సాక్షి, హైదరాబాద్: కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ విసిరారు. నేను నల్గొండలో రాజీనామా చేస్తా.. కేటీఆర్ సిరిసిల్లలో రిజైన్ చేయాలి. నేను సిరిసిల్లలో పోటీ చేసి గెలుస్తా. ఇక కారు షెడ్డు మూసుకోవాల్సిందే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
కేటీఆర్ ఓడిపోతే పార్టీ క్లోజ్ చేస్తానంటూ కేసీఆర్ ప్రకటన చేస్తారా?. నేను సిరిసిల్ల లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. కేటీఆర్‌కు టెక్నికల్ పరిజ్ఞానం లేదు. ఆయనొక పిల్లగాడు. స్థాయి కేటీఆర్‌ది కాదు. కేటీఆర్‌కు క్యారెక్టర్ లేదు. లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయి. నాకు క్యారెక్టర్ ఉంది. నా దగ్గర డబ్బులు లేవ’’ అంటూ కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.
లోక్ సభ పోటీలో మాకు ప్రత్యర్థి బీజేపీనేని, బీఆర్‌ఎస్ కాదని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని ప్రతిపాదించాం. నల్గొండ, భువనగిరి నుంచి ఎక్కడైనా పోటీ చేయాలని కోరుతున్నాం. నాలుగు లక్షలకు పైగా మెజారిటి వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అరవింద్‌ను ప్రజలు మర్చిపోయారు. 2 వేల కోట్లు నాకు ఉన్నాయని అంటే భయం కలిగింది. రాజకీయాల వల్ల ఆస్తులు పోగుట్టుకున్నాం. నాతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆస్తులు కూడా తగ్గాయి. నా పేరు మీద ఎక్కడైనా ఆస్తులు ఉంటే అరవింద్‌కు ఇస్తా. బీఆర్‌ఎస్ ఎలాగూ లేదు... బీజేపీకి రెండు, మూడు వస్తాయేమో మాకైతే తెలియదు’’ అని ఉత్తమ్, కోమటిరెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment