రోడ్‌షోలో మాట్లాడుతున్న జానారెడ్డి
సాక్షి, త్రిపురారం : టీఆర్‌ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని నాగార్జునసాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు జానారెడ్డి అన్నారు. మహాకూటమి ఆధ్వర్యంలో హాలియా పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరుల ఆత్మబలిదానాల సాక్షిగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ను చిత్తుగా ఓడించాలన్నారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ అభివృద్ధి సాధనకు ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని కోరారు. తనను ఎనిమిదోసారి గెలిపించి ఇంతవరకు ఒకే నియోజకవర్గంలో ఎవ్వరూ సాధించని రికార్డు ఇవ్వాలని అన్నారు. ఇది తనది కాదని నన్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఈ రికార్డు దక్కుతుందన్నారు.
నాకు ఈ శక్తిని, స్థాయిని ఇచ్చింది నియోజకవర్గ ప్రజలేనని ఏ పదవిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం శక్తి ఉన్నంత మేరకు కృషి చేస్తూనే ఉంటానని అన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి కడారి అంజయ్యయాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ నాలుగు సంవత్సరాలు ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడ్డారన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని మాట తప్పిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రిక్కల ఇంద్రసేనారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కుందూరు రఘువీర్‌రెడ్డి, కుందూరు జయవీర్‌రెడ్డి, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు కనకరాజు సామేల్‌మాదిగ, టీజేఏసీ నల్లగొండ ఇంచార్జి మేరెడ్డి విజయేందర్‌రెడ్డి, మహాకూటమి నేతలు మువ్వా అరుణ్‌కుమార్, బాబురావునాయక్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాకునూరి నారాయణగౌడ్, మండల అధ్యక్షుడు కుందూరు వెంకట్‌రెడ్డి, జెడ్పీటీసీ యడవెల్లి నాగమణిసోమశేఖర్, ఎంపీటీసీ గౌని శోభరాజారమేష్‌యాదవ్, నాయకులు శాగం పెద్దిరెడ్డి, వెంపటి శ్రీనివాస్, పాంపాటి శ్రీనివాస్, జూపల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment