kunduru janareddy
-
గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా: జైవీర్‌రెడ్డి
నిడమనూరు: తనను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని నాగార్జునసాగర్ కాంగ్రెస్ అభ్యర్థి జైవీర్‌రెడ్డి అన్నారు. మండలంలోని నాన్‌ఆయకట్టు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మండలంలోని ఊట్కూర్‌లో ఉదయం మొదలైన ప్రచారం రాత్రి వెంగన్నగూడెంలో ముగిసింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ముప్పారం, ఊట్కూర్, బంటువారిగూడెం, ఎర్రబెల్లి గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని గర్భిణులు డెలవరీ కోసం వాహనాల్లో వెళ్తే ఈ రోడ్లపైనే పరుడు అవుతుందనే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నందికొండవారిగూడెంలో గోవు పిచ్చమ్మ అనే వృద్ధురాలు జైవీర్‌రెడ్డి ప్రచారం రథం వద్దకు వచ్చి జానారెడ్డి కొడుకు ఏడయ్యా అంటూ అడిగింది. అక్కడ ఉన్న వారు ఆమెను తీసుకెళ్లి జానారెడ్డి కొడుకు జైవీర్‌రెడ్డి అంటూ చూపించారు. తనను వెతుకుంటూ వచ్చిన వృద్ధురాలిని ఆయన ఆప్యాయంగా పలకరించి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నందికొండ రామేశ్వరి, రంగశాయిరెడ్డి, రఘువీర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ మల్లయ్య, మాజీ ఎంపీపీ వెంకటరమణ, మాజీ మార్కెట్ చైర్మన్ వెంకటరెడ్డి, మండల పార్టీ అద్యక్షుడు సత్యం, శివమారయ్య, పాల్గొన్నారు. కాంగ్రెస్‌తోనే పేదలు, రైతులకు మేలు పెద్దవూర : కాంగ్రెస్ పార్టీతో నిరుపేదలకు, రైతులకు మేలు జరుగుతుందని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని జయరాంతండాకు చెందిన బీజేపీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రమావత్ దేవ్‌సింగ్‌తో పాటు పలువురు మాజీ మంత్రి జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆయన కండువాలను కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించి మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ లింగారెడ్డి, మాజీ ఎంపీపీ శంకర్‌నాయక్, శ్రీనునాయక్, సోమ్లా, భీమా పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది
నాగార్జునసాగర్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి ధీమావ్యక్తం చేశారు. పలువురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పాటు ఎమ్మార్పీఎస్ ఉపకులాల రాష్ట్రనాయకుడు విష్ణుమూర్తి బుధవారం జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో టీఎమ్మార్పీస్ చిత్రం శ్యాం ఉండగా కార్యక్రమంలో నాయకులు జంగయ్య, ఉంగరాల శ్రీను, ఆదాసు విక్రం,మందకిషోర్, పగిడి నర్సింహ, శ్రీను తదితరులు ఉన్నారు. -
వీడియో క్లిప్పింగ్ చూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా
నల్గొండ: తన తండ్రి కుందూరు జానారెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకుంటా అన్న వీడియో క్లిప్పింగ్ చూపిస్తే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని కాంగ్రెస్ పార్టీ నాగార్జునసాగర్ అభ్యర్థి కుందూరు జైవీర్‌రెడ్డి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌కు సవాల్ విసిరారు. బుధవారం నిడమనూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కేసీఆర్, బీఆర్ఎస్ అభ్యర్థి హాలియా సభలో చెప్పింది నిజమైతే వీడియో క్లిప్పింగ్ చూపించాలన్నారు. ఉచిత విద్యుత్ నాలుగేళ్లు ఇస్తే బీఆర్ఎస్ కండువా కప్పుకుంటానని నాడు ప్రతిపక్ష నేత కుందూరు జానారెడ్డి అన్నారని సీఎం కేసీఆర్ మంగళవారం హాలియా ప్రజా ఆశీర్వాద సభలో వ్యాఖ్యానించడంపై జైవీర్‌రెడ్డి స్పందించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నందికొండ రామేశ్వరి, మాజీ ఎంపీపీ యడవెల్లి రంగశాయిరెడ్డి, అంకతి సత్యం, కొండా శ్రీనివాసరెడ్డి, శివమారయ్య, నూకల వెంకట్‌రెడ్డి, అంకతి వెంకటరమణ, బొల్లం శ్రీనివాస్ యాదవ్, ప్రభాకరరెడ్డి, వల్లబరెడ్డి, వివేక్ కృష్ణ, మేరెడ్డి వెంకటరెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్, బీజేపీకి డిపాజిట్లు కూడా రావు
తిరుమలగిరి: నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలోని కొంపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు ఆదివారం నాగార్జునసాగర్‌లోని జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్, బీజేపీలు డిపాజిట్ల కోసం పోరాడాల్సిందేనన్నారు.(చదవండి: గోల్కొండపై జెండా ఎగరేద్దాం: బండి) ఎప్పటిలాగే ప్రజలను మాయమాటలతో మరోసారి మోసం చేసి ఓట్లు దండుకోవాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని, ఈసారి ప్రజలు ఆయన మాటలను నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు. తన హయాంలోనే నాగార్జునసాగర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందే తప్ప ఈ ఆరేళ్ల కాలంలో అణువంత కూడా అభివృద్ధి జరగలేదని తెలిపారు. ఎన్నికలప్పుడు మాత్రమే అధికార పార్టీకి హామీలు గుర్తుకువస్తాయని ఆయన విమర్శించారు. -
కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరు : జానా
సాక్షి, త్రిపురారం : టీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని నాగార్జునసాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు జానారెడ్డి అన్నారు. మహాకూటమి ఆధ్వర్యంలో హాలియా పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరుల ఆత్మబలిదానాల సాక్షిగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ను చిత్తుగా ఓడించాలన్నారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ అభివృద్ధి సాధనకు ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని కోరారు. తనను ఎనిమిదోసారి గెలిపించి ఇంతవరకు ఒకే నియోజకవర్గంలో ఎవ్వరూ సాధించని రికార్డు ఇవ్వాలని అన్నారు. ఇది తనది కాదని నన్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఈ రికార్డు దక్కుతుందన్నారు. నాకు ఈ శక్తిని, స్థాయిని ఇచ్చింది నియోజకవర్గ ప్రజలేనని ఏ పదవిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం శక్తి ఉన్నంత మేరకు కృషి చేస్తూనే ఉంటానని అన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి కడారి అంజయ్యయాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ నాలుగు సంవత్సరాలు ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడ్డారన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, దళితులకు మూడెకరాల భూమి, డబుల్బెడ్రూం ఇళ్లు, దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని మాట తప్పిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రిక్కల ఇంద్రసేనారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కుందూరు రఘువీర్‌రెడ్డి, కుందూరు జయవీర్‌రెడ్డి, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు కనకరాజు సామేల్మాదిగ, టీజేఏసీ నల్లగొండ ఇంచార్జి మేరెడ్డి విజయేందర్‌రెడ్డి, మహాకూటమి నేతలు మువ్వా అరుణ్‌కుమార్, బాబురావునాయక్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాకునూరి నారాయణగౌడ్, మండల అధ్యక్షుడు కుందూరు వెంకట్‌రెడ్డి, జెడ్పీటీసీ యడవెల్లి నాగమణిసోమశేఖర్, ఎంపీటీసీ గౌని శోభరాజారమేష్యాదవ్, నాయకులు శాగం పెద్దిరెడ్డి, వెంపటి శ్రీనివాస్, పాంపాటి శ్రీనివాస్, జూపల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. మరిన్ని వార్తాలు... -
ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయం: కుందూరు జానారెడ్డి
సాక్షి, గుర్రంపోడు : పదవులు ముఖ్యం కాదని, ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు శక్తి వంచన లేకుండా అభివృద్ధికి కృషి చేస్తానని సీఎల్పీ మాజీ నేత, సాగర్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని పాల్వాయి, మక్కపల్లి, మైలాపురం, జూనూతుల, తేనపల్లి, పోచంపల్లి, ఉట్లపల్లి, చామలోనిబావి, పిట్టలగూడెం, కొప్పోలు, గుర్రంపోడు, చేపూరు, మొసంగి తదితర గ్రామాల్లో టీడీపీ, సీపీఐలతో ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ అభివృద్ధి సాధనకు ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. తనను ఎనిమిదోసారి గెలిపించి ఇంతవరకు ఒకే నియోజకవర్గంలో ఎవ్వరూ సాధించని రికార్డు ఇవ్వాలని అన్నారు. ఇది తనది కాదని నన్ను ఇంతగా ఎనిమిదిసార్లు గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఈ రికార్డు దక్కుతుందని అన్నారు. తన ఈ శక్తిని, స్థాయిని ఇచ్చింది నియోజవర్గ ప్రజలేనని, ఏ పదవిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం శక్తి ఉన్నంత మేరకు కృషిచేస్తూనే ఉంటానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లాంటి ఫథకాలు ఎన్నో అమలు చేసిందని అన్నారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారందరికీ పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. తేనపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు గట్టుపల్లి భూపాల్‌రెడ్డి జానారెడ్డి సమక్షంలో చనమల్ల జగదీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కడారి అంజయ్య యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాలచినసత్తయ్య యాదవ్, నాయకులు కంచర్ల యాదగిరిరెడ్డి, కంచర్ల వెంకటేశ్వర్‌రెడ్డి, చనమల్ల జగదీశ్వర్‌రెడ్డి, రాధాకృçష్ణ, సూదిని జగదీశ్వర్‌రెడ్డి, గట్టుపల్లి మణిపాల్‌రెడ్డి, లెంకల అశోక్‌రెడ్డి, వడ్డగోని యాదగిరిగౌడ్, జక్కల భాస్కర్, శివార్ల శేఖర్ , మారపాక అంబేద్కర్, మండల టీడీపీ అధ్యక్షుడు పోలె రామచంద్రం, ఐతరాజు మల్లేషం , సీపీఐ మండల కార్యదర్శి రేపాక లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
నా గెలుపు.. చరిత్రలో నిలిచిపోవాలి
సాక్షి, నిడమనూరు (నాగార్జునసాగర్): నాగార్జునసాగర్‌లో తన గెలుపు ఉమ్మడి ఏపీలో చరిత్రగా నిలిచిపోవాలని, ఆవిధంగా ప్రజలు తీర్పు ఇవ్వాలని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి సోమవారం నామినేషన్ వేసిన అనంతరం మాట్లాడారు. ప్రస్తుతం పదో సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, మొదటి సారి అనుభవం లేక, రెండోసారి ప్రయోగానికి పోతే ప్రజలు అర్థం చేసుకోలేక ఓడించారన్నారు. మిగతా అన్ని దఫాలు అఖండ మెజారిటీతో నియోజకవర్గ ప్రజలు గెలిపించి రాష్ట్ర నాయకుడిగా ఎదిగేలా చేశారన్నారు. ఇప్పటికే 7సార్లు గెలిపించిన ప్రజలు మరోసారి గెలిపిస్తే 8సార్లు ఒకే నియోజకవర్గం నుంచి గెలిచిన చరిత్ర ఉంటుందన్నారు. కార్యక్రమంలో మహాకూటమి నాయకులు కడారి అంజయ్య(టీడీపీ), పొదిల్ల శ్రీనివాస్(సీపీఐ), కంచి శ్రీనివాస్(టీజేఎస్), కాంగ్రెస్ నాయకులు రిక్కల ఇంద్రసేనారెడ్డి, యడవెల్లి రంగగశాయిరెడ్డి, చేకూరి హన్మంతరావు, అంకతి సత్యం, మర్ల చంద్రారెడ్డి, శంకర్‌నాయక్, ఉన్నం శోభ, ఉన్నం చినవీరయ్య, వెంకటయ్య, పిల్లి రాజు, పగిల్ల శివ తదితరులు పాల్గొన్నారు. సామాజిక న్యాయం కోసం సీట్ల పంపిణీ: మిర్యాలగూడ : రాష్ట్రంలో ప్రజలకు సామాజిక న్యాయం అందించడానికి మహాకూటమిలో సీట్లు పంపిణీ చేసినట్లు కుందూరు జానారెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడలో విలేకరులతో మాట్లాడుతూ మహాకూటమిలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌తో పాటు బీసీ సంఘాలు కూడా ఉన్నాయన్నారు. అందరు కలిసి ఆర్.కృష్ణయ్యను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, కాంగ్రెస్ నాయకులు పగిడి రామలింగయ్య, దైద సంజీవరెడ్డి, కందిమళ్ల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జానారెడ్డి ఓటమి ఖాయం
సాక్షి, త్రిపురారం : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కుందూరు జానారెడ్డిని ఓటమి ఖాయమని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. సోమవారం హాలియాలోని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నర్సింహయ్య నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ దొంగలు మళ్లీ చంద్రబాబును తీసుకొని తెలంగాణ రాష్ట్రంపై దండయాత్రకు వచ్చారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు వందకుపైగా కేసులు వేశారని విమర్శించారు. గోదావరి, కృష్ణా జలాలను మనకు రాకుండా అడ్డుకున్న ఆంధ్ర పాలకుతో దోస్తీకట్టి మరోమారు మనకు అన్యాయం చేయాలని చూస్తున్నారన్నారు. జిల్లాలో మొట్ట మొదటగా ఓడిపోయేది జానారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర్రెడ్డేనన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాల వల్ల జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి విపరీతమైన స్పందన ఉందన్నారు. గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు పొందిన ప్రజలు మళ్లి టీఆర్ఎస్ పార్టీని గెలి పించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నర్సింహయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి, మలిగిరెడ్డి లింగారెడ్డి, మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఉన్నారు. విజయమే లక్ష్యంగా ముందుకెళ్లాలి గుర్రంపోడు : బూత్ కమిటీలు ప్రతి ఓటరును కలిసి టీఆర్ఎస్ సంక్షేమ పథకాలను వివరించి విజయమే లక్ష్యంగా ముందుకుసాగాలని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. మండలకేంద్రంలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పథకాలను గడపగడపకు ప్రచారం చేసేలా ప్రతి కార్యకర్త లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని అన్నారు. నాలుగు దశాబ్దాలుగా పదవులు అçనుభవించిన జానారెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదని అన్నారు. సమావేశంలో మాజీ ఆప్కాబ్ చైర్మెన్ యడవల్లి విజయేందర్‌రెడ్డి, ఆర్ఎస్ఎస్ జిల్లా కన్వీనర్ ఇస్లావత్ రాంచందర్ నాయక్, జెడ్పీటీసీ గాలి రవికుమార్, కంచర్ల విజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న జానా
కుట్రలు, కుతంత్రాల నడుమ పోలింగ్ 60 ఏళ్ల వారికి బదులుగా 20 ఏళ్లవారితో ఓట్లేయించుకున్న ఘనత ఆయనదే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల హాలియా, న్యూస్‌లైన్ : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల విషయంలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మేకపోతుగాంభీర్యం ప్రదర్శిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నర్సింహయ్య అన్నారు. గురువారం హాలియాలో ఆ పార్టీ జిల్లా నాయకుడు మల్గిరెడ్డి లింగారెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రశాంతంగానే జరిగాయన్నారు. ఫలితాలు మాత్రం టీఆర్ఎస్కు అనుకూలంగా రానున్నట్లు తెలిపారు. వివాదాస్పదమైన గ్రామాల్లో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలని స్థానిక రిటర్నింగ్ అధికారితో పాటు జిల్లా కలెక్టర్, స్టేట్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లకు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. అయినా స్థానిక రిటర్నింగ్ అధికారి సరిగా స్పందించలేదని ఆరోపించారు. 60 ఏళ్ల వారి ఓట్లను 20 ఏళ్ల వారితో వేయించుకున్నారన్నారు. రిగ్గింగ్‌కు పాల్పడేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ ఏజెంట్లపై దాడులకు పాల్పడడం సిగ్గుచేటని విమర్శించారు. పేరూరు గ్రామ పోలింగ్ బూత్‌లో కూర్చున్న టీఆర్ఎస్ ఏజెంట్‌ను కొడితే ఆపేందుకు అక్కడికి వెళ్లిన తన కుమారుడిని ఎక్కడోనివిరా అంటూ దుర్భాషలాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారని ఆరోపించారు. మరి భాస్కర్‌రావు, హనుమంతరావు, నీ కుమారుడు ఎక్కడోళ్లని ఎమ్మెల్యే టికెట్ అడిగారని జానాను ప్రశ్నించారు. ‘మీరు పెద్దరికంతో వ్యవహరిస్తే చేతులెత్తి దండం పెడతా.. లేకుంటే దొండాకు పసరు నుంచి అన్నీ కక్కిస్తా’ అని జానాను హెచ్చరించారు. ఆయన వెంట టీఆర్ఎస్ జిల్లా నాయకులు మల్గిరెడ్డి లింగారెడ్డి, అంకతి వెంకటరమణ, కృష్ణయ్య, ఎక్కలూరి శ్రీనివాస్‌రెడ్డి, కర్ణ నర్సిరెడ్డి పాల్గొన్నారు. -
పొన్నాలకు తెలంగాణ పీసీసీ పదవి!
న్యూఢిల్లీ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) తొలి అధ్యక్షుడిగా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ పీసీసీ (టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్‌గా దామోదర రాజ నర్సింహ, ప్రచార కమిటీ కో ఛైర్మన్‌గా షబ్బీర్ అలీ, మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా శ్రీధర్‌బాబు, మ్యానిఫెస్టో కమిటీ కో ఛైర్మన్‌గా భట్టి విక్రమార్కలను కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం సుమారు డజను మంది పేర్లను పరిశీలించింది. డీఎస్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర మాజీ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. దళితుడైన దామోదర రాజనర్సింహ పేరు కూడా పరిశీలనకు వచ్చింది. చివరికి సీనియారిటీ, సామాజిక నేపథ్యం, సమన్వయం చేయగల సామర్ధ్యం నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
టీపీసీసీ చీఫ్?
-
టీపీసీసీ చీఫ్‌గా జానారెడ్డి?
-
టీపీసీసీ చీఫ్‌గా జానారెడ్డి?
సీమాంధ్ర పీసీసీ చీఫ్‌గా బొత్సనే కొనసాగించాలని నిర్ణయం! చిరంజీవికి ప్రచార కమిటీ సారథ్యం! నేడో, రేపో ప్రకటన సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) తొలి అధ్యక్షుడిగా మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. సీమాంధ్రకు ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణనే కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. టీపీసీసీ చీఫ్ పదవికి పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్, పొన్నాల పేర్లు చివరివరకు పరిశీలనలో ఉన్నప్పటికీ, సామాజికవర్గమే అడ్డుగా నిలిచినట్లు తెలిసింది. సీమాంధ్రకు కాపు సామాజికవర్గానికి చెందిన బొత్సను పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తున్నందున, తెలంగాణకు మరో సామాజిక వర్గానికి అవకాశమివ్వాలన్న నిర్ణయంతో జానారెడ్డికి అవకాశం దక్కినట్లు తెలిసింది. ఇరు ప్రాంతాల పీసీసీ అధ్యక్షుల పేర్లను వెల్లడిస్తూ అధిష్టానం ఒకట్రెండు రోజుల్లో ప్రకటన చేసే అవకాశాలున్నాయి. పార్టీవర్గాల కథనం ప్రకారం.. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం సుమారు డజను మంది పేర్లను పరిశీలించింది. డీఎస్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర మాజీ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. దళితుడైన దామోదర రాజనర్సింహ పేరు కూడా పరిశీలనకు వచ్చింది. చివరికి సీనియారిటీ, సామాజిక నేపథ్యం, సమన్వయం చేయగల సామర్ధ్యం ఎక్కువ మంది జానారెడ్డి వైపే మొగ్గు చూపడంతో ఆయన పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీమాంధ్రకు పీసీసీ ప్రస్తుత అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతోపాటు కేంద్ర మంత్రులు చిరంజీవి, పళ్లంరాజు, రాష్ట్ర మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, ఎన్.రఘువీరారెడ్డి పేర్లు పరిశీలనకు వచ్చాయి. చివరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్‌లు తెలంగాణకు జానారెడ్డి, డీఎస్‌ల పేర్లతో, సీమాంధ్రకు బొత్స, కన్నా, చిరంజీవి పేర్లతో తుది జాబితాను సిద్ధం చేశారు. సోనియా టీపీసీసీ అధ్యక్షుడిగా జానారెడ్డి, సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడిగా బొత్సను ఖరారు చేసినట్లు తెలిసింది. చిరంజీవికి సీమాంధ్రలో పార్టీ ప్రచార సారథిగా బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. డీఎస్‌కు మాత్రం ఎలాంటి బాధ్యతలు అప్పగించాలనే విషయంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని సమాచారం. శని లేదా ఆదివారాల్లో తెలంగాణ, సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుల పేర్లతోపాటు ఇతరత్రా కమిటీలను కూడా వెల్లడించాలని హైకమాండ్ నిర్ణయించినట్లు తెలిసింది. సచ్ఛీలుడికే పార్టీ పగ్గాలివ్వాలి: సచ్ఛీలుడు, సమర్థత కలిగిన నేతకే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించాలని కోరతూ పార్టీ అధినేత సోనియాగాంధీకి లేఖ రాయాలని టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు నిర్ణయించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కేఆర్ ఆమోస్, యాదవరెడ్డి, భానుప్రసాద్, జగదీశ్వర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఫారూక్ హుస్సేన్ తదితరులు శుక్రవారం సీఎల్పీలో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రత్యేక పీసీసీ ఏర్పాటుపై అధిష్టానం కసరత్తు చేస్తున్నందున తమ అభిప్రాయాలను తెలియజేస్తూ ఓ లేఖను సిద్ధం చేశారు. గురువారం తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీకి తమను ఆహ్వానించకపోవడంపై ఎమ్మెల్సీలు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీలుగా మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నేతలను సమన్వయ పరిచేందుకు ఆమోస్ చైర్మన్‌గా కమిటీని ఏర్పాటుచేశారు. -
రోడ్డు విస్తరణతో రవాణా సౌకర్యం మెరుగు
గుర్రంపోడు, న్యూస్‌లైన్: గుర్రంపోడు-మల్లేపల్లిల మధ్య రోడ్డు విస్తరణతో రవాణా సౌకర్యం మరింతగా మెరుగుపడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. గుర్రంపోడులో *19 కోట్లతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు ఆయన ఆది వారం ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నల్లగొండ- దేవరకొండల మధ్య రవాణా సౌకర్యం పెరిగి ఈ ప్రాంత అభివృద్దికి దోహదపడుతుందన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ రోడ్డు విస్తరణ మల్లేపల్లి వరకే కాకుండా జడ్చర్ల వరకు క్రమంగా విస్తరించనున్నట్ట పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్, ఆర్డీఓ రవినాయక్, ఆర్అండ్బీ ఎస్ఈ లింగయ్య, ఈఈ రఘునందన్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాల చినసత్తయ్యయాదవ్, పీఏసీఎస్ చైర్మన్ కుప్ప రాములు, చనమల్ల జగదీశ్వర్‌రెడ్డి, కె.వెంకటేశ్వర్‌రెడ్డి, తగుళ్ల యాదయ్య, రంగినేని నర్సింహారావు, వెలుగు రవి, రాధాకృష్ణ, మంచికంటి వెంకటేశ్వర్లు, రాజ్యరమేష్ యాదవ్, ఎంపీడీఓ రాంపర్తి భాస్కర్, తహసీల్ధార్ తిరందాసు వెంకటేశం, సర్పంచ్ రేపాక ప్రమీల పాల్గొన్నారు. 14 స్థానాలను సోనియాకు కానుకగా ఇవ్వాలి దేవరకొండ : తెలంగాణ ప్రజల ఆకాం క్షను నెరవేర్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవడానికి రానున్న ఎన్నికల్లో జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలి పించి ఆమెకు కానుకగా అందించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కుం దూరు జానారెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని దేవరకొండ మం డలం పెండ్లిపాకలలో మొదటి విడత కృష్ణాజలాల విడుదల, కొండమల్లేపల్లి నుంచి గుర్రంపోడు వరకు రోడ్డు విస్తరణ, దేవరకొండ పట్టణంలోని నాలుగు లేన్ల రహదారి విస్తరణ, దేవరకొండ నుంచి బొల్లిగుట్ట వరకు రహదారి విస్తరణ వంటి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం దేవరకొండ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. చందంపేట మండలంలోని కృష్ణాజలాలు అందని 12గ్రామాల కోసం *12కోట్లను మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ వర్షం వచ్చే ముందు వచ్చే ఆరుద్ర పురుగుల్లా ఎన్నికలకు ముందు అభివృద్ధి చేస్తామంటూ వచ్చేవారిని కాకుండా నియోజకవర్గ అభివృద్దికి ఎంతగానో కృషిచేసిన వారిని ఆదరించాలని కోరారు. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ నేడు ప్రారంభించిన *100 కోట్ల విలువైన కృష్ణాజలాల మంచినీటి పథకాన్ని ప్రకటించి, పూర్తిచేసి దేవరకొండ ప్రజల ముందుకు వచ్చిన జానారెడ్డి నియోజకవర్గ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. సమావేశంలో ఆర్డీఓ రవి నాయక్, ఎంపీడీఓ విజయలక్ష్మీ, తహసీల్దార్ వెంకన్న, కాంగ్రెస్ నాయకులు సురేశ్‌రెడ్డి, ఆలంపల్లి నర్సింహ, పున్న వెంకటేశ్వర్లు, ముక్కమాల వెంకటయ్య, గోవిందు పాల్గొన్నారు.