
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(పైల్ ఫోటో)
హైదరాబాద్ : టీఆర్ఎస్‌లోకి రానందుకే కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్‌ను హత్య చేశారని నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. విలేకరులతో మాట్లాడుతూ..ముమ్మాటికీ ఇది రాజకీయ హత్యేనన్నారు. సీబీఐ విచారణ కోసం కోర్టును ఆశ్రయించామని తెలిపారు. కాల్ డేటా ఇవ్వబోమని సీఎం చెంచాలు చెబుతున్నారని..ఆ మాట హోం మంత్రి లేదా డీజీపీ చెప్పాలని అడిగారు. సీఎం హత్యారాజకీయాలకు ప్రణాళికలు రచించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మార్చిలోపు 50 శాతం అభ్యర్థులను ప్రకటించాలని తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి కుంతియాకు చెప్పానని తెలిపారు. హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించానని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి పాదయాత్ర చేయాలని చెప్పానని, బాధ్యతలిస్తే తెలంగాణ అంతా తిరుగుతానని, లేదంటే నల్గొండలో అన్నీ స్థానాలు గెలిపించే ప్రయత్నం చేస్తానని అన్నారు.
మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ..
టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధంగానే ఉన్నాడని తెలిపారు. తన కంటే ముందు రాజీనామా చేసిన వాళ్లవి స్పీకర్ ఇంకా ఆమోదించలేదని, తనది కూడా పెండింగ్‌లో పెడతారేమోననే ఉద్దేశంతో ఆగాడని స్పష్టం చేశారు. ముందు ఇచ్చిన వారివి ఆమోదిస్తే తక్షణం రాజీనామా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment