ఎకరాకు రూ.20వేల పరిహారం చెల్లించాలి
ఎకరాకు రూ.20వేల పరిహారం చెల్లించాలి
Published Thu, Sep 29 2016 10:02 PM | Last Updated on Fri, Oct 19 2018 7:22 PM
నాగార్జునసాగర్, భారీవర్షాలకు వచ్చిన వరదలతో పంటచేలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20వేలు ఇచ్చి ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం పెద్దవూర మండలంలోని కృష్ణపట్టె ప్రాంతంలోగల తునికినూతల, తిమ్మాయిపాలెం, సఫావట్‌తండా, చింతలపాలెం తదితర తండాలు, గ్రామాల్లోని పంటపొలాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులు తెగి కింది పొలాలు ఇసుక, మట్టితో మేట వేసి పనికి రాకుండా పోయాయని తెలిపారు. వాటిని బాగుచేసుకునేందుకు రైతులకు ఎకరాకు రూ.50వేలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెగిన చెరువులు, కుంటలు, రోడ్లు, కల్వర్టులను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట వీరపెల్లి వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్‌యాదవ్, అశోక్, మునినాయక్, లాలునాయక్, హతిరాం, బుజ్జి, సామ్య తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement