కనగల్ క్రాస్‌రోడ్డులో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రజలు కనగల్: మాట్లాడుతున్న కోమటిరెడ్డి
సాక్షి, నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాకోరు అని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆ పార్టీ గెలవలేదన్న అభద్రతాభావంతోనే ఆశీర్వాద సభలో ఇష్టానుసార వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. శుక్రవారం నల్లగొండలోని తన నివా సంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ పాలనలో ఉమ్మడి జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. సొరంగమార్గం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజె క్టు గురించి ఊసే ఎత్తుకుండా మూసీకి కొన్ని నిధులు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. దామరచర్లలో పవర్ ప్లాంట్ జిల్లా ప్రజలను చంపడానికి పెడుతున్నాడని ఆరోపించారు.
ఆ ప్రాజెక్టుతో జిల్లా ప్రజలకు నష్టమేనని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. పొట్టివాడు గట్టివాడు అని మంత్రి జగదీశ్ రెడ్డిని గురించి కేసీఆర్ వ్యాఖ్యానించారని, గట్టివాడు కాదు తిక్కలోడు అని అర్థమవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పది స్థానాలు గెలిస్తే జగదీశ్‌రెడ్డి విజయం సాధిస్తారా అని వ్యంగంగా అన్నారు. జిల్లాలో ఫ్లోరిన్ కోసం కేసీఆర్ చేసింది ఏమీ లేదన్నారు. తాను 11 రోజులు తెలుగుదేశం ప్రభుత్వం హ యాంలో నిరాహార దీక్షచేశానని పేర్కొన్నారు.
మాయ మాట లు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తే నమ్మరన్నారు. ఎలాంటిì మచ్చలేని వ్యక్తి జానారెడ్డి అని, అలాంటి వ్యక్తిని దొంగ అంటున్న నీవే గజదొంగవన్నారు. 60 లక్షల గొర్రెలు ఇస్తే అవి 30 లక్షల పిల్లలు పెట్టినవి అంటున్నాడు పిల్లలు లేవు తల్లులేవని అంతా అవినీతి ప్రాజెక్టు అని ఆరోపించారు. మంత్రివర్గంలో ఒక్క మహిళకు అవకాశం ఇవ్వలేదని అలాంటి నీకపట ప్రేమ ప్రజలకు తెలియంది కాదన్నారు. కేసీఆర్ చేస్తే సంసారం...ఇతరులు చేస్తే వ్యభిచారమా? అని ప్రశ్నించారు. 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న విషయాన్ని జిల్లా ప్రజలు మరిచి పోలేదన్నారు. సమావేశంలో నాయకులు వంగాల స్వామి గౌడ్, గుమ్మల మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాస్‌గౌడ్, సంపత్ రెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: కోమటిరెడ్డి
కనగల్ (నల్లగొండ) : వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని దర్వేశిపురం, కనగల్, అమ్మగూడెం, ల చ్చుగూడెం, కురంపల్లి తదితర గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొదటగా శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలన చేతకాక ముందస్తు ఎన్నికలంటూ కేసీఆర్ పారిపోయిండన్నారు. వైఎస్సార్ హయాంలో శ్రీశైలం సొరంగం పనులకు రూ. 2వేల కొట్లు, బ్రాహ్మణ వెళ్లెంల ప్రాజెక్టు నిర్మిణానికి రూ.7వందల కోట్లు, జిల్లాకేంద్రంలో యూనివర్సిటీని మంజూరు చేయిం చినట్లు పేర్కొన్నారు.
తాము అధికారంలో వస్తే రైతులతోపాటు సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. మేనిఫెస్టో వైస్ చైర్మన్‌గా చెబుతున్నా.. ఇచ్చిన హహీలను నెరవేర్చి తీరుతామన్నారు. ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, వృద్ధులకు పింఛన్ రూ. 2వేలు, వికలాంగులకు రూ.3వేల పింఛన్, నిరుద్యోగుల కు భృతి నెలకు రూ.3వేలు ఇస్తామన్నారు. సొంత భూమిలో మీ ఇష్టమొచ్చిన చోట కొత్త ఇళ్లు నిర్మించుకునేందుకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఇస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో రూ.4లక్షలతో మండలకేంద్రంలో వాటర్ ప్లాం ట్‌ను ప్రారంభించారు. కనగల్ క్రాస్‌రోడ్డులోని దివంగత సీఎం వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
దర్వేశిపురం, కనగల్, అమ్మగూడెం, లచ్చుగూడెం తదితర గ్రామాల్లో భారీగా వివిధ పార్టీల నుంచి కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయా గ్రామాలతోపాటు కురంపల్లిలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. దర్వేశిపురం నుంచి కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో బైక్‌ర్యాలీ నిర్వహింస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారం మధ్యలోనే కనగల్‌లో భోజనం చేశారు. ఆయా కార్యక్రమాల్లో వంగాల స్వామి గౌడ్, కనగల్ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ మం డల అధ్యక్షుడు గడ్డం అనూప్‌రెడ్డి, నాయకులు వెంకట్‌రెడ్డి, పెం టయ్య, సత్తయ్య, సైదులు, మహేశ్, వెంకన్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment