హృదయం ద్రవించిన వేళ.. | Sharmila tearful to seeing victim familes problems at Paramarsha | Sakshi
Sakshi News home page

హృదయం ద్రవించిన వేళ..

Published Fri, Jan 23 2015 1:53 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

హృదయం ద్రవించిన వేళ.. - Sakshi

హృదయం ద్రవించిన వేళ..

‘పరామర్శ యాత్ర’లో కుటుంబాల ఆవేదన చూసి షర్మిల కంటతడి తమ తండ్రిని, వైఎస్సార్‌ను గుర్తుచేసుకుంటూ రోదించిన వెంకట నర్సయ్య కుమార్తెలు ఉద్వేగాన్ని తట్టుకోలేక కన్నీటి పర్యంతమైన షర్మిల కుటుంబానికి అండగా ఉంటామన్న వైఎస్ జగన్ సోదరి త్రిపురారంలో మైల రాములు కుటుంబానికి భరోసా ఆయన భార్య హ–ద్రోగానికి చికిత్స చేయిస్తామని హామీ నల్లగొండ జిల్లాలో రెండో రోజు మూడు కుటుంబాలకు పరామర్శ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది.. ప్రజలకు పెద్ద దిక్కయిన వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక ఆ ఇంటిపెద్ద ప్రాణాలు విడిచారు.. అటు ప్రాణప్రదమైన కుటుంబ సభ్యుడిని కోల్పోయి, ఇటు వైఎస్సార్ లాంటి ప్రజా నాయకుడిని కోల్పోయిన బాధతో ఆ ఇల్లు తల్లడిల్లింది.. ఐదేళ్ల తర్వాత మహానేత కుమార్తె షర్మిలను చూడగానే ఆ ఆవేదన అంతా మళ్లీ పెల్లుబికింది.

నాడు మరణించిన వైఎస్సార్‌ను, ఆ బాధతో ప్రాణాలు విడిచిన తమ తండ్రిని గుర్తుచేసుకుంటూ... ఆయన ఐదుగురు కుమార్తెలు గుండెలవిసేలా రోదించారు. ‘మమ్మల్ని గుర్తుపెట్టుకుని వచ్చావా తల్లీ.. మాకిది చాలు’ అంటూ తమ ప్రేమను పంచారు. తమ కష్టాలు చెప్పుకొన్నారు. ఈ ఆవేదనను పంచుకున్న షర్మిల కూడా కన్నీటి పర్యంతమయ్యారు. వారికి తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు.. గురువారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని హిల్ కాలనీలో కామిశెట్టి వెంకటనర్సయ్య కుటుంబాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిల పరామర్శించిన సందర్భంగా కనిపించిన దృశ్యమిది... నల్లగొండ జిల్లాలో షర్మిల రెండో రోజు పరామర్శ యాత్ర గురువారం నాగార్జునసాగర్ నుంచి ప్రారంభమైంది. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక తాను పనిచేస్తున్న కార్యాలయం భవనంపై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయిన కామిశెట్టి వెంకట నర్సయ్య కుటుంబాన్ని తొలుత షర్మిల పరామర్శించారు. నాగార్జునసాగర్‌లోని హిల్‌కాలనీలో ఉన్న వారి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో అరగంటకుపైగా మాట్లాడారు.

షర్మిలతో మాట్లాడుతున్న సమయంలో వెంకట నర్సయ్య కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ‘‘మా నాన్న మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్లిపోయాడు. ఇంటి పెద్దదిక్కును కొల్పోయాం అక్కా. మేం ఐదుగురం ఆడపిల్ల లం. ఆయనకు ఉన్న దాంట్లోనే మమ్మల్ని చది వించాడు. వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రజలకు చాలా మేలు చేశాడని ఎప్పుడూ అంటుండేవాడు. వైఎస్ మీద మా నాన్నకు ఉన్న అభిమానం ముందు మేమెవ్వరమూ గుర్తు రాలేదక్కా.. ఆయన మీద అభిమానంతో ప్రాణాలు వది లాడు. ఇది జరిగి ఐదేళ్లయినా గుర్తు పెట్టుకుని మమ్మల్ని ఓదార్చడానికి ఇంతదూరం వచ్చా రు. అది చాలు మాకు..’’ అంటూ వెంకటనర్స య్య కుమార్తెలు నోమిని, పార్వతి తమ బాధను షర్మిలతో పంచుకున్నారు. వెక్కివెక్కి ఏడుస్తున్న నోమిని చేతులు పట్టుకుని షర్మిల కూడా కన్నీళ్ల పర్యంతమయ్యారు. ‘నేనేమో చదువుకోలేదు.. ఏం చేయాలో ఎలా బతకాలో నాకేమీ తెలియడం లేదమ్మా..’ అంటూ రోదిం చిన వెంకట నర్సయ్య భార్య రంగమ్మకు షర్మిల ధైర్యం చెప్పారు. ‘‘దేవుడు అందరికీ మంచే చేస్తాడమ్మా.. మీ కుటుంబానికి మేం అండగా ఉంటాం. అందరూ ధైర్యంగా ఉం డండి..’’ అని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నోమిని, పార్వతి తయారు చేసిన గులాబ్‌జామ్‌ను షర్మిలకు తినిపించారు.

రెండోరోజు.. మూడు కుటుంబాలు
గురువారం నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలోని మూడు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. తొలుత కామిశెట్టి వెంకటనర్సయ్య కుటుంబాన్ని సందర్శించిన షర్మిల... అనంతరం అనుముల మండలం గరికేనాటి తండాకు వెళ్లి బానావత్ బోడియానాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ గ్రామస్తులు షర్మిలకు ఎదురేగి ఊరిలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత భోజనం పూర్తి చేసుకున్న షర్మిల... త్రిపురారం పట్టణంలోని మైల రాములు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు తమ కష్టాలను షర్మిల దృష్టికి తీసుకెళ్లారు. రాములు భార్య ధనమ్మ హ–ద్రోగి అని, ఆమెకు ఆపరేషన్ అవసరమని కుటుంబ సభ్యులు తెలపడంతో చలించిపోయారు. చికిత్స చేయించుకుంటున్నారా? అని అడిగినప్పుడు తమ ఆర్థిక పరిస్థితి బాగా లేదని వారు చెప్పడంతో... అవసరమైన చికిత్స అందిస్తామని షర్మిల హామీ ఇచ్చారు. వెంటనే హైదరాబాద్‌కు ఆమెను తీసుకువెళ్లాలని ధనమ్మ కుమారులకు చెప్పారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులను షర్మిల ఆదేశించారు. కాగా.. రెండోరోజు పరామర్శ యాత్రలో షర్మిల వెంట వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గున్నం నాగిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, అమృతాసాగర్, పార్టీ అనుబంధ యువజన సంఘం అధ్యక్షుడు బీష్వ రవీందర్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు ముస్తఫా అహ్మద్, పార్టీ కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త పెదపటోళ్ల సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు గూడూరు జైపాల్‌రెడ్డి, ఇరుగు సునీల్ కుమార్, మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వైఎస్ సగం... నాన్న సగం
‘‘అమ్మా.. ఇది మా నాన్న వెంకట నర్సయ్య ఫొటో. ఇందులో ముఖం మాత్రమే నాన్నది. మిగతా అంతా వైఎస్ ఫొటోనే... వైఎస్సార్ మీద అభిమానంతో మా నాన్న ఇలా ఫొటో చేయించుకున్నారు.. అందులోనే మా నాన్నను, వైఎస్సార్‌ను ఇద్దరినీ చూసుకుంటున్నాం..’’ అని కామిశెట్టి వెంకట నర్సయ్య కూతుళ్లు నోమిని, పార్వతి.. షర్మిలకు చెప్పుకుని మురిసిపోయారు. వెంకట నర్సయ్య కుటుంబాన్ని పరామర్శిస్తున్న సందర్భంగా ఇంటిగోడకు తగిలించి ఉన్న ఆ ఫొటోను వారు షర్మిలకు చూపించారు. షర్మిల ఆ ఫొటో వైపు చూస్తుండగా ఎంపీ పొంగులేటి దానిని తీసి ఆమె చేతికి ఇచ్చారు. ఆ ఫొటోను తదేకంగా చూసిన షర్మిల... తన తండ్రి ఉన్న ఆ ఫొటోను ఆత్మీయంగా చేతులతో తడిమి చూసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement