సభను విజయవంతం చేయాలి | To suceed the meeting | Sakshi
Sakshi News home page

సభను విజయవంతం చేయాలి

Published Thu, Sep 15 2016 11:33 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

సభను విజయవంతం చేయాలి - Sakshi

సభను విజయవంతం చేయాలి

త్రిపురారం : అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, జాతీయ కౌన్సిల్‌ సమావేశాల్లో భాగంగా ఈనెల 20న నల్లగొండలో నిర్వహించనున్న ఉపాధి హామీ జాతీయ సభలను విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర కమిటీ సభ్యుడు నారి అయిలయ్య పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో ఉపాధి హామీ సిబ్బందితో కలిసి ఆయన బహిరంగసభ ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం వచ్చి పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా దశాబ్ధి ఉత్సవాలను ఈ నెల 20 నుంచి 23 వరకు ఈ కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అశోక్, శ్రీను, శ్రీరాములు, ఉపాధి సిబ్బంది కొండయ్య, సబిత, బోజ్యానాయక్, విష్ణు, దశరధ ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement