'రాజకీయ సన్యాసానికి కిరణ్ కట్టుబడి ఉండాలి'
హైదరాబాద్ : రాజకీయ సన్యాసంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు విభజన బిల్లు పార్లమెంట్కు వెళితే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న మాటకు కిరణ్ కట్టుబడి ఉండాలని మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అంతే కాకుండా తెలంగాణ బిల్లు పార్లమెంట్కు వెళ్లకుంటే తామంతా రాజకీయాల నుంచి తప్పుకుంటామని ఆయన సవాల్ విసిరారు. అందుకు కిరణ్ సిద్ధంగా ఉన్నారా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.