హలియా (నల్లగొండ): కల్తీ కల్లు తయారు చేస్తున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా హలియా మండలంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని శ్రీరాంపూర్‌లో ఓ వ్యక్తి కల్తీకల్లు తయారు చేస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. అనంతరం సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని, ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.