జిల్లాలో భారీ వర్షం
జిల్లాలో భారీ వర్షం
Published Mon, Aug 29 2016 11:09 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ అగ్రికల్చర్ : నల్లగొండ జిల్లాలో సోమవారం ఉదయం భారీ వర్షం కురిసింది. జిలా కేంద్రంతో పాటు 44 మండలాల్లో భారీగా వర్షం పడడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అత్యధికంగా త్రిపురారం మండలంలో 140.8 మిల్లీమీటర్ల వర్షం పడింది. గరిడేపల్లిలో 140.6, వేములపల్లిలో 108.6, దామరచర్ల 183.6, మిర్యాలగూడ 112.4, తిప్పర్తి 85, నేరేడుచర్ల 76.2, మోత్కూరు 57.4, నడిగూడెం 53.4, హుజూర్‌నగర్ 45.4, నిడమనూరు 39.4, పెన్‌పహాడ్ 35.6 మి.మీ వర్షం కురిసింది. అదే విధంగా నార్కట్‌పల్లిలో 33.6, మఠంపల్లి 30.4, తిరుమలగిరి 27.4, ఆలేరు 24.4, పీఏపల్లి 20.0, చిలుకూరు 22.4, మేళ్లచెరువు 21.6, మునగాల 21.4, అనుముల 18.6, యాదగిరిగుట్ట 18.4, నల్లగొండ 16.8, మోతె 16.4, సూర్యాపేట 15.8, కనగల్ 15.0, గుర్రంపోడు 14.6, కేతేపల్లి 13.8, నకిరేకల్ 12.2, ఆత్మకూర్ 10.4, గుండాల 8.6, చివ్వెంల 8.2, కోదాడ 8.2, కట్టంగూరు 7.0, పెద్దవూర 6.4, ఆత్మకూర్ 6.4, నాంపల్లి 6.2, మునుగోడు 5.0, మర్రిగూడ 4.8, తుర్కపల్లి 4.2, చింతపల్లి 3.2, దేవరకొండ 2.8, చందంపేట 2.2, శాలిగౌరారం 1.6 మి.మీ వర్షం కురిసింది. ఈ వర్షంతో పత్తి, కంది, పెసర పంటలకు ప్రాణం పోసినట్లైంది.
Advertisement
Advertisement