
మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి, నల్లగొండ : ఆర్‌జేడీ పార్టీ నల్లగొండ నియోజవర్గ ఇన్‌చార్జ్, తెలంగాణ యువజన విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ ఆవుల రామన్నయాదవ్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. గురువారం అఖిల్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కూటమి నేతలు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్‌జేడీ పార్టీ నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొని కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్‌జేడీ ఇన్‌చార్జ్ రామన్న యాదవ్ మాట్లాడుతూ నల్లగొండలో అభివృద్ధి ఆగవద్దనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామన్నారు. అభివృద్ధి విషయంలో కోమటిరెడ్డి పట్టు వదలని విక్రమార్కుడిలా పనిచేస్తున్నాడని ప్రశంసించారు. తెలంగాణ కోసం మంత్రి పదవినే వదులుకున్న త్యాగశీలి కోమటిరెడ్డి అని కొనియాడారు. ప్రజలు కోమటిరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ ఆర్‌జేడీ పార్టీ తనపై నమ్మకం ఉంచి మద్దతు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధిలో నల్లగొండను హైదరాబాద్‌కు ధీటుగా చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాదగోని శ్రీనివాస్‌గౌడ్, దూదిమెట్ల సత్తయ్య, అల్లి సుభాష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment