మిర్యాలగూడను నల్లగొండలో కొనసాగించాలి
మిర్యాలగూడను నల్లగొండలో కొనసాగించాలి
Published Wed, Sep 14 2016 10:20 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
త్రిపురారం : మిర్యాలగూడ నియోజకవర్గాన్ని నల్లగొండ జిల్లాలోనే కొనసాగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇరిగి సునిల్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీకి చెందిన కొందరు తమ స్వార్థ రాజకీయాల కోసం మిర్యాలగూడ నియోజకవర్గాన్ని సూర్యాపేట జిల్లాలో కలిపేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు పారదర్శకంగా పరిపాలన అందించేందుకు సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం మంచిదేనన్నారు. ప్రజాభీష్టం మేరకు ప్రభుత్వం నడుకోవాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి జెర్రిపోతుల జాషువా మాట్లాడుతూ ప్రజల డిమాండ్ మేరకు ప్రభుత్వం నాగార్జున సాగర్‌ను మండలంగా చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్‌కె బురాన్ తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement