రోడ్డు విస్తరణతో రవాణా సౌకర్యం మెరుగు | the transport facility to improve with the expansion of the road | Sakshi
Sakshi News home page

రోడ్డు విస్తరణతో రవాణా సౌకర్యం మెరుగు

Published Mon, Jan 13 2014 4:50 AM | Last Updated on Thu, Aug 30 2018 5:49 PM

the transport facility to improve  with the expansion of the road

గుర్రంపోడు, న్యూస్‌లైన్: గుర్రంపోడు-మల్లేపల్లిల మధ్య రోడ్డు విస్తరణతో రవాణా సౌకర్యం మరింతగా మెరుగుపడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. గుర్రంపోడులో *19 కోట్లతో చేపట్టిన   రోడ్డు విస్తరణ పనులకు ఆయన ఆది వారం ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నల్లగొండ- దేవరకొండల మధ్య రవాణా సౌకర్యం పెరిగి ఈ ప్రాంత అభివృద్దికి దోహదపడుతుందన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ రోడ్డు విస్తరణ మల్లేపల్లి వరకే కాకుండా జడ్చర్ల వరకు క్రమంగా విస్తరించనున్నట్ట పేర్కొన్నారు.

 కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్, ఆర్డీఓ రవినాయక్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ లింగయ్య, ఈఈ రఘునందన్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాల చినసత్తయ్యయాదవ్, పీఏసీఎస్ చైర్మన్ కుప్ప రాములు, చనమల్ల జగదీశ్వర్‌రెడ్డి, కె.వెంకటేశ్వర్‌రెడ్డి, తగుళ్ల యాదయ్య, రంగినేని నర్సింహారావు, వెలుగు రవి, రాధాకృష్ణ, మంచికంటి వెంకటేశ్వర్లు, రాజ్యరమేష్ యాదవ్, ఎంపీడీఓ రాంపర్తి భాస్కర్, తహసీల్ధార్ తిరందాసు వెంకటేశం, సర్పంచ్ రేపాక ప్రమీల పాల్గొన్నారు.

 14 స్థానాలను సోనియాకు కానుకగా ఇవ్వాలి
 దేవరకొండ : తెలంగాణ ప్రజల ఆకాం క్షను నెరవేర్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవడానికి రానున్న ఎన్నికల్లో జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలి పించి ఆమెకు కానుకగా అందించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కుం దూరు జానారెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని దేవరకొండ మం డలం పెండ్లిపాకలలో మొదటి విడత కృష్ణాజలాల విడుదల, కొండమల్లేపల్లి నుంచి గుర్రంపోడు వరకు రోడ్డు విస్తరణ, దేవరకొండ పట్టణంలోని నాలుగు లేన్ల రహదారి విస్తరణ, దేవరకొండ నుంచి బొల్లిగుట్ట వరకు రహదారి విస్తరణ వంటి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

అనంతరం దేవరకొండ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. చందంపేట మండలంలోని కృష్ణాజలాలు అందని 12గ్రామాల కోసం *12కోట్లను మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ వర్షం వచ్చే ముందు వచ్చే ఆరుద్ర పురుగుల్లా ఎన్నికలకు ముందు అభివృద్ధి చేస్తామంటూ వచ్చేవారిని కాకుండా నియోజకవర్గ అభివృద్దికి ఎంతగానో కృషిచేసిన వారిని ఆదరించాలని కోరారు.

దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ నేడు ప్రారంభించిన *100 కోట్ల విలువైన కృష్ణాజలాల మంచినీటి పథకాన్ని ప్రకటించి, పూర్తిచేసి దేవరకొండ ప్రజల ముందుకు వచ్చిన జానారెడ్డి నియోజకవర్గ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. సమావేశంలో ఆర్డీఓ రవి నాయక్, ఎంపీడీఓ విజయలక్ష్మీ, తహసీల్దార్ వెంకన్న, కాంగ్రెస్ నాయకులు సురేశ్‌రెడ్డి, ఆలంపల్లి నర్సింహ, పున్న వెంకటేశ్వర్లు, ముక్కమాల వెంకటయ్య, గోవిందు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement