కరెంట్ సమస్యలకు కేసీఆర్ అశ్రద్ధే కారణం: కోమటిరెడ్డి | Komatireddy venkatareddy takes on KCR | Sakshi
Sakshi News home page

కరెంట్ సమస్యలకు కేసీఆర్ అశ్రద్ధే కారణం: కోమటిరెడ్డి

Published Wed, Nov 5 2014 3:12 PM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

కరెంట్ సమస్యలకు కేసీఆర్ అశ్రద్ధే కారణం: కోమటిరెడ్డి

కరెంట్ సమస్యలకు కేసీఆర్ అశ్రద్ధే కారణం: కోమటిరెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ సమస్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అశ్రద్ధే కారణమని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను కాంగ్రెస్లోనుంచి టీఆర్ఎస్లోకి వెళ్లాలనుకుంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వెళ్తానని కోమటి కుండబద్దలు కొట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీతో ఇన్నాళ్లు అంటీముట్టనట్టుగా వ్యవహరించిన ఆయన టీఆర్ఎస్లోకి వెళుతున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

కాగా, కాంగ్రెస్ హయాంలో కరెంట్ విషయంలో శంకర్పల్లి, నేదునూయ ప్రాజెక్టులకు గ్యాస్ కేటాయించలేదనే వాస్తవాన్ని తాను చెప్పినట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement