ఘనంగా తీజ్ పండుగ
ఘనంగా తీజ్ పండుగ
Published Thu, Aug 4 2016 6:21 PM | Last Updated on Sun, Apr 7 2019 4:37 PM
నిర్వహించడం ఆనవాయితీ అని అఖిల భారత బంజార సేవ సమితి జిల్లా అధ్యక్షుడు ధనావత్ ధన్‌సింగ్ నాయక్ పేర్కొన్నారు. మండలంలో బొర్రాయిపాలెం గ్రామ పరిధిలోని రెడ్యాతండాలో తొమ్మిది రోజులుగా జరుగుతున్న తీజ్ ముగింపు కార్యక్రమాన్ని గురువారం ఘనంగా జరుపుకున్నారు. గిరిజన సాంప్రదాయం ప్రకారం వివాహంకాని గిరిజన యువతులు తండాలో ఎంతోమంది ఉంటే అన్ని తీజ్ బుట్టలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పందిరిపై ఉంచి తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసి పూజలు నిర్వహించారు. చివర రోజు తీజ్ బుట్టలను ఊరేగింపుగా తీసుకెళ్లి తండా సమీపంలోని బావుల్లో కలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు ధూళిపాల రామచంద్రయ్య, అప్పలమ్మగూడెం సర్పంచ్ మూడు నర్సింహనాయక్, కామర్ల జానయ్య, ధనావత్ కాంతారావు, ధనావత్ హనుమంతు, బంజార సేవా సంఘం ప్రచార కార్యదర్శి ధనావత్ వెంకటేశ్వర్లు, తండా పెద్దలు భిక్షానాయక్, సంగ్య, లక్‌పతి, హన్మ, శ్రీరాములు, రమేశ్, రెడ్యా, సునిత, పున్నమ్మ, మౌనిక, జ్యోతి, అనూష, లక్ష్మి, కవిత, భార్గవి, దివ్య, మధుమతి, లక్ష్మి ఉన్నారు.
Advertisement
Advertisement