జగదీశ్ రెడ్డి(పాత చిత్రం)
నల్గొండ జిల్లా: పూటకో మాట, గడియకో చిత్తం ఉండే కోమటి రెడ్డి బ్రదర్స్ తమ పార్టీ(టీఆర్‌ఎస్)కి అక్కర్లేదని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండలో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ నూతన భవనాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ..కోమటిరెడ్డి లాంటి బ్రోకర్లు, జోకర్లను మా పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధంగాలేమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మతిస్థిమితం లేక ఏదేదో మాట్లాడే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసుపత్రికి పోతే మంచిదని సూచించారు.
తెలంగాణా యావత్తూ సీఎం కేసీఆర్‌కు అండగా ఉన్నారని అన్నారు. రాహుల్ గాంధీ పర్యటనతో తెలంగాణ ప్రభుత్వానికి ఏమీ కాదని, తెలంగాణ ఇవ్వకుండా వందల మంది విద్యార్థులను చంపింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తూ కుట్ర రాజకీయాలు చేస్తున్నదని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. రాహుల్ పర్యటనకు ప్రజలు లేరు..ప్రజలు కాంగ్రెస్‌ను పట్టించుకోరని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment