
రాయగిరి రైతులతో ఎంపీ కోమటిరెడ్డి
సాక్షి, యాదాద్రి: రీజినల్ రింగ్ రోడ్డుతో భూములు పూర్తిగా కోల్పోతున్న రాయగిరి రైతుల సమస్యను కేంద్ర మంత్రి గడ్కరీని సోమవారం కలిసి వివరిస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. శనివారం భువనగిరిలో రాయగిరి నిర్వాసితులు ఎంపీ వెంకట్‌రెడ్డిని కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. వారితో ఎంపీ మాట్లాడుతూ.. కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ సోమవారం మధ్యాహ్నం అపాయింట్‌మెంట్ ఇచ్చారని, ఆయనతో రీజినల్ రింగ్‌రోడ్డు సమస్యలపై చర్చిస్తానని చెప్పారు.
రాయగిరితోపాటు పలుచోట్ల్ల త్రిబుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్చాలని వినతులు వచ్చినట్లు చెప్పారు. కేంద్రమంత్రిని కలిసి స్థానిక సమస్యలు తెలిపి అలైన్‌మెంట్ మార్చే విధంగా చూస్తానని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment