కాంగ్రెస్‌లోకి వేముల వీరేశం? | MP Komatireddy Meeting With His Followers In Nakrekal - Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లోకి వేముల వీరేశం?.. అనుచరులతో కోమటిరెడ్డి కీలక భేటీ

Published Sat, Aug 26 2023 3:39 PM | Last Updated on Sat, Aug 26 2023 6:11 PM

Mp Komatireddy Meeting With His Followers In Nakrekal - Sakshi

సాక్షి, నల్గొండ జిల్లా: జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్‌ సీనియర్‌, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నకిరేకల్‌కు చెందిన తన అనుచరులు, నేతలతో సమావేశమయ్యారు.  బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరనున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

మొన్నటి వరకు వీరేశం చేరికను కోమటిరెడ్డి వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా చేర్చుకోవడంపై అవమానించడమే అవుతుందని,  సునీల్‌ కనుగోలు(ఎన్నికల వ్యూహకర్త) చెబితే చేర్చుకోవడమేనా? అంటూ కోమటిరెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగాయి. ఈ నేపథ్యంలో వీరేశం చేరికపైనే కోమటిరెడ్డి నియోజకవర్గంలోని తన అనుచరులతో చర్చిస్తున్నట్లు సమాచారం. 

కాగా, టికెట్‌ ఇస్తారన్న ఆశతో ఉన్నా మాజీ ఎమ్మెలే వేముల వీరేశానికి బీఆర్‌ఎస్‌ మొండిచేయి చూపడంతో ఆ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. నకిరేకల్‌లో ఆత్మీయ సమ్మేళనంలో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఎన్ని బాధలు పెట్టినా భరించా.. అయినా ఇంకా భరిస్తూ బీఆర్ఎస్ పార్టీలో ఉండాలా’’ అంటూ తన అనుచరులు ముందు ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: పల్లాపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement