మహేశ్వరంలో కాంగ్రెస్ అభ్యర్థిగానే మల్రెడ్డి | malreddy rangareddy denies to withdraw nomination | Sakshi
Sakshi News home page

మహేశ్వరంలో కాంగ్రెస్ అభ్యర్థిగానే మల్రెడ్డి

Published Sat, Apr 12 2014 4:25 PM | Last Updated on Mon, Sep 17 2018 5:56 PM

మహేశ్వరంలో కాంగ్రెస్ అభ్యర్థిగానే మల్రెడ్డి - Sakshi

మహేశ్వరంలో కాంగ్రెస్ అభ్యర్థిగానే మల్రెడ్డి

తెలంగాణ ప్రాంతంలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అయినా.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మాత్రం మల్రెడ్డి రంగారెడ్డి తన నామినేషన్ను ఉపసంహరించుకోలేదు. పొత్తులో భాగంగా సీపీఐకి ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. అయితే, మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పట్టుబట్టి మరీ మల్రెడ్డితో నామినేషన్ దాఖలు చేయించారు.

టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తదితరులు ఆయనకు షరతులతో కూడిన బీఫారం ఇచ్చి, అధికారిక కాంగ్రెస్ అభ్యర్థిగా చేసేశారు. తర్వాత సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణతో చర్చలు జరిపిన తర్వాత మల్రెడ్డిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని కోరినా, ఆయన నిరాకరించారు. బీఫారం చేతిలో ఉండటంతో ఆయన ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీలో ఉన్నట్లయింది. సీపీఐ అభ్యర్థి ఇప్పుడు ఇతర పార్టీల అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డితో కూడా పోటీ పడాల్సి వస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement