
సాక్షి, నల్గొండ : స్థానిక ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్, టీఆర్‌ఎస్ వర్గీయుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కోమటిరెడ్డి గో బ్యాక్ అంటూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయటంతో గొడవ చెలరేగింది. వివరాల మేరకు.. శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నల్గొండ పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్‌ఎస్ నాయకులు ఎన్నికల కోడ్‌ని ఉల్లఘించారు. పోలింగ్ కేంద్రం పక్కన ఉన్న నల్గొండ ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో టీఆర్‌ఎస్ నాయుకులు బస చేశారు. దీంతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు ‘‘కోమటిరెడ్డి గో బ్యాక్’’ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ వర్గీయుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment