పాల్వాయిలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న జానారెడ్డి
సాక్షి, గుర్రంపోడు : పదవులు ముఖ్యం కాదని, ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు శక్తి వంచన లేకుండా అభివృద్ధికి కృషి చేస్తానని సీఎల్పీ మాజీ నేత, సాగర్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని పాల్వాయి, మక్కపల్లి, మైలాపురం, జూనూతుల, తేనపల్లి, పోచంపల్లి, ఉట్లపల్లి, చామలోనిబావి, పిట్టలగూడెం, కొప్పోలు, గుర్రంపోడు, చేపూరు, మొసంగి తదితర గ్రామాల్లో టీడీపీ, సీపీఐలతో ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ అభివృద్ధి సాధనకు ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. తనను ఎనిమిదోసారి గెలిపించి ఇంతవరకు ఒకే నియోజకవర్గంలో ఎవ్వరూ సాధించని రికార్డు ఇవ్వాలని అన్నారు. ఇది తనది కాదని నన్ను ఇంతగా ఎనిమిదిసార్లు గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఈ రికార్డు దక్కుతుందని అన్నారు. తన ఈ శక్తిని, స్థాయిని ఇచ్చింది నియోజవర్గ ప్రజలేనని, ఏ పదవిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం శక్తి ఉన్నంత మేరకు కృషిచేస్తూనే ఉంటానని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లాంటి ఫథకాలు ఎన్నో అమలు చేసిందని అన్నారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారందరికీ పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. తేనపల్లి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు గట్టుపల్లి భూపాల్‌రెడ్డి జానారెడ్డి సమక్షంలో చనమల్ల జగదీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కడారి అంజయ్య యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాలచినసత్తయ్య యాదవ్, నాయకులు కంచర్ల యాదగిరిరెడ్డి, కంచర్ల వెంకటేశ్వర్‌రెడ్డి, చనమల్ల జగదీశ్వర్‌రెడ్డి, రాధాకృçష్ణ, సూదిని జగదీశ్వర్‌రెడ్డి, గట్టుపల్లి మణిపాల్‌రెడ్డి, లెంకల అశోక్‌రెడ్డి, వడ్డగోని యాదగిరిగౌడ్, జక్కల భాస్కర్, శివార్ల శేఖర్ , మారపాక అంబేద్కర్, మండల టీడీపీ అధ్యక్షుడు పోలె రామచంద్రం, ఐతరాజు మల్లేషం , సీపీఐ మండల కార్యదర్శి రేపాక లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment