ఎకరాకు 20 వేలు నష్టపరిహారం చెల్లించాలి
ఎకరాకు 20 వేలు నష్టపరిహారం చెల్లించాలి
Published Sat, Sep 24 2016 9:41 PM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM
త్రిపురారం : వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరా వరికి రూ.20 వేల నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి కూన్‌రెడ్డి నాగిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్లుగా అనావృష్టి, అతివృష్టితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పంటను పరిశీలించి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని రైతులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యవర్గ సభ్యుడు అవుతా సైదయ్య, మండల కార్యదర్శి దైద శ్రీను ఉన్నారు.
Advertisement
Advertisement