మాట్లాడుతున్న నీళ్ల బానుబాబుగౌడ్, తదితరులు
ఇబ్రహీంపట్నం:ఎన్నికల సమయంలోæ పదవులపై రాద్దాంతం చేయడం ఎంతవరకు సమంజసమని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బానుబాబుగౌడ్ ప్రశ్నించారు. శనివారం పార్టీ నాయకులు రాఘవేందర్, కిరణప్ప, ఎండీ గౌస్‌పాషలతో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. పీసీసీ కార్యదర్శిగా చెప్పుకునే దండెం రాంరెడ్డికి రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలని లేదా అని ప్రశ్నించారు. మరో ఐదు రోజుల్లో లోక్‌సభ ఎన్నికలుంటే దండెం రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ పదవులపై మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
కొంతమంది మల్‌రెడ్డి బ్రదర్స్‌కు టికెట్ రాకుండా చేసినా వారు కార్యకర్తలు, నాయకుల అభీష్టం మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉన్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ బతికి ఉందంటే కేవలం మల్‌రెడ్డి బ్రదర్స్ పుణ్యమేనన్నారు. ప్రత్యర్థులతో ములాఖాత్ కావడంతోనే దండెం రాంరెడ్డి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో పార్టీలో గ్రూప్‌లను ప్రోత్సహించే విధంగా మాట్లాడుతున్న దండెం రాంరెడ్డిపై పార్టీ పరంగా క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఇమ్రాన్, చోటు, రాకేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment