mixed kallu
-
కల్తీ కల్లు తయారీ: ఒకరి అరెస్ట్
హలియా (నల్లగొండ): కల్తీ కల్లు తయారు చేస్తున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా హలియా మండలంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని శ్రీరాంపూర్‌లో ఓ వ్యక్తి కల్తీకల్లు తయారు చేస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. అనంతరం సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని, ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
'హైదరాబాద్ లో అసలు కల్లు ఎలా సాధ్యం'
హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో విక్రయిస్తున్నదంతా కల్తీ కల్లేనని కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు విమర్శించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. చెట్లు లేని హైదరాబాద్‌లో అసలైన కల్లు ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కల్లీకల్లును ప్రభుత్వం వెంటనే నిలిపేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఐదు కోట్లు ఈత చెట్లు పెంచుతామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. అదే విధంగా ఆ చెట్లు పెరిగాకే వాటి కల్లును విక్రయించాలని చెప్పారు. హైదరాబాద్‌లో కల్లు విక్రయాలతో లాభ పడుతున్నది మద్యం కాంట్రాక్టర్లేనని ఆయన ఆరోపించారు. అంతే కానీ గీత కార్మికులకు ఒరిగిందేమీ లేదని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.