కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
- ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు మంజూరు
- మండలకేంద్రానికి రూ.30 లక్షలు మంజూరు
- నల్లగొండ మున్సిపాలిటీకి రూ.10 కోట్లు
- మిర్యాలగూడకు రూ.5కోట్లు మంజూరు చేశాం
- మిగతా మున్సిపాలిటీలకు రూ.కోటి చొప్పున నిధులు
- నల్లగొండ జిల్లాకు మొత్తం రూ.186 కోట్లు మంజూరు
- నెల్లికల్లు భూ నిర్వాసితుల సమస్యను రెండ్రోజుల్లో పరిష్కరిస్తాం
- ఎత్తిపోతల పథకాలకు రూ.2,500 కోట్లు కేటాయించాం
- ఏడాదిన్నరలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తాం
- ఏడాదిన్నరలో పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగను
- త్వరలోనే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాం
- కృష్ణా-గోదావరి అనుసంధానం చేసి నల్లగొండ జిల్లా కాళ్లు కడుగుతా
- బీజేపీ, కాంగ్రెస్ నేతలు హద్దు మీరితే.. తొక్కి పారేస్తాం
- తెలంగాణ వెనుకబాటుతనానికి కాంగ్రెస్సే కారణం
- బీజేపీ నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారు
- ఆరేళ్లలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టాం
- నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం
- కంటివెలుగు, కల్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్ వంటి పథకాలు పెట్టి ఆదుకుంటున్నాం..
- ప్రతి యాదవ కుటుంబానికి గొర్రెలు ఇస్తాం
- ప్రతి ఏడాది రైతు బంధు ద్వారా రూ.15వేల కోట్లు ఇస్తున్నాం
- రాష్ట్రంలో 2,600 రైతు కేంద్రాలు పెట్టాం.. రోజూ చర్చలు జరపాలి
- 3,400లకుపైగా తండాలను గ్రామపంచాయతీలు చేశాం
- దళితుల అభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు పెడతాం
బహిరంగ సభ ప్రారంభం
హాలియాలో టీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభ కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ప్రతి గ్రామపంచాయతికీ రూ.20 లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కేసీఆర్
నెల్లికల్లులో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసిన కేసీఆర్ లిఫ్టు ఇరిగేషన్ వరకు ఎల్‌ఎల్‌సీ పంప్ హౌజ్ నుంచి ఎచ్‌ఎల్‌సీ 8, 9 డిస్ట్రిబ్యూటరీ ద్వారా నీటి సరఫరాకు మరమ్మత్తుల పనులు... దేవరకొండ నియోజకవర్గ పరిధిలో... పొగిల్ల ఎత్తిపోతల, కంబాలపల్లి ఎత్తిపోతల, నంబాపురం-పెద్దగట్టు ఎత్తిపోతల.. పెద్దమునగాల ఎత్తిపోతల, ఏకేబీఆర్ ఎత్తిపోతల పథకం.. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని.. దున్నపోతుల గండి, బాల్లేపల్లి చాప్లాతాండా ఎత్తిపోతల.. కేశవాపురం కొండ్రాపోల్, బొత్తల పాలెం వాడపల్లి ఎత్తిపోతల.. నాగార్జున సాగర్-మిర్యాలగూడ నియోజకవర్గాల పరిధిలోని ఎస్‌ఎల్‌బీసీ కాల్వ 1.8 కిలోమీటర్ల నుంచి 70.52 కిమీ వరకు సీసీ లైనింగ్.. హుజూర్ నగర్-కోదాడ నియోజక వర్గాల పరిధిలో ముక్త్యాల బ్రాంచ్‌కు ఎత్తిపోతల.. జాన్‌పహాడ్ బ్రాంచ్‌కు ఎత్తిపోతలతో పాటు డిస్ట్రిబ్యూటరీ సీసీ లైనింగ్, ముక్త్యాల బ్రాంచ్ కెనాల్, ఇతర ట్యాంకులుకు సీసీ లైనింగ్, ఆధునీకీకరణ... సూర్యాపేట-హుజూర్ నగర్-కోదాడ పరిధిలోని సాగర్ ఎడమ కాల్వ 70.52 కిలోమీటర్ల నుంచి 115.4 కిమీ వరకు సీసీ లైనింగ్ అభివృద్ది పనులకు సంభందించిన శంకుస్థాపనలన్నింటిని నెల్లికల్లులో ఒకే చోట చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పనుల వివరాల మ్యాప్‌లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నల్లగొండ: నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సన్నాహాల్లో భాగంగా బుధవారం హాలియాలో టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. టీఆర్‌ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరయ్యే ఈ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు లక్షల మందిని సమీకరించడం లక్ష్యంగా టీఆర్‌ఎస్ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇప్పటికే నాగార్జున సాగర్ చేరుకున్న సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో నెల్లికల్లు చేరుకున్నారు. ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత హాలియా బహిరంగ సభకు హాజరవుతారు.
Comments
Please login to add a commentAdd a comment