malreddy rangareddy
-
పదవులపై రాద్దాంతం ఎందుకు..?
ఇబ్రహీంపట్నం:ఎన్నికల సమయంలోæ పదవులపై రాద్దాంతం చేయడం ఎంతవరకు సమంజసమని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బానుబాబుగౌడ్ ప్రశ్నించారు. శనివారం పార్టీ నాయకులు రాఘవేందర్, కిరణప్ప, ఎండీ గౌస్‌పాషలతో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. పీసీసీ కార్యదర్శిగా చెప్పుకునే దండెం రాంరెడ్డికి రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలని లేదా అని ప్రశ్నించారు. మరో ఐదు రోజుల్లో లోక్‌సభ ఎన్నికలుంటే దండెం రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ పదవులపై మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కొంతమంది మల్రెడ్డి బ్రదర్స్‌కు టికెట్ రాకుండా చేసినా వారు కార్యకర్తలు, నాయకుల అభీష్టం మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉన్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ బతికి ఉందంటే కేవలం మల్రెడ్డి బ్రదర్స్ పుణ్యమేనన్నారు. ప్రత్యర్థులతో ములాఖాత్ కావడంతోనే దండెం రాంరెడ్డి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో పార్టీలో గ్రూప్‌లను ప్రోత్సహించే విధంగా మాట్లాడుతున్న దండెం రాంరెడ్డిపై పార్టీ పరంగా క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఇమ్రాన్, చోటు, రాకేష్ పాల్గొన్నారు. -
పట్నంలో పోటీకి ఓకే
సాక్షి, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం స్థానం నుంచి పోటీ చేసేందుకు సామ రంగారెడ్డి అంగీకరించారు. మొదటి నుంచి ఎల్బీనగర్లో పోటీ చేయాలని ఆయన ఆసక్తి కనబరిచినా కూటమి పొత్తులో భాగంగా ఆ సీటు కాంగ్రెస్ ఖాతాలోకి పోయింది. దీంతో ఇబ్రహీంపట్నం సీటు టీడీపీకి దక్కింది. ఇక్కడి నుంచి పార్టీ అభ్యర్థిగా సామ రంగారెడ్డిని అధిష్టానం ఖరారు చేసింది. అయితే, పట్నంలో పోటీచేసేందుకు రంగారెడ్డి ససేమిరా అన్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుతో మాట్లాడేందుకు అమరావతికి వెళ్లారు. బాబు బుజ్జగింపులతో మొత్తబడ్డ ఆయన ఎట్టకేలకు పోటీకి అంగీకారం తెలిపారు. కాగా, ఈ టికెట్‌ను ఆశించి భంగపడ్డ రొక్కం భీంరెడ్డికి నచ్చజెప్పి రెబల్‌గా నిలబడకుండా టీడీపీ నాయకులు వ్యూహరచన చేస్తున్నారు. క్యామ మల్లేష్‌తో సామ భేటీ కాంగ్రెస్ పార్టీలో మల్రెడ్డి రంగారెడ్డికి ప్రత్యర్థిగా నిలిచిన డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌తో టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. తనకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కోరారు. అయితే, తనకు అన్యాయం చేసిన పీసీసీ ఛీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై వ్యతిరేకం తప్ప మహాకూటమికి కాదని మల్లేష్ తెలిపారు. తన సంపూర్ణ మద్దతు ఉంటుందని సామ రంగారెడ్డికి చెప్పారు. స్వతంత్ర అభ్యర్థిగా మల్రెడ్డి పట్టు వదలకుండా ఢిల్లీలో తిష్టవేసి కాంగ్రెస్ టికెట్ కోసం పైరవీలు చేస్తున్న మల్రెడ్డి రంగారెడ్డి తనకు టికెట్ రాకుంటే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉంటాడనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. అయితే మల్రెడ్డి బరిలో ఉంటే క్యామ మల్లేష్ కూడా స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉండే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
ఎమ్మెల్యే మంచిరెడ్డికి నయీంతో సంబంధాలు!
సైదాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీంతో కలిసి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి భూ దందాలు కొనసాగించాడని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. నయీం దాచిపెట్టిన నగదు మంచిరెడ్డి వద్దే ఉందని ఆ విషయాన్ని అతడిని అరెస్ట్ చేసి విచారిస్తే తెలుస్తుందని అన్నారు. అమాయక రైతులను బెదిరించి మంచి ఇన్ ఫ్రా పేరుతో లూటి చేశాడన్నారు. సైదాబాద్ డివిజన్ తిరుమలాహిల్స్‌లోని తన నివాసంలో ఆదివారం మల్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేతో పాటు అతని కుమారుడు ప్రశాంత్‌రెడ్డి చేసిన భూ దందాలు స్థానికులకు తెలుసన్నారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన వరకు కిషన్ రెడ్డి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడని అన్నారు. నయీంను అడ్డు పెట్టుకొని దందాలు సాగించడాని తెలిపారు. ఇబ్రహీంపట్నంలో సిట్ అధికారులు అరెస్ట్ చేసిన శ్రీహరితో కలిసి మంచిరెడ్డి భూ లావాదేవీలు సాగించారని అన్నారు. ఆదిభట్లలో సర్వేనెంబర్లు 165–197, 216–218, 292, 290, 209, 300 నెంబర్లలో గల భూములను నయీంతో కలిసి మంచిరెడ్డి కాజేశాడని విమర్శించారు. ఒకే డాక్యుమెంట్లో శ్రీహరితో పాటు మంచిరెడ్డి పేరు ఉంటే శ్రీహరిని మాత్రమే అరెస్ట్ చేసి ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని ఎలా వదిలేస్తారని ప్రశ్నించారు. నయీం కేసు నిష్పక్షపాతంగా సాగాలంటే మంచిరెడ్డిని అరెస్ట్ చేసి సీబీఐ చేత విచారించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తమ వద్ద ఉన్న ఆధారాలను సిట్ అధికారులకు అందించినట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం కాంగ్రెస్‌పార్టీ సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
'నయీంతో నాకెలాంటి సంబంధాలు లేవు'
-
'నయీంతో నాకెలాంటి సంబంధాలు లేవు'
హైదరాబాద్: మల్రెడ్డి రంగారెడ్డి తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని కిషన్‌రెడ్డి సవాలు విసిరారు. రాజకీయ లబ్దికోసమే మల్రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గ్యాంగ్‌స్టర్ నయీంతో తనకెలాంటి సంబంధాలు లేవని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాగా, అంతకుముందు మల్రెడ్డి రంగారెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..మంచిరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నయీం ప్రధాన అనుచరుడు శ్రీహరితో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నయీం కేసులో శ్రీహరిని అరెస్ట్ చేసిన పోలీసులు మంచిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని రంగారెడ్డి ప్రశ్నించారు. శ్రీహరితో కలిసి ఎమ్మెల్యే రూ.300 కోట్లు సంపాదించాడని ఆయన ఆరోపించారు. ఆదిభట్లలోని భూ కబ్జా విషయాలు బయటకొస్తాయనే భయంతోనే మంచిరెడ్డి పార్టీ మారారన్నారు. ఎమ్మెల్యే అవినీతిపై ఇబ్రహీంపట్నం చౌరస్తాలో బహిరంగ చర్చకు సిద్ధమని రంగారెడ్డి సవాల్ విసిరారు. -
'తల్లీ తనయుడు డుమ్మా కొట్టారు'
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భవిష్యత్ కార్యాచరణ సదస్సుకు జిల్లాకు చెందిన పలువురు సీనియర్లు గైర్హాజరు అయ్యారు. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డితో పాటు ఆమె వర్గంగా పేరొందిన పలువురు నాయకులు సదస్సుకు డుమ్మా కొట్టారు. పార్టీకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానంటూ ఇటీవలి జరిగిన పలు సమావేశాల్లో సబితా ఉద్ఘాటించగా... తాజా సదస్సుకు దూరంగా ఉండటంపై అక్కడి నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. మరోవైపు ఇబ్రహీంపట్నంలో తలపెట్టిన సదస్సుకు పార్టీలో కీలకంగా వ్యవహరించే మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సైతం హాజరు కాలేదు. జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ నేతలంతా సదస్సుకు గైర్హాజరు అయినట్లు సమాచారం. -
మహేశ్వరంలో కాంగ్రెస్ అభ్యర్థిగానే మల్రెడ్డి
తెలంగాణ ప్రాంతంలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అయినా.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మాత్రం మల్రెడ్డి రంగారెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. పొత్తులో భాగంగా సీపీఐకి ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. అయితే, మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పట్టుబట్టి మరీ మల్‌రెడ్డితో నామినేషన్ దాఖలు చేయించారు. టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తదితరులు ఆయనకు షరతులతో కూడిన బీఫారం ఇచ్చి, అధికారిక కాంగ్రెస్ అభ్యర్థిగా చేసేశారు. తర్వాత సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణతో చర్చలు జరిపిన తర్వాత మల్‌రెడ్డిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని కోరినా, ఆయన నిరాకరించారు. బీఫారం చేతిలో ఉండటంతో ఆయన ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీలో ఉన్నట్లయింది. సీపీఐ అభ్యర్థి ఇప్పుడు ఇతర పార్టీల అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డితో కూడా పోటీ పడాల్సి వస్తోంది.