సాక్షి, నల్గొండ : తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంపై కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణలో ప్రభుత్వం లేదనడానికి ఇంటర్ ఫలితాలే నిదర్శనమని, ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దీనిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి, తమ జిల్లా వ్యక్తి కావడం సిగ్గుచేటన్నారు. ఆయనను వెంటనే మంత్రి పదవినుంచి డిస్మిస్ చెయ్యాలని డిమాండ్ చేశారు.
రెవెన్యూశాఖను ముఖ్యమంత్రి వద్ద ఉంచుకొని అవినీతి జరుగుతుందని చెప్పడం సిగ్గుచేటన్నారు. రెవిన్యూ శాఖ మంత్రిని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. నాయకులు వెళ్లిపోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఏమీకాదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment