనుముల శ్రీనివాస్‌రెడ్డి, బచ్చు సాంబయ్య ఉన్నారు. -
కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరు : జానా
సాక్షి, త్రిపురారం : టీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని నాగార్జునసాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు జానారెడ్డి అన్నారు. మహాకూటమి ఆధ్వర్యంలో హాలియా పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరుల ఆత్మబలిదానాల సాక్షిగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ను చిత్తుగా ఓడించాలన్నారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ అభివృద్ధి సాధనకు ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని కోరారు. తనను ఎనిమిదోసారి గెలిపించి ఇంతవరకు ఒకే నియోజకవర్గంలో ఎవ్వరూ సాధించని రికార్డు ఇవ్వాలని అన్నారు. ఇది తనది కాదని నన్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఈ రికార్డు దక్కుతుందన్నారు. నాకు ఈ శక్తిని, స్థాయిని ఇచ్చింది నియోజకవర్గ ప్రజలేనని ఏ పదవిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం శక్తి ఉన్నంత మేరకు కృషి చేస్తూనే ఉంటానని అన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి కడారి అంజయ్యయాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ నాలుగు సంవత్సరాలు ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడ్డారన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, దళితులకు మూడెకరాల భూమి, డబుల్బెడ్రూం ఇళ్లు, దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని మాట తప్పిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రిక్కల ఇంద్రసేనారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కుందూరు రఘువీర్‌రెడ్డి, కుందూరు జయవీర్‌రెడ్డి, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు కనకరాజు సామేల్మాదిగ, టీజేఏసీ నల్లగొండ ఇంచార్జి మేరెడ్డి విజయేందర్‌రెడ్డి, మహాకూటమి నేతలు మువ్వా అరుణ్‌కుమార్, బాబురావునాయక్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాకునూరి నారాయణగౌడ్, మండల అధ్యక్షుడు కుందూరు వెంకట్‌రెడ్డి, జెడ్పీటీసీ యడవెల్లి నాగమణిసోమశేఖర్, ఎంపీటీసీ గౌని శోభరాజారమేష్యాదవ్, నాయకులు శాగం పెద్దిరెడ్డి, వెంపటి శ్రీనివాస్, పాంపాటి శ్రీనివాస్, జూపల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. మరిన్ని వార్తాలు... -
టీఆర్ఎస్కు పట్టం కట్టాలి
సాక్షి,త్రిపురారం : వచ్చేఎన్నికల్లో టీఆర్ఎస్కు పట్టం కట్టాలని టీఆర్ఎస్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నర్సింహయ్య అన్నారు.మంగళవారం అనుముల మండలంలోని అనుములవారిగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా అనుములవారిగూడెంకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు నోముల నర్సింహయ్య సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలు మార్పు కోరు కుంటున్నారన్నారు. గత ఏడు పర్యాయాలు సాగర్ నియోజకవర్గాన్ని పాలించిన జానారెడ్డి నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించాడన్నారు. నియోజకవర్గంలో జానారెడ్డి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఓడించి టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి, మలిగిరెడ్డి లింగారెడ్డి, మండల అధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, యనమల సత్యం, అల్లి పెద్దిరాజు, చల్లా మట్టారెడ్డి, వర్ర వెంకట్‌రెడ్డి, బిక్షం, పోషం శ్రీనివాస్‌గౌడ్, సురభి రాంబాబు, మాతంగి కాశయ్య, శేఖర్‌రాజు, నరేంద్రరావు, యాదగిరిగౌడ్, రావులపాటి ఎల్లయ్య, లింగయ్య, పురుషోత్తం ఉన్నారు. కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యం: తిరుమలగిరి : కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎంసీ కోటిరెడ్డి అన్నారు. సోమవారం సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన యల్లాపురం కార్యకర్తలు ఒక్కరోజు వ్యవధిలోనే మంగళవారం తిరిగి ఎంసీ కోటిరెడ్డి సమక్షంలో సొంతగూటికి చేరారు. వీరితో పాటు చక్కోలంతండాకు చెందిన 20 కుటుంబాలు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎంసీ కోటిరెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పేరుతో వచ్చే కాంగ్రెస్ నాయకులకు ప్రజలు ఓట్ల రూపంలో తగిన బుద్ధి చెప్పాలన్నారు. నాగార్జునసాగర్‌ను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న జానారెడ్డి తన రాజకీయ జీవితంలో జానారెడ్డి ఏం అభివృద్ధి చేశాడో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మాయమాటలు చెబితే ప్రజలు ఓట్లేస్తారని జానారెడ్డి భావిస్తున్నారన్నారు. ప్రజలు ఆయన మాటలు నమ్మే స్థితిలొ లేరన్నారు. నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈ ఎన్నికల్లో జానారెడ్డికి ఓటమి తప్పదన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు శాం రాఘవరెడ్డి, కేతావత్ భిక్షా నాయక్, గుండెబోయిన అంజయ్య యాదవ్, భాషం వెంకటేశ్వర్లు, ఆవుల రామలింగయ్య, పసుపులేటి కృష్ణా, కేతపల్లి నాగయ్య, దున్న వెంకయ్య, శంకర్ నాయక్, మోతీలాల్, మురళి, దున్న ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎకరాకు 20 వేలు నష్టపరిహారం చెల్లించాలి
త్రిపురారం : వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరా వరికి రూ.20 వేల నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి కూన్‌రెడ్డి నాగిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్లుగా అనావృష్టి, అతివృష్టితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పంటను పరిశీలించి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని రైతులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యవర్గ సభ్యుడు అవుతా సైదయ్య, మండల కార్యదర్శి దైద శ్రీను ఉన్నారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
త్రిపురారం : మండలంలోని పెద్దదేవులపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి కె. మహేష్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వడ్లమూడి సైదులు, పీఈటీ కస్తూరి రవీందర్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 17,18వ తేదీల్లో ముకుందాపురంలో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ అండర్–17 విభాగంలో పెద్దదేవులపల్లి హైస్కూల్‌కు చెందిన విద్యార్థి మహేష్ తమ చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించి జట్టును ఒంటి చేతితో గెలిపించి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారని తెలిపారు. రాష్ట్ర జట్టుకు ఎంపికైన విద్యార్థి మహేష్‌ను ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. -
సభను విజయవంతం చేయాలి
త్రిపురారం : అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో భాగంగా ఈనెల 20న నల్లగొండలో నిర్వహించనున్న ఉపాధి హామీ జాతీయ సభలను విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర కమిటీ సభ్యుడు నారి అయిలయ్య పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో ఉపాధి హామీ సిబ్బందితో కలిసి ఆయన బహిరంగసభ ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం వచ్చి పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా దశాబ్ధి ఉత్సవాలను ఈ నెల 20 నుంచి 23 వరకు ఈ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అశోక్, శ్రీను, శ్రీరాములు, ఉపాధి సిబ్బంది కొండయ్య, సబిత, బోజ్యానాయక్, విష్ణు, దశరధ ఉన్నారు. -
మిర్యాలగూడను నల్లగొండలో కొనసాగించాలి
త్రిపురారం : మిర్యాలగూడ నియోజకవర్గాన్ని నల్లగొండ జిల్లాలోనే కొనసాగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇరిగి సునిల్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీకి చెందిన కొందరు తమ స్వార్థ రాజకీయాల కోసం మిర్యాలగూడ నియోజకవర్గాన్ని సూర్యాపేట జిల్లాలో కలిపేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు పారదర్శకంగా పరిపాలన అందించేందుకు సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం మంచిదేనన్నారు. ప్రజాభీష్టం మేరకు ప్రభుత్వం నడుకోవాలని సూచించారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి జెర్రిపోతుల జాషువా మాట్లాడుతూ ప్రజల డిమాండ్ మేరకు ప్రభుత్వం నాగార్జున సాగర్‌ను మండలంగా చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కె బురాన్ తదితరులు ఉన్నారు. -
జిల్లాలో భారీ వర్షం
నల్లగొండ అగ్రికల్చర్ : నల్లగొండ జిల్లాలో సోమవారం ఉదయం భారీ వర్షం కురిసింది. జిలా కేంద్రంతో పాటు 44 మండలాల్లో భారీగా వర్షం పడడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అత్యధికంగా త్రిపురారం మండలంలో 140.8 మిల్లీమీటర్ల వర్షం పడింది. గరిడేపల్లిలో 140.6, వేములపల్లిలో 108.6, దామరచర్ల 183.6, మిర్యాలగూడ 112.4, తిప్పర్తి 85, నేరేడుచర్ల 76.2, మోత్కూరు 57.4, నడిగూడెం 53.4, హుజూర్నగర్ 45.4, నిడమనూరు 39.4, పెన్‌పహాడ్ 35.6 మి.మీ వర్షం కురిసింది. అదే విధంగా నార్కట్‌పల్లిలో 33.6, మఠంపల్లి 30.4, తిరుమలగిరి 27.4, ఆలేరు 24.4, పీఏపల్లి 20.0, చిలుకూరు 22.4, మేళ్లచెరువు 21.6, మునగాల 21.4, అనుముల 18.6, యాదగిరిగుట్ట 18.4, నల్లగొండ 16.8, మోతె 16.4, సూర్యాపేట 15.8, కనగల్ 15.0, గుర్రంపోడు 14.6, కేతేపల్లి 13.8, నకిరేకల్ 12.2, ఆత్మకూర్ 10.4, గుండాల 8.6, చివ్వెంల 8.2, కోదాడ 8.2, కట్టంగూరు 7.0, పెద్దవూర 6.4, ఆత్మకూర్ 6.4, నాంపల్లి 6.2, మునుగోడు 5.0, మర్రిగూడ 4.8, తుర్కపల్లి 4.2, చింతపల్లి 3.2, దేవరకొండ 2.8, చందంపేట 2.2, శాలిగౌరారం 1.6 మి.మీ వర్షం కురిసింది. ఈ వర్షంతో పత్తి, కంది, పెసర పంటలకు ప్రాణం పోసినట్లైంది. -
అధ్వాన్న రోడ్లతో ఇబ్బందులు
త్రిపురారం : మండలంలోని రూప్లాతండ ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. రహదారిపై గుంతలు పడి మురుగు నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. రహదారి మధ్యలో పెద్ద గుంటలు ఏర్పడి, అందులో వర్షపు నీరు నిలిచి పెద్ద మడుగులా మారింది. దీంతో ఏ వాహనం వెళ్లాలన్నా ఆ మడుగులోంచి వెళ్లాల్సి వస్తోంది. గుంతలో వర్షపు నీరు నిండడంతో రోడ్డు కనిపించడం లేదని పలువురు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రహదారిపై ఏర్పడిన గుంతల్లో మట్టి పోయకపోవడం కారణంగా వర్షపునీరుకు తోడు మురుగునీరు గుంతల్లో నిలిచి తీవ్ర అసౌకర్యంగా మారింది. అదే విధంగా రహదారికి ఇరుపక్కల మురుగు కాలువలు లేకపోవడంతో మురుగునీరు బయటకు వెళ్లేందుకు వీలు లేకుండా రోడ్డు మధ్యలో ఏర్పడిన గుంతల్లో నీరు నిలిచి ఉంటుంది. దీంతో ఈ రహదారి గుండా వెళ్లే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి రోడ్డు మధ్యలో ఏర్పడిన గుంతలను పూడ్చాలని తండావాసులు కోరుతున్నారు. -
ఇబ్బందుల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీలు
త్రిపురారం : వర్షాకాలం వచ్చిందంటే మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో వంట గదులు లేకపోవడంతో ఆరుబయటే వంట చేస్తున్నారు. వానలు వచ్చినప్పుడు కట్టెలు మండకపోవడంతో భోజనాన్ని వండేందుకు అవస్థలు పడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో మహిళలే రేకులు వేసుకుని తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు. మరికొన్ని పాఠశాలల్లో తరగతి గదుల్లో, వరండాల్లో, ఆరుబయట వంటలు చేస్తూ వర్షానికి, గాలికి ఇబ్బందులు పడుతున్నారు. త్రిపురారం మండల వ్యాప్తంగా 5 ఉన్నత, 6 ప్రాథమికోన్నత, 44 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. కానీ కేవలం 20 పాఠశాలల్లో మాత్రమే వంటల గదులు ఉన్నాయి. వర్షాకాలం, చలికాలల్లో ఆరుబయట వంటలు చేయడం ఇబ్బందిగా మారుతోందని మహిళలు పేర్కొంటున్నారు. వర్షాకాలంలో కట్టెలు మండక పొగ తరగతి గదుల్లోకి వ్యాపిస్తుందని విద్యార్థులు పేర్కొంటున్నారు. గ్యాస్ పొయ్యిలు లేక ఇక్కట్లు.. ఆయా పాఠశాలల్లో వంటగదులు లేకపోవడంతో పరిశుభ్ర వాతావరణంలో చేయాల్సిన బియ్యం కడకడం, కూరగాయల తరగడం లాంటి పనులన్నీ ఆరుబయటే చేయాల్సి వస్తోంది. గాలి దుమారంతో మట్టి, రాళ్లు భోజనంలో పడుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు లేక కట్టెల పొయ్యి మీదే వంటలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలల్లో వంటగదులు నిర్మించాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు కోరుతున్నారు. అన్ని పాఠశాలల్లో గదులు నిర్మించాలి– దైద శ్రీనివాస్, సీపీఎం మండల కన్వీనర్, త్రిపురారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి నిధులు సమకూరుస్తున్న ప్రభుత్వం వంట గదుల నిర్మాణంపై శ్రద్ధ చూపకపోవడం శోచనీయం. ఇప్పటికైనా ప్రత్యేక నిధులు కేటాయించి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కోసం ప్రత్యేకంగా వంటగదులు నిర్మించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. -
ఘనంగా తీజ్ పండుగ
నిర్వహించడం ఆనవాయితీ అని అఖిల భారత బంజార సేవ సమితి జిల్లా అధ్యక్షుడు ధనావత్ ధన్సింగ్ నాయక్ పేర్కొన్నారు. మండలంలో బొర్రాయిపాలెం గ్రామ పరిధిలోని రెడ్యాతండాలో తొమ్మిది రోజులుగా జరుగుతున్న తీజ్ ముగింపు కార్యక్రమాన్ని గురువారం ఘనంగా జరుపుకున్నారు. గిరిజన సాంప్రదాయం ప్రకారం వివాహంకాని గిరిజన యువతులు తండాలో ఎంతోమంది ఉంటే అన్ని తీజ్ బుట్టలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పందిరిపై ఉంచి తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసి పూజలు నిర్వహించారు. చివర రోజు తీజ్ బుట్టలను ఊరేగింపుగా తీసుకెళ్లి తండా సమీపంలోని బావుల్లో కలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ధూళిపాల రామచంద్రయ్య, అప్పలమ్మగూడెం సర్పంచ్ మూడు నర్సింహనాయక్, కామర్ల జానయ్య, ధనావత్ కాంతారావు, ధనావత్ హనుమంతు, బంజార సేవా సంఘం ప్రచార కార్యదర్శి ధనావత్ వెంకటేశ్వర్లు, తండా పెద్దలు భిక్షానాయక్, సంగ్య, లక్పతి, హన్మ, శ్రీరాములు, రమేశ్, రెడ్యా, సునిత, పున్నమ్మ, మౌనిక, జ్యోతి, అనూష, లక్ష్మి, కవిత, భార్గవి, దివ్య, మధుమతి, లక్ష్మి ఉన్నారు. -
పానుగోతుతండాలో తీజ్ వేడుకలు
త్రిపురారం : తీజ్ పండుగ గిరిజన సంసృతి, సంప్రదాయాలకు ప్రతీక అని ఎస్బీహెచ్ బ్యాంకు మేనేజర్ నేనావత్ బాలు అన్నారు. మండలంలో అంజనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పానుగోతండాలో తొమ్మిది రోజులుగా జరుగుతున్న తీజ్ ముగింపు కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన సంప్రదాయం ప్రకారం వివాహం కాని గిరిజన యువతులు తండాలో ఎంత మంది ఉంటే అన్ని తీజ్ బుట్టలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పందిరిపై ఉంచి తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసి పూజలు నిర్వహించారు. చివర రోజు తీజ్ బుట్టలను ఎత్తుకుని తండాలోని వీధుల్లో సంప్రదాయ నృత్యాల నడుమ ఊరేగింపు చేశారు. తండాకు చెందిన పురుషులు తీజ్ బుట్టల వద్ద వరుసగా కూర్చోగా యువతులు పెరిగిన గోధుమ గడ్డిని తెంచి పురుషుల తలలు, చెవులలో పెట్టారు. అనంతరం తండా సమీపంలోని బావుల్లో కలిపారు. ఈ సందర్భంగా త్రిపురారం ఎస్బీహెచ్ బ్యాంకు మేనేజర్ బాలు తీజ్ వేడుకల్లో పాల్గొని గిరిజన మహిళలకు ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో తండా పెద్దలు పానుగోతు సేవానాయక్, లాల్‌సింగ్, సర్థార్‌నాయక్, చంప్లా, భోజ్యా, వశ్యానాయక్ తదితరులు ఉన్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
త్రిపురారం కాలం కలిసిరాక వ్యవసాయంలో సరైన దిగుబడి రాలేదు. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక తీవ్ర మనస్తాపానికి గురైన ఓ రైతు ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని బడాయిగడ్డలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బడాయిగడ్డ గ్రామానికి చెందిన ఇస్లావత్ తులస్యా(42) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తనకున్న నాలుగు ఎకరాల పది గుంటల వ్యవసాయ భూమిలో గత కొన్ని ఏళ్ళుగా వరి సాగు చేస్తున్నాడు. రెండేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటలు పండలేదు. చేసిన అప్పులు పెరగడంతో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని అమ్ముకున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసేందుకు అప్పుతెచ్చి 10 గుంటల వ్యవసాయలో రెండు నెలల క్రితం రెండు బోర్లు వేసిన నీళ్లు పడలేదు. చేసేందుకు కొంత అప్పు తెచ్చాడు. వడ్డీ, అసలు కలిపి సుమారు రూ.5లక్షల అప్పు పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం ఉదయం ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఇస్లావత్ తులస్యాను చికిత్స నిమిత్తం వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు, మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాలాద్రి తెలిపారు. -
మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం
త్రిపురారం : పెద్దదేవులపల్లి వ్యవసాయ సహకార పరపతి సంఘంలో సభ్యులుగా ఉన్న పెద్దదేవులపల్లి, కామారెడ్డిగూడెం గ్రామాలకు చెందిన వద్ది సోమయ్య, ఠాకూర్ రాజకుమారీబాయి, బయ్య సైదులు, వనం కేశవులు అకాలంగా మృతి చెందారు. మృతుల దహన సంస్కారాల కోసం ఒక్కొక్క కుటుంబానికి తక్షణ సాయం కింద మంజూరైన రూ.10 వేలను ఆయా కుటుంబసభ్యులకు సోమవారం సొసైటీ చైర్మన్ బుసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో సహకార బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డి, సీఈఓ దూళిపాల గోవర్ధన్, ఠాకూర్ రాజారాంసింగ్, యాదగిరి, వెంకన్న తదితరులు ఉన్నారు. -
ఘనంగా తీజ్ ఉత్సవాలు
త్రిపురారం : ఏడుగురు దేవతలను శాంతి పర్చడానికి ముత్తాతల నుంచి తీజ్ పండుగ నిర్వహించడం తమ ఆనవాయితీ అని సర్పంచ్ మూడావత్ నర్సింహనాయక్, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు హన్మంతునాయక్ పేర్కొన్నారు. మండలంలో అప్పలమ్మగూడెం గ్రామపరిధిలోని లోక్యాతండాలో తొమ్మిది రోజులుగా జరుగుతున్న తీజ్ ముగింపు కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన తీజ్ పండుగ రోజు సెలవు దినంగా ప్రకటించాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. గిరిజన సంప్రదాయం ప్రకారం వివాహం కాని గిరిజన యువతులు తీజ్ బుట్టలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పందిరిపై ఉంచి తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసి పూజలు నిర్వహించారు. చివర రోజు తీజ్ బుట్టలను ఎత్తుకుని తండాలోని వీధుల్లో సంప్రదాయ నృత్యాలు చేశారు. తండాకు చెందిన పురుషులు తీజ్ బుట్టల వద్ద వరుసగా కూర్చోగా యువతులు పెరిగిన గోధుమ గడ్డిని తెంచి పురుషుల తలలు, చెవుల్లో పెట్టారు. అనంతరం ఊరేగింపుగా వెళ్లి తండా సమీపంలోని బావుల్లో కలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సేవానాయక్, తండా పెద్దలు ధనావత్ హనుమంతు నాయక్, కాంతారావు, స్వామినాయక్, ధన్ను నాయక్, జాను, రాజు, బగ్గు, లాలు, యూత్ కమిటీ సభ్యులు స్వామి, అంజి, రవి తదితరులు ఉన్నారు. -
భర్త ఇంటిముందు భార్య న్యాయపోరాటం
నల్గొండ (త్రిపురారం) : త్రిపురారం మండలం బాబా సాయిపేటలో శుక్రవారం ఓ మహిళ తన భర్త ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది. తనను కాపురానికి తీసుకెళ్లాలని భర్త ఇంటి ముందు శుక్రవారం ఆందోళన చేపట్టింది.వివరాల్లోకి వెళ్తే.. బాబాసాయిపేట గ్రామానికి చెందిన గట్టు శ్రీను(27), తిప్పరి మండలం జొన్నలగడ్డ గ్రామానికి చెందిన విమల(22)లు 8 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లపాటు వీరి వివాహం సజావుగానే సాగింది. తర్వాత శ్రీను తన భార్యకు తెలియకుండా మరో స్త్రీని ఇటీవల వివాహం చేసుకున్నాడు. తనను భర్త కాపురానికి తీసుకెళ్లే వరకు ఇక్కడ నుంచి కదలనని భీష్మించుకు కూర్చుంది. శ్రీను మరో ఇద్దరిని కూడా వివాహం చేసుకున్నట్లు స్థానికులు అనుకుంటున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులు ఇరువురిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. -
14 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
నల్లగొండ (త్రిపురారం) : నల్లగొండ జిల్లా త్రిపురారం పట్టణంలోని పలు రైస్ మిల్లులపై శనివారం సాయంత్రం పట్టణ పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 14 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. -
విద్యుత్ కోసం రోడ్డెక్కిన అన్నదాతలు
త్రిపురారం (నల్లగొండ) : కట్ చేసిన విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించి విద్యుత్ సరఫరా చేయాలని త్రిపురారం మండలం రైతులు శుక్రవారం మండల విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే.. బిల్లులు చెల్లించలేదని సత్యనారయణపురం, పనసాయి క్యాంప్, ఇండ్లకోటయ్యగూడెం, నారమ్మగూడకు చెందిన రైతుల విద్యుత్ కనెక్షన్లకు ఉన్న జంపర్లను తొలగించారు. ఎలాంటి హెచ్చరిక లేకండా విద్యుత్ కనెక్షన్లు తొలగించడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో ఆగ్రహం చెందిన రైతులు శుక్రవారం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించి విద్యుత్ సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. -
బెట్టింగ్.. బెట్టింగ్.. బెట్టింగ్
బౌండరీల హోరు.. సిక్సర్ల జోరుతో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లు క్రీడాభిమానులను హోరేత్తిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా క్రికెట్ ముచ్చట్లే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో వివిధ జట్ల గెలుపోటములపై జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. గతంలో పట్టణ ప్రాంతాలకే పరిమితమైన క్రికెట్ బెట్టింగ్ నేడు మండల కేంద్రాలు, గ్రామాలకు సైతం విస్తరించింది. రోజుకు రూ.50లక్షల నుంచి కోటి రూపాయల వరకు పందెం కాస్తున్నట్లు సమాచారం. అయినా పోలీస్ యంత్రాంగం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. - త్రిపురారం ప్రపంచ క్రికెట్ కప్ టోర్నీ ద్వారా క్రీడాభిమానులకు కావలసినంత వినోదం లభిస్తుండగా మరో పక్క ఈ క్రికెట్ మ్యాచ్‌లపై జిల్లా వ్యాప్తంగా జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. విశ్వనీయ సమాచారం మేరకు త్రిపురారం, నిడమనూరు, హాలియా, నాగార్జునసాగర్‌తో పాటు ప్రధాన పట్టణాలైన మిర్యాలగూడ, నేరేడుచర్ల, హుజూర్నగర్, కోదాడ, నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి, ప్రాంతాల్లో మూడు మ్యాచ్‌లు ఆరు బెట్టింగ్‌లుగా సాగుతోంది. ఎక్కడికక్కడే లోకల్ బెట్టింగ్‌లు కాస్తున్నట్లు తెలిసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్న పందెం రాయుళ్లు విషయం ఎక్కడా బయటకు పొక్కకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైదరాబాద్, ముంబై కేంద్రాలుగా.. హైదరాబాద్, ముంబాయి కేంద్రాలుగా సాగుతున్న బెట్టింగ్‌లు జిల్లా వ్యాప్తంగా దాదాపు రోజుకు 50 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల మేర చేతులు మారుతున్నట్లు సమాచారం. విషయం బయటకు పొక్కకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్న వీరు సగానికిపైగా పనిని ఫోన్లలోనే నడిపిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో ఎక్కుగా మిర్యాలగూడ పట్టణంలో రోజుకు 20 లక్షల రూపాయల మేరకు బెట్టింగ్ సాగుతున్నట్లు వినికిడి. ఇక్కడ ప్రధాన బార్ అండ్ రెస్టారెంట్లనే వేదికలుగా చేసుకొని బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దీంతో పాటు పట్టణంలోని పెద్ద బజార్, డాక్టర్స్ కాలనీ, ప్రధాన హోటళ్లు, మెడికల్ దుకాణాల్లో బెట్టింగ్ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పలు మండలాల్లో బాల్ బాల్‌కూ బెట్టింగ్ నడుస్తున్నట్లు సమాచారం. వెయ్యికి పదివేలు.. పదివేలకు లక్షల అంటూ పందెం కాస్తున్నారు. దీంతో పాటు వరుస విజయాలు సాధిస్తున్న ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, వెస్టిండీస్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, బంగ్లాదేశ్ దేశాలపై పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు కడుతున్నారు. పట్టించుకోని పోలీసులు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లపై పోలీసులు శీతకన్ను చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా జోరుగా క్రికెట్ బెట్టింగ్‌లు వ్యవహారం సాగుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదనే గుసగసలు వినబడుతున్నాయి. బెట్టింగ్ వెనుక బడా రాజకీయ నాయకుల అండదండలు కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా జిల్లాలో ఇప్పటి దాకా ఏ ప్రాంతంలోనూ బెట్టింగ్ స్థావరాలపై పోలీసులు దాడులు జరిగిన దాఖలాలు లేకపోవడంతో పందెం రాయుళ్లు మరింత విజృంభిస్తున్నారు. -
హృదయం ద్రవించిన వేళ..
‘పరామర్శ యాత్ర’లో కుటుంబాల ఆవేదన చూసి షర్మిల కంటతడి తమ తండ్రిని, వైఎస్సార్‌ను గుర్తుచేసుకుంటూ రోదించిన వెంకట నర్సయ్య కుమార్తెలు ఉద్వేగాన్ని తట్టుకోలేక కన్నీటి పర్యంతమైన షర్మిల కుటుంబానికి అండగా ఉంటామన్న వైఎస్ జగన్ సోదరి త్రిపురారంలో మైల రాములు కుటుంబానికి భరోసా ఆయన భార్య హ–ద్రోగానికి చికిత్స చేయిస్తామని హామీ నల్లగొండ జిల్లాలో రెండో రోజు మూడు కుటుంబాలకు పరామర్శ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది.. ప్రజలకు పెద్ద దిక్కయిన వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక ఆ ఇంటిపెద్ద ప్రాణాలు విడిచారు.. అటు ప్రాణప్రదమైన కుటుంబ సభ్యుడిని కోల్పోయి, ఇటు వైఎస్సార్ లాంటి ప్రజా నాయకుడిని కోల్పోయిన బాధతో ఆ ఇల్లు తల్లడిల్లింది.. ఐదేళ్ల తర్వాత మహానేత కుమార్తె షర్మిలను చూడగానే ఆ ఆవేదన అంతా మళ్లీ పెల్లుబికింది. నాడు మరణించిన వైఎస్సార్‌ను, ఆ బాధతో ప్రాణాలు విడిచిన తమ తండ్రిని గుర్తుచేసుకుంటూ... ఆయన ఐదుగురు కుమార్తెలు గుండెలవిసేలా రోదించారు. ‘మమ్మల్ని గుర్తుపెట్టుకుని వచ్చావా తల్లీ.. మాకిది చాలు’ అంటూ తమ ప్రేమను పంచారు. తమ కష్టాలు చెప్పుకొన్నారు. ఈ ఆవేదనను పంచుకున్న షర్మిల కూడా కన్నీటి పర్యంతమయ్యారు. వారికి తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు.. గురువారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని హిల్ కాలనీలో కామిశెట్టి వెంకటనర్సయ్య కుటుంబాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిల పరామర్శించిన సందర్భంగా కనిపించిన దృశ్యమిది... నల్లగొండ జిల్లాలో షర్మిల రెండో రోజు పరామర్శ యాత్ర గురువారం నాగార్జునసాగర్ నుంచి ప్రారంభమైంది. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక తాను పనిచేస్తున్న కార్యాలయం భవనంపై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయిన కామిశెట్టి వెంకట నర్సయ్య కుటుంబాన్ని తొలుత షర్మిల పరామర్శించారు. నాగార్జునసాగర్‌లోని హిల్‌కాలనీలో ఉన్న వారి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో అరగంటకుపైగా మాట్లాడారు. షర్మిలతో మాట్లాడుతున్న సమయంలో వెంకట నర్సయ్య కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ‘‘మా నాన్న మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్లిపోయాడు. ఇంటి పెద్దదిక్కును కొల్పోయాం అక్కా. మేం ఐదుగురం ఆడపిల్ల లం. ఆయనకు ఉన్న దాంట్లోనే మమ్మల్ని చది వించాడు. వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రజలకు చాలా మేలు చేశాడని ఎప్పుడూ అంటుండేవాడు. వైఎస్ మీద మా నాన్నకు ఉన్న అభిమానం ముందు మేమెవ్వరమూ గుర్తు రాలేదక్కా.. ఆయన మీద అభిమానంతో ప్రాణాలు వది లాడు. ఇది జరిగి ఐదేళ్లయినా గుర్తు పెట్టుకుని మమ్మల్ని ఓదార్చడానికి ఇంతదూరం వచ్చా రు. అది చాలు మాకు..’’ అంటూ వెంకటనర్స య్య కుమార్తెలు నోమిని, పార్వతి తమ బాధను షర్మిలతో పంచుకున్నారు. వెక్కివెక్కి ఏడుస్తున్న నోమిని చేతులు పట్టుకుని షర్మిల కూడా కన్నీళ్ల పర్యంతమయ్యారు. ‘నేనేమో చదువుకోలేదు.. ఏం చేయాలో ఎలా బతకాలో నాకేమీ తెలియడం లేదమ్మా..’ అంటూ రోదిం చిన వెంకట నర్సయ్య భార్య రంగమ్మకు షర్మిల ధైర్యం చెప్పారు. ‘‘దేవుడు అందరికీ మంచే చేస్తాడమ్మా.. మీ కుటుంబానికి మేం అండగా ఉంటాం. అందరూ ధైర్యంగా ఉం డండి..’’ అని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నోమిని, పార్వతి తయారు చేసిన గులాబ్‌జామ్‌ను షర్మిలకు తినిపించారు. రెండోరోజు.. మూడు కుటుంబాలు గురువారం నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలోని మూడు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. తొలుత కామిశెట్టి వెంకటనర్సయ్య కుటుంబాన్ని సందర్శించిన షర్మిల... అనంతరం అనుముల మండలం గరికేనాటి తండాకు వెళ్లి బానావత్ బోడియానాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ గ్రామస్తులు షర్మిలకు ఎదురేగి ఊరిలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత భోజనం పూర్తి చేసుకున్న షర్మిల... త్రిపురారం పట్టణంలోని మైల రాములు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు తమ కష్టాలను షర్మిల దృష్టికి తీసుకెళ్లారు. రాములు భార్య ధనమ్మ హ–ద్రోగి అని, ఆమెకు ఆపరేషన్ అవసరమని కుటుంబ సభ్యులు తెలపడంతో చలించిపోయారు. చికిత్స చేయించుకుంటున్నారా? అని అడిగినప్పుడు తమ ఆర్థిక పరిస్థితి బాగా లేదని వారు చెప్పడంతో... అవసరమైన చికిత్స అందిస్తామని షర్మిల హామీ ఇచ్చారు. వెంటనే హైదరాబాద్‌కు ఆమెను తీసుకువెళ్లాలని ధనమ్మ కుమారులకు చెప్పారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులను షర్మిల ఆదేశించారు. కాగా.. రెండోరోజు పరామర్శ యాత్రలో షర్మిల వెంట వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గున్నం నాగిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, అమృతాసాగర్, పార్టీ అనుబంధ యువజన సంఘం అధ్యక్షుడు బీష్వ రవీందర్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు ముస్తఫా అహ్మద్, పార్టీ కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త పెదపటోళ్ల సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు గూడూరు జైపాల్‌రెడ్డి, ఇరుగు సునీల్ కుమార్, మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ సగం... నాన్న సగం ‘‘అమ్మా.. ఇది మా నాన్న వెంకట నర్సయ్య ఫొటో. ఇందులో ముఖం మాత్రమే నాన్నది. మిగతా అంతా వైఎస్ ఫొటోనే... వైఎస్సార్ మీద అభిమానంతో మా నాన్న ఇలా ఫొటో చేయించుకున్నారు.. అందులోనే మా నాన్నను, వైఎస్సార్‌ను ఇద్దరినీ చూసుకుంటున్నాం..’’ అని కామిశెట్టి వెంకట నర్సయ్య కూతుళ్లు నోమిని, పార్వతి.. షర్మిలకు చెప్పుకుని మురిసిపోయారు. వెంకట నర్సయ్య కుటుంబాన్ని పరామర్శిస్తున్న సందర్భంగా ఇంటిగోడకు తగిలించి ఉన్న ఆ ఫొటోను వారు షర్మిలకు చూపించారు. షర్మిల ఆ ఫొటో వైపు చూస్తుండగా ఎంపీ పొంగులేటి దానిని తీసి ఆమె చేతికి ఇచ్చారు. ఆ ఫొటోను తదేకంగా చూసిన షర్మిల... తన తండ్రి ఉన్న ఆ ఫొటోను ఆత్మీయంగా చేతులతో తడిమి చూసుకున్నారు. -
వైఎస్సార్‌సీపీతోనే గిరిజనుల అభివృద్ధి
త్రిపురారం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే గిరిజనుల అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ సాగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ మల్లు రవీందర్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీత్రిపురారం జెడ్పీటీసీ అభ్యర్థి కొల్లి అన్నపూర్ణ, అప్పలమ్మగూడెం ఎంపీటీసీ అభ్యర్థి అజ్మీరా రంగానాయక్కు మద్దతుగా సోమవారం త్రిపురారం మండలం అప్పలమ్మగూడెం, లోక్యాతండా, మంగళితండా, సీత్యా తండా, హర్జ్యా తండా, డొంకతండాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా తండాలో గిరిజనులు వైఎస్సార్సీపీ నాయకులకు బ్రహ్మరథం పలికారు. ఆయా సభల్లో రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందజేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో విసిగి వేసారిన ప్రజలు ఆ పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపిం చుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీ మండల కన్వీనర్ కందుకూరి అంజయ్య, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రమావత్ జవహర్‌నాయక్, అనుముల సుధాకర్‌రెడ్డి, ఎస్కే బురాన్, చిట్టిమేని శ్రీనివాస్, కొల్లి రవికుమార్, మురళి, గోపి, రేవూరి లక్ష్మమ్మ, పగిడోజు సైదాచారి తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీపీలుగా.. జెడ్పీటీసీలుగా..
హాలియా, న్యూస్‌లైన్ : ఎంపీపీగా పనిచేసి.. ఆ తర్వాతి ఎన్నికల్లో జెడ్పీటీసీలుగా పోటీ చేసి గెలిచారు సాగర్ నియోజకవర్గ నేతలిద్దరు. పెద్దవూర మండలానికి చెందిన కర్నాటి లింగారెడ్డి, త్రిపురారం మండలానికి చెందిన ఇస్లావత్ రాంచందర్ నాయక్‌లు గతంలో ఆయా మండలాల్లో ఎంపీపీలుగా పనిచేయడంతో పాటు జెడ్పీటీసీ సభ్యులుగా పనిచేశారు. రెండు సార్లు ఎంపీపీగా.. పెద్దవూర మండల కేంద్రానికి చెందిన కర్నాటి లింగారెడ్డి 1983లోరాజకీయ జీవితం ప్రారంభించారు. 1983-86 వరకు ఆప్కాబ్ డెరైక్టర్‌గా పనిచేశారు. ఆ తరువాత 1987-92 వరకు మొదటిసారి పెద్దవూర ఎంపీపీగా పనిచేశారు. ఆ తరువాత 2001లో జరిగిన ఎన్నికల్లో అదే మండలం నుంచి జెడ్పీటీసీగా ఎన్నికై 2001-06 వరకు పనిచేశారు. 2005-11 వరకు రెండు పర్యాయాలు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పాలక మండలి సభ్యుడిగా పనిచేశారు. 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన మరల ఎంపీటీసీగా ఎన్నికై 2006-11 వరకు రెండోసారి పెద్దవూర ఎంపీపీగా పనిచేశారు. ఈసారి కూడా పెద్దవూర జెడ్పీటీసీ జనరల్ కావడంతో ఆయన జెడ్పీటీసీగా నామినేషన్ వేసి ఎన్నికల బరిలో ఉన్నారు. ఒకసారి ఎంపీపీగా.. త్రిపురారం మండలం సత్యంపాడు తండాకు చెందిన ఇస్లావత్ రాంచందర్ నాయక్, 1987లో సీపీఎం నుంచి ఎంపీటీసీగా ఎన్నికై త్రిపురారం ఎంపీపీగా పని చేశారు. ఆ తరువాత 1998లో సీపీఎం (బీఎన్‌రెడ్డి పార్టీ ) తరఫున మిర్యాలగూడెం నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేశారు. 2001లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున త్రిపురారం జెడ్పీటీసీగా ఎన్నికై 2001-06వరకు జెడ్పీ ఫ్లోర్‌లీడర్‌గా పనిచేశారు. ఆ తరువాత 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేశారు. 2010 జూలైలో కాంగ్రెస్‌లో చేరారు.